pizza
Amazon Yodhulu teaser launch
ou are at idlebrain.com > News > Functions
Follow Us

2 June 2016
Hyderabad

ప్రముఖ హాలీవుడ్‌ నటులు రిచాజెన్‌, సెసిలియా చియాంగ్‌ జంటగా ఇండో ఓవర్సీస్‌ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్‌ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో జాకీచాన్‌ నిర్మించిన చిత్రం ‘ది లెజండరీ అమెజాన్స్‌’. హాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసి భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రాన్ని సాయి శ్రీజ విఘ్నేష్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ ‘అమెజాన్‌ యోధులు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల‌కు అందిస్తున్నారు. ‘మాహిష్మతి రాజ్యం’ ఉపశీర్షిక. ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం జూన్‌ 2న హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు డి.యస్‌. రావు, ప్రతాని రామకృష్ణగౌడ్‌, టి.రామసత్యనారాయణ, బాలాజీ నాగలింగం, నిర్మాత జి.వంశీకృష్ణ వర్మ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ‘అమెజాన్‌ యోధులు’ ట్రైల‌ర్స్‌ని డి.యస్‌. రావు విడుదల‌ చేయగా ఫొటోకార్డ్స్‌ పోస్టర్స్‌ని రామకృష్ణగౌడ్‌ రిలీజ్‌ చేశారు.

డి.యస్‌. రావు మాట్లాడుతూ ‘‘అమెజాన్‌ యోధులు’ ట్రైల‌ర్‌ చాలా అద్భుతంగా ఉంది. యాక్షన్‌ ఫిలింస్ తెలుగులో ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. ఈ చిత్రం డెఫినెట్‌గా సక్సెస్‌ అయి నిర్మాత వంశీకృష్ణకు లాభాలు వస్తాయి. సినిమా ఆద్యంతం చాలా థ్రిల్‌గా వుంటుంది’’ అన్నారు.

ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ ` ‘‘ఈ చిత్రాన్ని సింగపూర్‌లో చూశాను. సినిమా క్లైమాక్స్‌ ‘బాహుబలి’ తరహాలోనే మ్యాచ్‌ అవుతుంది. భారీ సెట్టింగ్స్‌, భారీ విజువల్స్‌తో చాలా గ్రాండియర్‌గా సినిమా ఉంటుంది’’ అన్నారు.

తుమ్మల‌పల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ట్రైల‌ర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. 500 కోట్లభారీ బడ్జెట్‌తో జాకీచాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైల‌ర్స్‌లో యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే ‘బాహుబలి’ చూసిన ఫీలింగ్‌ కలిగింది. ఈ సినిమా సక్సెస్‌ అయి నిర్మాత వంశీకృష్ణకు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు.

నిర్మాత జి.వంశీకృష్ణ వర్మ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో రిలీజ్‌ అవుతున్న ఫస్ట్‌ చిత్రం ఇది. తెలుగు ప్రేక్షకుల‌కు తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుందని కాన్ఫిడెంట్‌తో రిలీజ్‌ చేస్తున్నాను. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల‌లోనే సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ ` ‘‘బాహుబలి’లాంటి చిత్రమిది. ప్రేక్షకుల‌కు నచ్చేవిధంగా యాక్షన్‌ సన్నివేశాలు చాలా ధ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రతి విజువల్‌ చాలా గ్రాండియర్‌గా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: జి. యుగంధర్‌రెడ్డి, నిర్మాత: జి.వంశీకృష్ణ వర్మ, దర్శకత్వం: ఫ్రాంకీ ఛాన్‌.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved