pizza

Sankranthiki Vasthunam Blockbuster Pongal Jathara
'సంక్రాంతికి వస్తున్నాం'ను సూపర్ డూపర్ హిట్ చేసిన ఆడియన్స్ కు థాంక్ యూ. ఈ విజయం తెలుగు ప్రేక్షకులది: పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్

You are at idlebrain.com > News > Functions
Follow Us


17 January 2025
Hyderabad

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు.

పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ వన్ అఫ్ ది హ్యాపీయస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ విజయం మరోసారి రుజువుచేసింది. ఇది మా విజయమే కాదు ఇంత గొప్పగా సపోర్ట్, లవ్ చేసిన తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ సక్సెస్. ప్రేక్షకులు ఈ విజయాన్ని కోరుకున్నారు. ఇది ప్రేక్షకులు విజయం. ప్రేక్షకులు కోరుకుంటే ఆ ఎనర్జీ వస్తుంది. అనిల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ ఎనర్జీ వచ్చింది. ఆడియన్స్ పాజిటివ్ వైబ్స్ తో సినిమా తీశాం. ఈ రోజు ఆడియన్స్ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్పూర్తిగా చాలా చాలా థాంక్స్. డైరెక్టర్ అనిల్, నిర్మాతలు దిల్ రాజు గారు, శిరీష్ గారు, సినిమా యూనిట్ అందరికీ పేరుపేరునా థాంక్ యూ. సినిమాని ఎంకరేజ్ చేసిన మీడియాకి థాంక్ యూ. చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ మనస్పూర్తిగా ఫోన్ చేసి సినిమాని అభినందిస్తున్నారు. అందరికీ థాంక్ యూ. సినిమాని ఫ్యామిలీ అందరితో కలసి చూడటం చాలా ఆనందంగా వుంది. ఐ థాంక్ మై బ్రదర్ చిన్నోడు మహేష్ బాబు. తనకి సినిమా చాలా నచ్చి ట్వీట్ చేయడం చాలా ఆనందంగా వుంది. అందరికీ థాంక్ యూ సో మచ్' అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ..మేము ఊహించిన దానిమంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ఆడియన్స్ కి నా పాదాభివందనాలు. ఈ రోజు నాకు ఎనిమిది సక్సెస్ లు అంటున్నారు. ఆడియన్స్ సపోర్ట్ లేకపొతే నాకు ఏ విజయం వచ్చేది కాదు. బాహుబలిని శివగామి ఎత్తుకొని చూపించినట్లు ఆడియన్స్ ఈ సినిమా పైకెత్తుకుని చూపించడం గూస్ బంప్స్ లా వుంది. ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. రాజు గారు, శిరీష్ గారు నన్ను దర్శకుడిగా నిలబెట్టిన నిర్మాతలు. పటాస్ సినిమాతో మా ప్రయాణం మొదలైయింది. ఎఎస్విసి నా హోం బ్యానర్. వారితో సినిమాలు చేస్తూనే వుంటాను. మా రైటింగ్ టీంకి థాంక్ యూ. నటీనటులందరికీ థాంక్ యూ. సమీర్ రెడ్డి గారు, ప్రకాష్ గారు, తమ్మిరాజు గారు టెక్నిషియన్స్ అందరికీ థాంక్ యూ. ఐశ్వర్య భాగ్యం పాత్రతో అందరూ కనెక్ట్ అవుతున్నారు. క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. మీనాక్షి కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. బుల్లిరాజుకి చిన్న వయసులో పెద్ద పేరు వచ్చింది. తన పాత్రని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. భీమ్స్ క్రియేట్ చేసి సాంగ్స్ ఈ సక్సెస్ లో పెద్ద ఎసెట్. వెంకటేష్ గారితో ఒక అభిమానిలా పని చేశాను. ఈ సినిమాతో మా మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. ఆయనతో జర్నీ కంటిన్యూ అవుతుంది. వెంకటేష్ నాకు ఫ్రెండ్ గురు ఫ్యామిలీ మెంబర్. ఈ సినిమాకి నా కంటే ఎక్కువ ఎనర్జీతో పని చేశారు. ఆయన ఎనర్జీ సపోర్ట్ లేకపోతే మేము అంతా బాగా చేసివుండేవాళ్ళం కాదు. నన్ను ఇంత బలంగా నమ్మిన వెంకటేష్ గారికి థాంక్ యూ. ఇది మా హ్యాట్రిక్ మూవీ. ఆయన సపోర్ట్ మర్చిపోలేను. ఇప్పటి వరకూ నేను తీసిన ఎనిమిది సినిమాలు.. ఒకొక్క సినిమా ఒక్కో జర్నీ. ఇందులో లాస్ట్ ఐదు సినిమాలు కంటిన్యూగా వందకోట్ల గ్రాసర్స్. లాస్ట్ ఐదు సినిమాలు యూఎస్ లో వన్ మిలియన్ గ్రాసర్స్. ఒక దర్శకుడిగా ఆడియన్స్ కి ఎంత థాంక్ ఫుల్ గా ఉండాలో అర్ధం కావడం లేదు. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం. నాకు తెలిసిన సినిమా ఒక్కటే. థియేటర్స్ లో ఆడియన్స్ విజల్స్ కొట్టే సినిమా చేయడం నాకు ఇష్టం. నాకు తెలిసిన సినిమా ఇదే. అలాంటి సినిమానే చేస్తాను. ఆడియన్స్ విజల్ కొడితే విజల్ కొడతాను. ఎమోషన్ అయితే నేనూ ఎమోషన్ అవుతాను. ప్రతి ఫ్రైడే థియేటర్ లో వుంటాను. నా కంటే బాగా తీస్తే నేర్చుకుంటా. నేను తప్పులు తీస్తే సరిదిద్దుకుంటా. ఎనిమిది సినిమాల జర్నీ ఇది. ఇక మీద ఇలానే జర్నీ వుంటుంది. మీ అందరి సపోర్ట్ బ్లెసింగ్స్ కావాలి. అందరికీ థాంక్ యూ'అన్నారు.

నిర్మాత శిరీష్ మాట్లాడుతూ..ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు థాంక్ యూ. ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి గారికి థాంక్స్ చెప్పాలి. ఆ రోజు ఆయన 'పటాస్' సినిమా చూపించకపొతే ఈ రోజు అనిల్ తో జర్నీ వుండేది కాదు. ఈ సినిమా మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తుందనే షూటింగ్ లో చెప్పేవారు. ఆయన మాట నిజమైయింది. థాంక్ యూ అనిల్. వెంకటేష్ గారు నిర్మాతల హీరో. ఆయన నిర్మాతల బాగు కోరుకుంటారు కాబట్టి ఇప్పటికీ కాలర్ ఎగరేస్తూ ముందుకు వెళ్తున్నారు. థాంక్ యూ వెంకటేష్ గారు' అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. లైఫ్ లో హిట్స్ ఫ్లాప్స్ క్లాసిక్స్ బ్లాక్ బస్టర్స్ అన్నీ చూశాం. కానీ ఒక టైం వుంటుంది. డిస్ట్రిబ్యూషన్ లో పెళ్లిపందిరి హిట్ వచ్చినప్పుడు ఒక కిక్. నిర్మాతలు గా మొదటి సినిమా 'దిల్' సక్సెస్ ఒక కిక్ ఇచ్చింది. అలాగే ఆర్య కూడా కిక్ ఇచ్చింది. ఇలా 58సినిమాకి ల్యాండ్ అయ్యాం. ఈ సినిమా మేము ఊహించని మహా అద్భుతం. అనిల్, వెంకటేష్ గారు కాంబినేషన్ లో సినిమా అంటే పాజిటివ్ వైబ్రేషన్. ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఈ సంక్రాంతిని మర్చిపోలేం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ. వెంకటేష్ గారు నిర్మాతల హీరో. హీరో నిలబడినప్పుడే ఇలాంటి ప్రమోషన్స్ పాజిబుల్ అవుతాయి. వెంకటేష్ గారికి హ్యాట్సప్. ప్రతి డైరెక్టర్ ఇలాంటి కొత్త థాట్స్ తో ప్రమోషన్స్ చేస్తే ఎంత అద్భుతం జరుగుతుందో అనిల్ మరోసారి ప్రూవ్ చేశారు. ప్రమోషన్స్ టీం అందరికీ థాంక్ యూ వెరీ మచ్. మా సినిమాకి ఇంత అద్భుతమైన సినిమాని అందించిన ప్రేక్షకులకు థాంక్ యూ వెరీ మచ్' అన్నారు

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ థాంక్ యూ సో మచ్. భాగ్యం క్యారెక్టర్ నాకు చాలా కొత్త. ఈ క్యారెక్టర్ క్రెడిట్ అంతా అనిల్ గారికే దక్కుతుంది. ఆయన ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ అవుతాయి. నిర్మాత శిరీష్ గారు ఎంతో కేర్ తీసుకున్నారు. నిర్మాతలకు ఇంకా ఎన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ థాంక్ యూ. ఇది చాలా స్పెషల్ మూవీ. ఇది నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. వెంకటేష్ గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో కలసి నటించడం ఒక బ్లెసింగ్ గా భావిస్తున్నాను. అందరికీ థాంక్ యూ' అన్నారు.

యాక్టర్ అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంక్రాంతి సినిమాలకి వరల్డ్ కప్ అంటారు. వరల్డ్ కప్ ఫైనల్ లో డబుల్ సెంచరీ కొట్టిన టీంలో వుండటం చాలా ఆనందంగా వుంది(నవ్వుతూ). అనిల్ గారు వరుసగా ఎనిమిది సక్సెస్ లు కొట్టారు. సెట్ లో ఆయన వర్కింగ్ స్టయిల్ ని చూసే అవకాశం రావడం ఆనందంగా వుంది. జనాల్ని నవ్వించడానికి తనకు తాను హంబుల్ గా మారిపోయే గ్రేట్ పర్శన్ వెంకటేష్ గారు. టీం అందరికీ థాంక్ యూ. ఈ సక్సెస్ లో భాగం కావడం చాలా ఆనందంగా వుంది' అన్నారు.

యాక్టర్స్ శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, మాస్టర్ రేవంత్, డీవోపీ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, రైటర్స్ అజ్జు మహాకాళి, నాగ్, సాయి కృష్ణ తో పాటు మిగతా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

 

 

Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved