pizza
Srirastu Subhamastu success meet
`శ్రీరస్తు శుభమస్తు` సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 August 2016
Hyderaba
d

Allu Sirish’s Youthful family entertaier Srirastu Subhamastu is running successfully in several screens across the Telugu states. The film have collected about 11crores gross so far. The film success meet has been held today and veteran director Dasari Narayana Rao along with star directors VV Vinayak, Sukumar and Nandini Reddy have attended the event as chief guests.

While speaking at the event, Dasari said, “Sirish has done wonderful job in the film. I liked Parasuram’s taking. He is indeed one of the best directors in the current generation. In fact, I introduced Sirish, Bunny (Allu Arjun) and Mahesh Babu as child artists to film industry.

Srirastu Subhamastu has really come out well. Growth in collections every day is proof of stamina in film’s content. It is good thing for industry that small time films like Kshanam, Pelli Choopulu and Srirastu Subhamastu performing well at box office. In fact, I am brand ambassador for small films like these.

Thankfully, Sirish didn’t pick a heroism based subject. He chose what kind of a subject he suits best for. Geetha Arts production had been started in my hands (First 2 films under the production- Banthrotu Bharya and Devude Digivaste were directed by Dasari). I am happy to see Sirish making his mark in the industry.”

VV Vinayak said, “Heroes of Sirish’s generation is curious for mass films and punch dialogues. But, Sirish is not like that. Only thing he concerns about is his character and story. I am happy that Sirish is doing lover boy kind of roles, family drama films and films with soft content. With this encouragement from him, filmmakers will dare to prepare such subjects.”

Sukumar said, “I need to compliment Sirish on one thing. He dominated Bunny in his third film. His voice and comedy timing are far better than Bunny. I’ve conveyed the same to Bunny also. As far as I know, Parasuram is the best writer in industry after Trivikram.”

Nandini Reddy said, “I know how hard work both Bunny and Sirish put in for their films. When we usually meet, only thing we discuss about is cinema. Srirastu Subhamastu has become a big hit because of Sirish’s hard work.”

Parasuram said, “I thank everyone for coming here and blessing our cinema. I’m truly blessed to have such sweet and encouraging words from Dasari gaaru. I’m overwhelmed with all your compliments.”

Sirish said, “I’m more happy for several star directors complimenting our film, rather than what the film is collecting at box office. Only thing I believe is directors can only provide hits to any actors. All the success credit should be given to my director. I thank Parasuram for that. Dasari gaaru speaking about our film is biggest achievement for us.”

`శ్రీరస్తు శుభమస్తు` సక్సెస్ మీట్

అల్లు శిరీష్‌ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ ప్రముఖ దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఈ చిత్రం ఆగస్ట్‌ 5న ఈ చిత్రం విడుదలై మంచి కలెక్షన్స్‌తో సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకరత్న డా.దాసరి నారాయణరావువి.వి.వినాయక్‌సుకుమార్‌అల్లుశిరీష్‌నందినీ రెడ్డి,పరుశురాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ ''సినిమా చూసి ఏదో ఒక చానెల్‌లో కాంప్లిమెంట్స్‌ ఇస్తానని అరవింద్‌కు చెప్పగాఅలా కాదండని చెప్పి ఈ ప్రెస్‌మీట్‌ను నా కోసం ఏర్పాటు చేశారు కాబట్టిఇది నా ప్రెస్‌మీట్‌గా నేను భావిస్తాను. నేను డైరెక్ట్‌ చేసిన బంట్రోతు భార్య చిత్రంతోనే గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ ప్రారంభమైంది. 45 సంవత్సరాలుగా విజయవంతమైన చిత్రాలను తీస్తూ రావడం గొప్ప విషయం. నా మాయబజార్‌ సినిమాలోనే బన్నిని నేను నటుడిగా ఇంట్రడ్యూస్‌ చేసిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికి అర్జున్‌ కంటే శిరీష్‌నే నటుడుగా చేయాలని అల్లు రామలింగయ్య అనుకునేవారు. లోకేషన్స్‌కు కూడా తీసుకువచ్చేవారు. శిరీష్‌ హీరోగానే కాకుండా మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. అది చిరంజీవిగారి అడుగుజాడల్లో నడవడం వల్లనోఅరవింద్‌ పెంపకం వల్లనో మంచి క్రమశిక్షణ వచ్చింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇలాంటి సినిమాలను చూసినప్పుడు వీటికి నేను బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే బావుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ బావుండాలంటే చిన్న సినిమా బ్రతకాలి. పెద్ద సినిమాలు ఎలాగూ ఆడుతాయి. అందరూ చిన్న సినిమాల నుండే పైకి వచ్చినవారు. కానీ ఇప్పుడు చాలా వరకు సినిమాలను ఫ్యామిలీస్‌తో కలిసి చూడలేని పరిస్థితికి చేరకున్నాం. కానీ ఈ మధ్య కొన్ని సినిమాలు అందరూ మెచ్చేలా ఉన్నాయి. భలే భలే మగాడివోయ్‌ఊపిరిమనమంతాపెళ్ళిచూపులు ఇలా చాలా చిత్రాలు కంటెంట్‌ బేస్డ్‌గా వస్తున్నాయి. ఈ సినిమా ఇప్పుడు మంచి కలెక్షన్స్‌ను సాధిస్తూ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమా సక్సెస్‌లో ముందుగా దర్శకుడు పరుశురాంను అభినందించాలి. సినిమా చూస్తున్నంత సేపు నా సినిమాను నేను చూసుకున్నట్లే భావించాను.ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా మలిచాడు. గ్రేట్‌ కంటెంట్‌ వాల్యూస్‌తో సినిమా చేశాడు. ఈ సినిమా చూసిన పత్రి అమ్మాయిఅబ్బాయి తమ ప్రేమను గెలిపించుకోవడంతో పాటు పెద్దల అంగీకారం కూడా తీసుకోవాలనుకునేంత ఇంపాక్ట్‌ను చూపించింది. లావణ్య ఎంతో మెచ్యూర్డ్‌గా నటిస్తేరావురమేష్‌ సెటిల్డ్‌గా నటించాడు. తనికెళ్ళభరణి క్యారెక్టర్‌ చాలా రియలిస్టిక్‌గా ఉంది. సినిమాను చూసి నేను కూడా రెండు చోట్ల కంటతడి పెట్టుకున్నాను. ఇలాంటి సినిమాలే జనాలకు అవసరం. ఇలాంటి సినిమాలనే వారు ఆదరిస్తారు. అరవింద్‌ కమర్షియల్‌గా కాకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. ఇంత మంచి సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను'' అన్నారు.

Glam gallery from the event

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా టైటిల్‌పోస్టర్స్‌ చూసి ఇదేదో సెంటిమెంట్‌ సినిమా అనుకోవచ్చు కానీ ఇది మంచి కామెడి ఎంటర్‌టైనర్‌. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. యూత్‌ అందరికీ నచ్చే సినిమా. పరుశురాం మరోసారి మంచి రచయితగా ప్రూవ్‌ చేసుకున్నాడు. క్లైమాక్స్‌ త్రివిక్రమ్‌ స్టయిల్‌ డైలాగ్స్‌ రాశాడు. ఇక శిరీష్‌ గురించి చెప్పాలంటే తను పెద్ద బిజినెస్‌ మ్యాన్‌ అవుతాడనుకున్నాను కానీ తను హీరో అయ్యాడు. దాసరిలాంటి ఓ దర్శకుడిని ఇంప్రెస్‌ చేసేలా యాక్ట్‌ చేశాడంటే అంతకంటే ఇంకేం కావాలి. తనొక పెద్ద అచీవ్‌మెంట్‌ చేసినట్టే. అలాగే ప్రకాష్‌రాజ్‌ వంటి ఓ నటుడితో సమానంగా డైలాగ్‌ చెప్పడం అంటే అంత సులవు కాదు. కానీ ఆ సీన్‌లో కూడా చాలా చక్కగా నటించాడు. బన్ని తమ్ముడు కాబట్టి డ్యాన్సులు చేస్తాననోచిరంజీవిగారి మేనల్లుడు కాబట్టి ఫైట్స్‌ చేస్తాననో అనడకుండా తన కథలను వెతుక్కుంటున్నాడు. పరుశురాం నుండి మరో పెద్ద సినిమాను ఎదురుచూస్తున్నాం. తను అలాంటి సినిమా చేస్తాడని భావిస్తున్నాం'' అన్నారు.

సుకుమార్‌ మాట్లాడుతూ ''శిరీష్‌ హీరో అవుతాడని మొదటి తెలిసి వ్యక్తిని నేనేననుకుంటాను. ఎందుకంటే ఆ విషయాన్ని తన అమ్మగారు నాకు పిలిచి చెప్పారు. అదే విషయాన్ని శిరీష్‌ను అడిగితే లవర్‌బోయ్‌గానోపక్కంటి కుర్రాడిగానో చేస్తే తెలుగు సినిమాల్లో స్పేస్‌ ఉంటుంది కాబట్టి నేను సినిమాలను చేయగలనని అనుకుంటున్నానని నాతో అన్నాడు. ఇప్పుడు అలాంటి సినిమా చేసే మంచి సక్సెస్‌ సాధించాడు. ఓ రకంగా చెప్పాలంటే బన్ని వాయిస్‌మాడ్యులేషన్‌ కంటే శిరీష్‌ డైలాగ్‌ డెలివరీబాడీ లాంగ్వేజ్‌ బావున్నాయి. ఈ విషయాల్లో బన్నిని శిరీష్‌ క్రాస్‌ చేసేశాడు. అలాగే నాకు తెలిసి త్రివిక్రమ్‌గారి తర్వాత అంత బాగా డైలాగ్స్‌ రాయగల దర్శకుడెవరైనా ఉన్నారంటే అది పరుశురాం మాత్రమే. ఈ సినిమాతో మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్‌ చేశాడు. ఎంటైర్‌ టీంను అభినందిస్తున్నాను'' అన్నారు.

అల్లు శిరీష్‌ మాట్లాడుతూ ''ఓ సినిమా హిట్‌ అనేది డైరెక్టర్స్‌ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన దర్శకుడు పరుశురాంగారికి థాంక్స్‌. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా ఆయనకే దక్కుతుంది'' అన్నారు.

దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ ''నన్ను నమ్మి శిరీష్‌ను నాకు అప్పగించిన అల్లు అరవింగ్‌గారికి థాంక్స్‌. నా ప్రయతాన్ని నేను సిన్సియర్‌గానే చేశానని భావిస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్‌ఎమోషన్స్‌ ను ఆధారంగా చేసుకుని చేసిన ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది'' అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ ``అరవింద్ గారి ఫ్యామిలీతో 10-12 ఏళ్ల అనుబంధం ఉంది. వర్క్ పట్ల మంచి డేడికేషన్ ఉన్న ఫ్యామిలీ. ఈ సినిమాలో శిరీష్ కష్టమంతా తెరపై కనపడింది. పరుశురాంగారి సినిమాలను చాలా ఇష్టంగా చూస్తాను. ఈ సినిమాలో కూడా ఆయన మంచి ఎమోషన్స్ ను క్యారీ చేశారు`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved