అల్లరి నరేష్, సాక్షిచౌదరి, కామ్నారనావత్ హీరో ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లి. సుంకర రామబ్రహ్మం సమర్పణలో గోపి ఆర్ట్స్ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'సెల్ఫీరాజా'. జూలై 15న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్ కామ్నా రనావత్, దర్శకుడు ఈశ్వర్ రెడ్డి, నిర్మాత చలసాని రామబ్రహ్మం చౌదరి, పృథ్వీ, అజయ్ ఘోష్, డైమండ్ రత్నం, వెంకట్రాజు, అప్పారావు, రాకెట్ రాఘవ, రచ్చ రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ ``ఈ సినిమా గతేడాది డిసెంబర్ 4న స్టార్టయ్యింది. ఆరోజు నుండి కథ ఎలా ఉంది. నటీనటులు, టెక్నిషియన్స్ ఎవరు వర్క్ చేస్తున్నారు. అంతా అనుకున్న బడ్జెట్ లో పూర్తవుతుందా అనే ఇన్ని ఆలోచనలతో చిన్నపాటి టెన్షన్ మనసులో ఉండేది. ఇలా సినిమా రిలీజ్ వరకు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూసుకునేవాడిని. మా టీం అందరి ఎనిమిది నెలల కష్టం ఈ సక్సెస్ రూపంలో కనపడుతుంది. ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది. అంత కలెక్ట్ చేసిందని చెప్పను కానీ నాకు సుడిగాడు సినిమా తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ తెచ్చి పెట్టిన సినిమా. ముఖ్యంగా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌తో పాటు సినిమా చేసిన నిర్మాత కూడా బావుండాలని. నాన్నగారు ఎప్పుడూ అనేవారు. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ నాకు ఫోన్ చేసి సినిమా చాలా బావుందని మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అనడం చాలా హ్యాపీగా అనిపించింది. దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి సినిమాను చక్కగా తెరకెక్కిస్తే, శ్రీధర్ సీపాన, డైమండ్ రత్నబాబు, సినిమాటోగ్రాఫర్ లోకనాథన్‌గారు, పృథ్వీగారు, అజయ్‌ఘోష్‌గారు ఇలా యూనిట్‌లో ప్రతి ఒక్కరూ ఇష్టపడి, కష్టపడి చేసిన స
ినిమా ఇది. మరో విషయం ఏమిటంటే గజదొంగ వంటి ఎన్నో మంచి హిట్ చిత్రాలను నిర్మించిన గోపి ఆర్ట్స్ బ్యానర్, చాలా గ్యాప్ తర్వాత నిర్మించిన ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
నిర్మాత చలసాని రామబ్రహ్మం చౌదరి మాట్లాడుతూ ``సినిమాను అందరూ కష్టపడి చేశాం. సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
డైరెక్టర్ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ``రెండేళ్ళ తర్వాత నేను నరేష్‌గారితోనే సినిమా చేశాను. అయినా చిన్న టెన్షన్ ఉంది. సినిమా రిలీజ్ తర్వాత జగపతిబాబుగారు, తర్వాత నితిన్‌గారు నాకు ఫోన్ చేసి సినిమాతో సక్సెస్ కొట్టావని చెప్పడంతో ధైర్యం వచ్చింది. నాపై నమ్మకంతో నరేష్‌గారు నాతో సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్. ఆయన ఈ సినిమాతో నాకు మరో హిట్ అందించారు. ఆయన ఒప్పుకుంటే ఆయనతో హ్యాట్రిక్ సినిమా చేయడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే. సాయికార్తీక్ మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే సపోర్ట్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్`` అన్నారు.
డైమండ్ రత్నం మాట్లాడుతూ `` సుడిగాడు చిత్రానికి సమానంగా కలెక్షన్స్ సాధించిన చిత్రమిది. పృథ్వీ, తాగుబోతు రమేష్ కామెడి చక్కగా పండింది. మాస్ ఆడియెన్స్‌కు బాగా నచ్చిన చిత్రమిది. సీమశాస్త్రి తర్వాత నరేష్‌గారితో మంచి పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు ముందు కొన్ని సినిమాల్ల స్పూఫ్‌లు చేయని ఆయన ఈ సినిమాకు అవసరమని స్పూఫ్‌లు అవసరమని భావించి చేశారు. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా అతిథులు సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని తెలియజేశారు.