
25 August 2025
Hyderabad
హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. సుందరకాండ వెరీ హ్యాపీ జర్నీ. ఈ జర్నీలో పార్ట్ ఆయన అందరికీ థాంక్యు. ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ వెంకీ. నాతో ఆరేళ్లుగా జర్నీ చేస్తున్నాడు. ఇది వెరీ మెమొరబుల్. సుందరకాండ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. చాలా సినిమా చేశాను. ప్రతి సినిమాకి ఇంకేదో చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పూర్తి సాటిస్ఫాక్షన్ తో ఉన్నాను. సంతోష్ ఈ సినిమాతో ప్రొడక్షన్ లోకి వచ్చాడు. చాలా సపోర్ట్ చేశాడు. నిర్మాతలు అందరికీ థాంక్యూ. చాలా వండర్ఫుల్ టీం తో వర్క్ చేశాను. వాసుకి గారు ఇందులో నా సిస్టర్ గా కనిపిస్తారు. తన పర్ఫార్మెన్స్ మీ అందరిని ఆకట్టుకుంటుంది. నరేష్ గారితో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సత్యకి థాంక్స్. తన క్యారెక్టర్ ని మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసిన శ్రీదేవి గారికి థాంక్యూ. తన పర్ఫామెన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటుంది. తనకి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను. వృత్తి ఐరా క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా చేసింది. తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ సినిమాతో తనకి మరిన్ని సక్సెస్ లు రావాలని కోరుకుంటున్నాను. లియాన్ జేమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తన మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్. సాంగ్స్ విన్న వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే మా డీవోపీ, ఆర్ట్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్స్ అందరూ గ్రేట్ వర్క్ ఇచ్చారు. ఆగస్టు 27న వినాయక చవితి రోజు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా అంటే నేను ఒక్కడినే కాదు.. దానివెనక ఎంతోమంది ఉంటారు. వాళ్ల కష్టం దాగి ఉంటుంది. థియేటర్‌కు వెళ్లి చూసి నచ్చితేనే సపోర్ట్ చేయండి. నచ్చకపోతే మీకు నచ్చింది రాయండి. ఏది రాసినా సినిమా చూశాకే రాయండి. మీరందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని గ్యారంటీ ఇస్తున్నాను. వినాయక చవితి జరుపుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూడండి. మమ్మల్ని ఆశీర్వదించండి.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సుందరకాండ సినిమాని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను. రోహిత్, వెంకీ ప్రొడ్యూసర్స్ అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారు. రోహిత్ ‘భైరవం’ సెట్‌లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడుతూ ఉండేవారు. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత ఈజీ కాదు. దానివెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. దూరపు కొండలు నునుపు అంటుంటారు కదా.. దాన్ని నేను బాగా నమ్ముతాను. దూరం నుంచి చూసేవారంతా ఈ ఇండస్ట్రీలో పనిచేసే వారిని సినిమా వాళ్లులే అని ఈజీగా అనేస్తారు. దానివెనక ఎన్నో త్యాగాలు, మరెన్నో ఒడుదొడుకులు ఉంటాయి. వాటిని దాటుకొని రాగలిగితేనే ఇక్కడ వుండగలం. రోహిత్ గారు మొదటినుంచి భిన్నమైన కథలు ఎంచుకుంటుంటారు. ఏ సపోర్ట్ లేకుండా సొంతంగా ఈ స్థాయికి వచ్చారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ వచ్చారు. సుందరకాండ చాలా బావొచ్చింది. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. శ్రీదేవి, నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. చెన్నైలో పెద్ద రౌడీ తను. నన్ను సరదాగా ర్యాగింగ్ చేసేది(నవ్వుతూ). ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మనందరి ఫేవరెట్ నటసింహ బాలకృష్ణ గారు వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. ఆయన వంద సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి. హీరో గానే చేయాలి. బాలయ్య గారికి అభినందనలు. సుందరకాండ 27న రిలీజ్ అవుతుంది. గొప్ప విజయం అందించండి.
హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. మా డైరెక్టర్ వెంకీ గారు మంచి రైటర్ మంచి సెన్సాఫ్ హ్యూమన్ ఉన్న పర్సన్. ఆయన విజన్ చాలా కొత్తగా ఉండింది. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన కోసం ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. సుందరకాండ జర్నీ వెరీ బ్యూటిఫుల్. ప్రదేశ్ గారు సినిమాని ఒక పెయింటింగ్ లాగా తీశారు. మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. నరేష్ గారు వాసుకి గారు సునయన వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. రోహిత్ గారు నాకు ముందు నుంచి తెలుసు. ఈ సినిమాతో ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది. ఆయన కథలు ఎంపిక చాలా గొప్పగా ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వండర్ఫుల్ కోస్టార్. వినాయక చవితికి ఈ సినిమా మీ ముందుకు వస్తుంది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
ప్రొడ్యూసర్ సంతోష్ మాట్లాడుతూ... అందరికి నమస్కార. మనోజ్ అన్న ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రోహిత్ గారు నా బ్రదర్. నా ప్రతి అడుగులో ఆయన సపోర్ట్ ఉంటుంది. ఈ సినిమా విషయంలో రోహిత్ గారే మా ధైర్యం. ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత గౌతమ్ రాకేష్ జాయిన్ అయ్యారు. మేము చాలా తొందరగా కనెక్ట్ అయ్యాం. నరేష్ గారు చాలా అద్భుతమైన పాత్ర చేశారు. మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శ్రీదేవి గారు తప్ప ఈ క్యారెక్టర్ ని ఎవరు చేయలేరు. మాకు ప్రమోషన్ లో కూడా చాలా సపోర్ట్ చేశారు. మైత్రి శశి గారు ఈ సినిమా చూసి తను ఇచ్చిన ధైర్యం మర్చిపోలేను. ఆయన నైజాం కి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఆగస్టు 27న అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ... అందరికి నమస్కారం. రోహిత్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. చాలా సరదాగా ఉంటారు. సంతోష్ నిజ జీవితంలో కూడా ఎంతో గొప్ప స్నేహశీలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా ఆత్మీయ కుటుంబం లాగా అనిపించింది. నారా రోహిత్ గారు సినిమాలో మీరు ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు. చాలా కొత్తగా ఉంటాయి. సుందరకాండ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇదొక డ్రీమ్ మూమెంట్. ఇక్కడ వరకు రావడానికి నాకు ఎంతగా ఎంతో మంది సపోర్ట్ చేశారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మనోజ్ గారికి థాంక్యూ. నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం రోహిత్ గారు. రోహిత్ గారితో దాదాపుగా ఎనిమిదేళ్ల జర్నీ. ఆ జర్నీలో ఆయన ఇచ్చే సపోర్టు గైడెన్స్ మర్చిపోలేను. సుందరకాండ సినిమాలో భాగమైన అందరికీ థాంక్యు. నా జీవితంలో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా ఇది. మా సినిమాకి అందరూ అద్భుతమైన టెక్నీషియన్స్ దొరికారు. అందరూ చాలా సపోర్ట్ చేశారు. శ్రీదేవి గారి తప్ప ఈ క్యారెక్టర్ ని ఎవరు చేయలేరు. సత్య గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో మీ అందరిని అలరిస్తుంది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది.
నిర్మాత రాకేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. రోహిత్ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు ఏమిటో తెలుసు. ఆయన మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నేను పదేళ్ల క్రితం పాఠశాల అనే సినిమా తీశాను. దానికి మొన్న అవార్డు వచ్చింది. ఆ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తే ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూపించింది అదే తరహాలో సుందరకాండ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించబోతుంది. ఆగస్టు 27న ఈ సినిమాని ఎవరు కూడా థియేటర్స్ లో మిస్సవద్దని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్టు. రోహిత్ గారు సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటే కచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుంది. రైటర్ డైరెక్టర్ వెంకీ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా సినిమా థియేటర్స్ లో అలరిస్తుంది.
డాక్టర్ నరేష్ వీకే మాట్లాడుతూ.. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటి జీవితాన్ని మార్చేసే ఐడియాతో డైరెక్టర్ వెంకీ వచ్చారు. చాలా అద్భుతమైన సినిమా ఇది. థియేటర్స్ లో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రోహిత్ అద్భుతమైన నటుడు. వండర్ఫుల్ పర్సన్. రోహిత్ తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్రీదేవి కూడా ఇందులో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమా. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.
హీరోయిన్ వృత్తి వాఘుని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఇది. నన్ను బిలీవ్ చేసి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ గారికి థాంక్యూ. మా నిర్మాతలకి థాంక్ యు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ ససిధర్ రెడ్డి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ చూసాము. తప్పకుండా ఇది రోహిత్ గారికి కం బ్యాక్ ఫిలిం. ఆయన సోలో సినిమా మాకు చాలా ఇష్టం. ఆ సినిమా తర్వాత అంత బాగా నచ్చిన సినిమా సుందరకాండ. స్క్రిప్ట్ పెర్ఫార్మన్స్ సాంగ్స్ అన్ని కలర్ ఫుల్ గా స్క్రీన్ మీద ఉంటాయి. సినిమా చూసినోళ్లు అందరు కూడా చాలా మంచి ఎంటర్టైనర్ చూసామని ఫీల్ అవుతారు. ఆగస్టు 27న థియేటర్స్లోకి వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాకేష్ గారికి సంతోష్ గారికి గౌతమ్ గారికి ధన్యవాదాలు. ఫ్యామిలీస్ అందరు థియేటర్స్ కి వచ్చి చూసే సినిమా ఇది. చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


