అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు ఇటీవల విడుదలైంది. రకుల్, కేథరిన్ నాయికలు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ నిర్మాత. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
కేథరిన్ మాట్లాడుతూ ``ఇందులో ఫుల్ కేరక్టర్ విని చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఈ పాత్ర కోసం చాలా వర్క్ చేశా. అయితే కేథరిన్‌గా బిహేవ్ చేస్తే చాలని చెప్పారు. బోయపాటిగారు ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటారు. కాస్ట్యూమ్స్, జువెలరి, ఆ ఖరికి నా హెయిర్ స్టైల్ విషయంలోనూ శ్రద్ధ తీసుకునేవారు. అర్జున్‌తో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. సినిమా మీద పేషనేట్ వ్యక్తులు చేశారు. హిట్ అయినందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ``బన్నితో సినిమా చేయాలని నా కోరిక. నేను హీరోగా చేస్తూనే మిగిలిన హీరోల సినిమాల్లో నటిస్తుంటాను. అరవింద్‌గారు పిలిచి ఈ సినిమాలో పాత్ర ఉందనగానే కాల్షీట్ ఎప్పటి నుంచి కావాలి? అని అడిగాను. తన బ్యాక్‌గ్రౌండ్ సెపరేట్‌గా ఉండాలనే భావన బన్నిలో ఉంది. మంచి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఆయనకు ఆ కోరిక ఉంది. బోయపాటి నా చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అప్పుడు డైలాగులు రాసేవాడు. ఈ సినిమాతో అతను ఇంకా గొప్ప దర్శకుడయ్యాడు. ఫ్యూచర్‌లో మా అబ్బాయితో సినిమా చేయాలని ఆకాంక్షిస్తున్నాను. బన్ని సెంటిమెంట్‌ను చాలా బాగా పండించాడు`` అని అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ ``ఈ సినిమాకు వచ్చినన్ని ఫోన్ కాల్స్ నాకు మరే సినిమాకూ రాలేదు. బన్ని పక్కవాళ్లకు కూడా స్పేస్ ఇవ్వడం తెలిసిన ఆర్టిస్ట్. నా సొంత ప్రొడక్షన్ లో ఎంత కంఫర్ట్ గా ఫీలయ్యి నటించానో, ఈ సినిమాలోనూ అంతే కంఫర్ట్ గా పీలయ్యాను. ఎమోషన్స్ వర్కవుట్ అయిన బెస్ట్ సినిమా ఇది`` అని చెప్పారు.
రకుల్ మాట్లాడుతూ ``రకుల్ అంటే గ్లామర్, స్టైల్ అనే అనుకుంటారు. కానీ నాలో నుంచి పెర్ఫార్మెర్‌ను బయటకు తీసుకొచ్చిన ఘనత బోయపాటిగారిది. ఇందులో నేను ఏడ్చే సీన్లు చూసి మా పేరెంట్స్ కూడా కంటతడిపెట్టుకున్నారు. లాంగ్వేజ్ రాకపోయినా వారు సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా చూశాక బన్నితో నాకు ఫ్యాన్ మూమెంట్ వచ్చింది. క్లైమాక్స్ చాలా బావుంటుంది`` అని చెప్పారు.
బన్ని మాట్లాడుతూ ``స్క్రిప్ట్ నచ్చి ఒప్పుకున్నా. ఫస్టాఫ్‌లో కోర్టు సీను, సెకండాఫ్‌లో ఎమోషనల్ సీను సినిమాను షిఫ్ట్ గేర్ చేశాయి. బోయపాటిగారు చెప్పిన కథను చాలా బాగా తెరపై ట్రాన్స్ లేట్ చేశారు.. ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. అంజలి టాప్ హీరోయిన్‌గా ఉంటూ ఐటమ్ సాంగ్ చేసింది. రకుల్ చాలా బాగా నటించింది. కేథరిన్ ఆది నుంచీ ఈ సినిమాపై నమ్మకం పెట్టుకుంది. ఈ సినిమాతో మాస్‌లోకి వెళ్లాలనే నా గోల్ 200 శాతం నెరవేరింది. గీతా ఆర్ట్స్ లో నేను ఇంతకు ముందు చేసిన హ్యాపీ, భద్రినాథ్ పెద్దగా ఆడలేదు. కానీ మంచి హిట్‌ను ఈ సినిమాతో కొట్టాననే తృప్తి ఉంది. నేను కోరిన గొంతెమ్మ కోరికలను తీర్చిన మా నాన్న నా కెరీర్‌లోమంచి గ్రాసర్‌ని ఇచ్చారు. నాతోనే కాదు చిరంజీవిగారితో పనిచేసిన రోజుల్లోనూ ఆల్‌టైమ్ గ్రాసర్‌లు ఇచ్చేవారు. పవన్‌కల్యాణ్‌గారికి జల్సా, చరణ్‌కి మగధీర, నాగచైతన్యకు 100లవ్, నానికి భలే భలే మగాడివోయ్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఈ సినిమాను ఇచ్చారు. నేను బాగా కష్టపడతానని అందరూ అంటారు. నాకన్నా ఎక్కువగా బోయపాటి కష్టపడతారు. ఆ విషయాన్ని నేను చాలా మందితో చెప్పాను. ఆయన కష్టం కోసమైనా సినిమా హిట్ కావాలని అనుకునేవాడిని. మా నాన్నకు సినిమా అంటే పేషన్ ఎక్కువ. నేను, మా తమ్ముడు, మా నాన్న కలిసి వాట్సప్ గ్రూపులో ఉంటే ఆ గ్రూపుకు మేం విలవ్ సినిమా అనే పేరు పెట్టుకున్నాం`` అని అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ``ప్రతి సినిమానూ నేను మొదటి సినిమాగానే భావిస్తాను. కథ విని నన్ను నమ్మి ఈ సినిమా చేశారు. నన్ను నమ్మిన డిస్ట్రిబ్యూటర్ల కోసం, ప్రేక్షకుల కోసం హిట్ కొట్టాలనే తపనతోనే పనిచేశాను. ఈ సినిమాకు నటీనటులందరూ చాలా బాగా కుదిరారు. శ్రీకాంత్‌గారు ప్రాణం పోశారు. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో అలా నిలిచిపోయారు. అరవింద్‌గారు చాలా పేషనేట్ నిర్మాత. గుండెల మీద చెయ్యి వేసుకుని సినిమా చూడమని చెప్పాను. సినిమా చూసిన వారు హిట్ అంటే ఆనందంగా ఉంది. రెవెన్యూ చూసుకున్న తర్వాత ఇంకా ఆనందంగా ఉంది`` అని అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ``కథ విన్నప్పుడు సినిమాపై నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతో ఖర్చుపెట్టాను. చిన్నపిల్లాడు చాక్లెట్లు అడిగినట్టు బన్ని కాస్ట్ లీ కోరికల్ని కోరుతుంటాడు. బోయపాటి ఈ కథను ఆరు నెలలపాటు చేశాడు. తనకు మాస్ ఇమేజ్ లేదని బన్ని చెప్పినప్పుడు నాకు బోయపాటి గుర్తుకొచ్చి కొడితే రెండు చెక్కలై మాస్ గుండెల్లో కూర్చునేలా చేసే వ్యక్తి బోయపాటి అని చెప్పాను. అనుకున్నట్టే చేశాడు. నేను, బన్ని కలిసి అతనిపై బెట్ పెట్టాం. మా అబ్బాయికే సినిమాలంటే పిచ్చి అని అనుకుంటా. బోయపాటి అంత కన్నా ఎక్కువ పేషన్‌తో పనిచేశాడు. ఆది, కేథరిన్,రకుల్, శ్రీకాంత్ అందరూ బాగా చేశారు. ఆదివారం థియేటర్లను పెంచాం. సోమవారం మ్యాట్నీ కలెక్షన్లు చూసుకున్నాక నేను నిర్మాతగా లెక్కలు వేయడం మొదలుపెట్టాను`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయికుమార్, విద్యుల్లేఖ రామన్, రామజోగయ్యశాస్త్రి, రామ్ లక్ష్మణ్, బన్నీవాసు, శానం నాగ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.