05 May 2015
Hyderabad
రీసెంట్‌గా ప్రజా నాయకుడు శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ సినిమా అండ్ టీవీ బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్..ఇటీవలే మృతి చెందిన ఓ పేద సినీ కళాకారుని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసి తన సహృదయతను చాటుకుంది.
సూర్యాపేటకు చెందిన మధుసూదన్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా సినీ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తూ..తెలుగు సినీ ఆర్టిస్ట్ యూనియన్‌లో మెంబర్‌గా ఉన్నారు. రీసెంట్‌గా ఆయన తెలంగాణ బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ యూనియన్‌లో సభ్యత్వం తీసుకున్నారు. గత నెల 24న హైద్రాబాద్ మాదాపూర్‌లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్‌లో ఆయన మృతి చెందారు. దీనిపై స్పందించిన తెలంగాణ సినిమా అండ్ టీవీ బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ యూనియన్ 30 వేల రూపాయలను మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు..ఆయన పెద్ద ఖర్మ రోజున సూర్యాపేటలో అందచేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సినిమా బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి. నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మధుసూదన్ రెడ్డి గారు నిరుపేద కుటుంబంలో పుట్టిన అభ్యుదయ భావాలున్న వ్యక్తి. ఆయన.. తన సతీమణిని డాక్టర్ చేద్దామని ఎన్నో కలలు కన్నారు. ఆ క్రమంలోనే ఆమెని బి. ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదివిస్తున్నారు. అర్ధంతరంగా ఆయన చనిపోవడంతో...ఆయన కుటుంబ పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. అందుకే ఉడతాభక్తిగా ఈ ఆర్ధిక సహాయాన్ని మా అసోసియేషన్ తరుపున అందించాం. అలాగే గౌరవ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ 50 వేల రూపాయలను త్వరలోనే ఈ కుటుంబానికి అందజేయనున్నారు..’ అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వెంకట్ రాజ్, వినయ్, మూర్తి, రామారావు, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.