pizza
A Master Piece Teaser Launch
"A Masterpiece" will be a superhero movie we are proud of - Hero Arvind Krishna at Teaser Launch
"ఏ మాస్టర్ పీస్" మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది - టీజర్ లాంఛ్ లో హీరో అరవింద్ కృష్ణ
You are at idlebrain.com > News > Functions
Follow Us


05 June 2024
Hyderabad

 

After different movies like "Shukra" and "Mataraani Mounamidi," director Suku Purvaj is making a new movie, "A Masterpiece." Manish Gilada, Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are playing the lead roles, with Srikanth Kandregula and Manish Gilada producing the movie "A Masterpiece" under the banner of Cinema Bandi Productions, along with the prestigious film production studio Merge XR. This movie aims to provide the Telugu audience with a new concept superhero movie experience that combines mythology and science fiction. The "A Masterpiece" movie teaser release program was held in Hyderabad today. On this occasion:

Cinematographer Sivaram Charan said, "Thanks to director Suku Purvaj for giving me the opportunity to work on 'A Masterpiece.' Arvind Krishna is poised to enter another league with this movie. If Manish were on set, there would have been a lot of positive vibes. If he had been there, we all would have been happy. I want this movie to be a good break for Manish, who is making his debut as a villain. I gave my best efforts as a cinematographer. 'A Masterpiece' is a rare film in Tollywood."

Actor and producer Manish Gilada said, "First of all, I would like to congratulate Nation Power Star Pawan Kalyan. I am his fan. Pawan entered politics with a lot of passion, and I am happy to see him win the AP election. After 17 years of efforts, I am standing in front of you and speaking like this. We thank our parents for this. So far, I have been a good father, a good son, a good friend, and a good businessman. Now, I debut as an actor. I am happy to be playing a villain in the movie 'A Masterpiece.' I hope to impress you in the villain role. This masterpiece is a master class. Arvind Krishna is my best friend. We studied together. Director Suku Purvaj is making this movie with great vision. We hope it will be a memorable 'A Masterpiece' movie in all of our careers. Together with our cast and crew, we have created a wonderful film."

Director Suku Purvaj said, "We have seen many superhero movies in world cinema. I also like a lot of superhero movies. I started the movie 'A Masterpiece' with the idea that if we add the background of our mythology to a superhero character, we can create our own native superhero film. This includes the soul of our mythology. We have designed the hero and villain characters with the background of Jaya and Vijaya from the Bhagavatam. We took the role of Shiva as a link to combine mythology and science fiction. It does not exist in the Puranas, although written as a fictional character. That's why we wrote 'Myths Reimagined' on our poster. The movie 'A Masterpiece' started as a small project. Manish Gilada and Srikanth of Cinema Bandi Productions joined the production when the film's scale needed to expand. Merge XR, which does post-production for Hollywood movies, joined our team. The VFX done by them will amaze you. I cannot forget the support given by hero Arvind Krishna, producer Manish Gilada, producer Srikanth, and Merge XR on this journey. Without Manish Gilada, this project would not have reached this scale. Arvind Krishna is like a brother to me. Some people suggested trying another big hero for a superhero movie. I envisioned a hero with a personality like Arvind's as a superhero. My wife, Jyoti Purvaj, is playing an important role. Currently, the shooting has been completed except for the climax. We are going to shoot the climax for ten days. My team supported me a lot in making this film. This is the first part of the movie. We will reveal the release date soon."

Producer Srikanth Kandregula said, "Suku was alone when the movie 'A Masterpiece' started. After that, I joined the project. We started this project to create a proper superhero movie in Telugu under our Cinema Bandi banner. Manish was very supportive when I wanted to take the movie to another level. Both Arvind and Manish are like brothers to me. Our entire movie team worked like a family. I completely entrusted Manish with the project as I couldn't take care of it while I was in the US. I came from Goa for this teaser launch for Manish. Prajay joined from Merge XR when the film required heavy VFX. There are more than 1,500 VFX shots in this movie. Thanks to Yogi, Regional Head of Merge XR."

Heroine Jyoti Purvaj said, "I got to know you through serials and am now entering the film industry as an actress with the movie 'A Masterpiece.' My personal life took a turn during the shooting of this film as I got married to Suku. Since then, Tollywood has become my stepping stone. I hope you liked the teaser of 'A Masterpiece.' Director Suku told me about my character in the movie. The entire team of this movie has become like a family. I want to continue doing movies from now on."

Executive producer Madhav said, "Thanks to our mentor Suku Purvaj for giving me the opportunity to work on the movie 'A Masterpiece.' Cinema is his world, and he is always thinking about the movie. Arvind Krishna will gain a very good reputation after this movie. Without Manish, this project would not have turned out so well. Thank you to producer Srikanth, Jyoti, and other team members."

Hero Arvind Krishna said, "I had a son before I was offered the film 'A Masterpiece.' I want to be like a superhero to my son. At the same time, Suku offered me this movie. Manish and I are college friends. After seeing us in the principal's room, our parents saw us on the same stage today. We invited our parents to this program to show them that we have become achievers. I get emotional when I talk about Manish. He is always supporting me in my life. I have not done anything for him. Even now, he produced this movie for me. Manish, I want to do something good for you and make you proud. I don't know how to thank you. Suku Purvaj is like a guru to me. When I left films, he encouraged me, saying a hero like me should be in the industry. I did the movie 'Shukra' under his direction. Suku recently got married, but he spends most of his time discussing movies with me. This makes Jyoti angry. For a few days, we will give you your husband back, Jyoti. Seeing the output of the movie with confidence, I can say 'A Masterpiece' will be a superhero movie that we can be proud of."

Actors: Manish Gilada, Arvind Krishna, Jyoti Purvaj, Sneha Gupta, Archana Ananth, Jayaprakash, etc.

Technical Team:
- Cinematography: Sivaram Charan
- Music: Aashirvad
- Editors: Suku Purvaj, Manoj Kumar B, Shiva Sharwani
- Costumes: Udayashree Purvaj, Salina Williams (UK)
- Stunts: Raj Kumar Gangaputra
- Banners: Cinema Bandi, Merge XR
- Producers: Srikanth Kandregula, Manish Gilada, Prajay Kamat
- Written and Directed by: Suku Purvaj

"ఏ మాస్టర్ పీస్" మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది - టీజర్ లాంఛ్ లో హీరో అరవింద్ కృష్ణ

'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్". మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "ఏ మాస్టర్ పీస్" సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

సినిమాటోగ్రాఫర్ శివరామ్ చరణ్ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకు పూర్వజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాతో అరవింద్ కృష్ణ మరో లీగ్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నా. మనీష్ గారు సెట్ లో ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉండేవి. ఆయన ఉంటే మేమంతా హ్యాపీగా ఉండేవాళ్లం. విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మనీష్ గారికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సినిమాటోగ్రాఫర్ గా నా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాను. "ఏ మాస్టర్ పీస్" సినిమా టాలీవుడ్ లో ఒక అరుదైన చిత్రంగా పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

నటుడు, నిర్మాత మనీష్ గిలాడ మాట్లాడుతూ - ముందుగా మూడ్ ఆఫ్ ది నేషన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి కంగ్రాట్స్ చెబుతగున్నా. నేను ఆయన అభిమానిని. ఎంతో ప్యాషన్ తో రాజకీయాల్లోకి పవన్ గారు వచ్చారు. ఎపీ ఎన్నికల్లో ఆయన అద్భుత విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. 17 ఏళ్ల ఎఫర్ట్స్ తర్వాత నేను మీ ముందు ఇలా వేదిక మీద నిలుచుని మాట్లాడుతున్నా. ఇందుకు మా పేరెంట్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఇప్పటిదాకా మంచి ఫాదర్ గా, మంచి సన్ గా , మంచి ఫ్రెండ్ గా, మంచి బిజినెస్ మెన్ గా ఉన్నాను. ఇప్పుడు నటుడిగా తెరంగేట్రం చేస్తుంది. "ఏ మాస్టర్ పీస్" సినిమాలో విలన్ గా నటిస్తుండటం సంతోషంగా ఉంది. విలన్ రోల్ లో మిమ్మల్ని మెప్పిస్తాననే ఆశిస్తున్నాం. ఈ మాస్టర్ పీస్ మాస్టర్ క్లాస్ గా ఉంటుంది. అరవింద్ కృష్ణ నా బెస్ట్ ఫ్రెండ్. మేము కలిసే చదువుకున్నాం. దర్శకుడు సుకు పూర్వజ్ ఒక గొప్ప విజన్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మా అందరి కెరీర్ లో గుర్తుండిపోయే "ఏ మాస్టర్ పీస్" మూవీ అవుతుందని ఆశిస్తున్నాం. మా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమాను రూపొందించాం. అన్నారు.

దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ - మనం వరల్డ్ సినిమాలోని ఎన్నో సూపర్ హీరోల సినిమాలను చూశాం. నాకూ చాలా సూపర్ హీరోల సినిమాలు ఇష్టం. ఆ సూపర్ హీరో క్యారెక్టర్ కు మన పురణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్ సూపర్ హీరో ఫిల్మ్ చేయొచ్చనే ఐడియాతో "ఏ మాస్టర్ పీస్" సినిమాను ప్రారంభించాను. ఇందులో మన మైథాలజీ సోల్ ఉంటుంది. భాగవతంలోని జయ విజయుల నేపథ్యంతో హీరో, విలన్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాం. మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నా. అందుకే మా పోస్టర్ లో మిథ్స్ రీఇమాజిన్ డ్ అని రాశాం. చిన్న ప్రాజెక్ట్ గా "ఏ మాస్టర్ పీస్" మూవీ మొదలైంది. సినిమా షూటింగ్ ప్రాసెస్ బిగ్ స్కేల్ కు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు మనీష్ గిలాడ, సినిమా బండి ప్రొడక్షన్స్ శ్రీకాంత్ నిర్మాణంలో యాడ్ అయ్యారు. హాలీవుడ్ మూవీస్ కు పోస్ట్ ప్రొడక్షన్ చేసే మెర్జ్ ఎక్స్ ఆర్ మా టీమ్ లో జాయిన్ అయ్యింది. వాళ్లు చేసిన వీఎఫ్ఎక్స్ మీకు అద్భుతమైన ఫీల్ కలిగిస్తాయి. ఈ జర్నీలో హీరో అరవింద్ కృష్ణ, నిర్మాత మనీష్ గిలాడ, ప్రొడ్యూసర్ శ్రీకాంత్, మెర్జ్ ఎక్స్ ఆర్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మనీష్ గిలాడ లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఈ స్కేల్ లో వచ్చేది కాదు. అరవింద్ కృష్ణ నాకు బ్రదర్ లాంటివాడు. సూపర్ హీరో సినిమా మరో పెద్ద హీరోను ట్రై చేయొచ్చు కదా అని కొందరు అన్నారు. అరవింద్ లాంటి పర్సనాలిటీ ఉన్న హీరోనే సూపర్ హీరోగా ఇమాజిన్ చేసుకున్నాను. నా వైఫ్ జ్యోతి పూర్వజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. పది రోజుల పాటు క్లైమాక్స్ షూట్ చేయబోతున్నాం. మేకింగ్ లో నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ఇది ఫస్ట్ పార్ట్ మూవీ. రిలీజ్ అప్డేట్ ను త్వరలో వెల్లడిస్తాం. అన్నారు.

నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమా ప్రారంభమైనప్పుడు సుకు ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత నేను ప్రాజెక్ట్ లోకి వచ్చాను. తెలుగులో మా సినిమా బండి బ్యానర్ మీద ఒక ప్రాపర్ సూపర్ హీరో సినిమా చేయాలని ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేశాం. ఒక టైమ్ లో మూవీని మరో స్కేల్ కు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మనీష్ చాలా సపోర్ట్ చేశాడు. అరవింద్, మనీష్ ఇద్దరూ నాకు బ్రదర్స్ లాంటి వాళ్లు. మా మూవీ టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా పనిచేశాం. నేను యూఎస్ లో ఉంటూ ఈ ప్రాజెక్ట్ చూసుకోలేనని పూర్తిగా మనీష్ మీద వదిలేశాను. మనీష్ కోసమే గోవా నుంచి ఈ టీజర్ లాంఛ్ కు వచ్చాను. ఈ సినిమాకు భారీ వీఎఫ్ఎక్స్ కావాల్సివచ్చినప్పుడు మెర్జ్ ఎక్స్ ఆర్ నుంచి ప్రజయ్ జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో 1500కు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి. మెర్జ్ ఎక్స్ఆర్ రీజనల్ హెడ్ యోగికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ - సీరియల్స్ ద్వారా నేను మీకు పరిచయమే. "ఏ మాస్టర్ పీస్" సినిమాతో నటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా పర్సనల్ లైఫ్ ఒక టర్న్ తీసుకుంది. సుకుతో నా మ్యారేజ్ జరిగింది. అప్పటినుంచి టాలీవుడ్ నా మెట్టినిల్లు అయిపోయింది. "ఏ మాస్టర్ పీస్" సినిమా టీజర్ చూశారు మీకు నచ్చిందని ఆశిస్తున్నా. దర్శకుడు సుకు నా మూవీలో నా క్యారెక్టర్ గురించి చెప్పారు. ఈ మూవీ టీమ్ అంతా ఫ్యామిలీలా మారిపోయారు. ఇక నుంచి మూవీస్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాధవ్ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమాకు వర్క్ చేసే అవకాశం కల్పించిన మా గురువు సుకు పూర్వజ్ గారికి థ్యాంక్స్. ఆయనకు సినిమానే లోకం. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. అరవింద్ కృష్ణ ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. మనీష్ గారు లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చేది కాదు. నిర్మాత శ్రీకాంత్ గారికి జ్యోతి గారికి ఇతర టీమ్ మెంబర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమా ఆఫర్ నాకు సుకు ఇచ్చే ముందే నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకుకు నేను సూపర్ హీరోలా ఉండాలని అనుకున్నా. అదే టైమ్ లో సుకు ఈ మూవీ ఆఫర్ అందించాడు. మనీష్ నేను కాలేజ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ప్రిన్సిపాల్ రూమ్ లో చూసిన తర్వాత ఇదే వేదిక మీద మా పేరెంట్స్ మమ్మల్ని చూడటం. మేము ప్రయోజకులం అయ్యామని చెప్పేందుకే మా పేరెంట్స్ ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశాం. మనీష్ గురించి మాట్లాడితే నేను ఎమోషనల్ అవుతాను. నాకు జీవితంలో ప్రతిసారీ వాడే ఇస్తున్నాడు వాడే సపోర్ట్ చేస్తున్నాడు. నేను వాడికి చేసిందేం లేదు. ఇప్పుడు కూడా నాకోసమే ఈ మూవీ ప్రొడ్యూస్ చేశాడు. మనీష్ నీకోసం ఏదైనా మంచి పని చేయాలని, నువ్వు గర్వపడేలా నేను ఉండాలని అనుకుంటున్నా. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. సుకు పూర్వజ్ నాకు గురూజీ లాంటి వాడు. నేను సినిమాలు వదిలేసిన టైమ్ లో నీలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలు చేయాలని చెప్పి ఎంకరేజ్ చేశాడు. ఆయన డైరెక్షన్ లో శుక్ర మూవీ చేశాను. సుకుకు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది. అయితే ఆయన నాతో మూవీ డిస్కషన్స్ లో ఉన్న టైమే ఎక్కువ. జ్యోతికి ఇది కోపం వచ్చే విషయమే. కొద్ది రోజులు అయితే మీ ఆయనను మీకు ఇచ్చేస్తాం. ఆత్మవిశ్వాసంతో మూవీ ఔట్ పుట్ చూసి చెబుతున్నాను. "ఏ మాస్టర్ పీస్" సినిమా మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది. అన్నారు.

నటీనటులు - మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, స్నేహ గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ- శివరామ్ చరణ్
సంగీతం- ఆశీర్వాద్
ఎడిటర్ - సుకు పూర్వజ్ ,మనోజ్ కుమార్. బి, శివ శర్వాని
కాస్ట్యూమ్స్ - ఉదయశ్రీ పూర్వజ్, సలీనా విలియమ్స్( యూకే)
స్టంట్స్ - రాజ్ కుమార్ గంగపుత్ర
పీఆర్వో - జీఎస్ కే మీడియా
బ్యానర్స్ - సినిమా బండి, మెర్జ్ ఎక్స్ ఆర్
నిర్మాత - శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ , ప్రజయ్ కామత్
రచన, దర్శకత్వం - సుకు పూర్వజ్

 

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved