pizza
Ambajipeta Marriage Band Teaser Launch
You are at idlebrain.com > News > Functions
Follow Us


9 October 2023
Hyderabad

Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like 'Colour Photo' and 'Writer Padmabhushan'. He is now ready to entertain the audience with his upcoming film "Ambajipeta Marriage Band." The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha's Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment

The teaser of this movie was released in Hyderabad on Monday. Talented directors Maruthi, Hanu Raghavapudi, Sailesh Kolanu, Sai Rajesh, Sandeep Raj, Prashanth, Meher Ramesh, Bharat Kamma, producer SKN, Chai Biscuit Sarath and others participated as guests in this program. On this occasion,

Actress Sharanya Pradeep said - I went into a trance when I saw the teaser of "Ambajipet Marriage Band". We worked hard for this film. While making the movie, the entire unit became a family. I would like to thank the director Dushyant for giving me the character in this movie and believing that I can do it. Technically, the film is impressive in all crafts. The movie will be liked by all of you.

Actor Jagadeesh said - I like the acting of Suhas very much. As an actor, he us my inspiration, when I saw the movie Majili. I believe that we will get opportunities. Thanks to the director who gave me a good character in "Ambajipeta Marriage Band". This movie will definitely be a hit.

Actor Nithin said - We all worked together like a family in the movie "Ambajipeta Marriage Band". Thanks to the director Dushyant for giving me such a good opportunity in my career. I don't know if I will get such an opportunity later. You will not see any artist in this movie. Only those characters are visible. Everyone will be absorbed into the story.

Cinematographer Wajid Baig said - The entire team worked hard as a family believing in the story of "Ambajipeta Marriage Band". All our technicians and artists had only one idea to bring this story to the screen in such a natural way. We believe that we have made a good film. "Ambajipet Marriage Band" must watch movie in the theatres.

Music director Sekhar Chandra said - This is the second film I am working with Suhas after writer Padmabhushan. Even if the song is good or the background scoreis good, Suhas comes to the studio and celebrates. The director has shot this movie very naturally. The film has a rural backdrop. There are different situations and to reflect I made good tunes for them. I am waiting when all these songs will be released. Watch our movie in theatre.

Heroine Shivani Nagaram said - I hope you liked the teaser of "Ambajipet Marriage Band". I went to the audition for the heroine's friend character in this movie. But I felt very happy knowing that I was selected as the heroine. I couldn't believe that the first movie was getting an opportunity under a big banner like Geetha Arts. Thanks to director Dushyant who gave me the character of heroine Lakshmi in this movie. He is very stubborn filmmaker. The set should have everything needed for the scene. He made the film with the same perseverance and conviction. You will see that quality in the teaser. Everyone has unique characters in "Ambajipet Marriage Band". Each character has an arc. I don't know if we can do characters like this un future. Suhas is a good co-star. Each of his films are unique and different. He acted very natural in this too.

Director Sandeep Raj said - I have seen the movie "Ambajipet Marriage Band". This movie will definitely be a blockbuster hit. Suhas has done various films in his career so far. But this movie stands out among them all. Suha's acting in the interval scene of this movie should be considered a gem. Suhas will prove himself as a hero in another two years. Shivani acted superbly in the character of Lakshmi. Dushyant is my friend. Another director coming from our batch. With this film he definitely stands as a director. Also the team will get a good name.

Director Maruthi said - When I saw the poster and title of this movie, I understood how natively they are shooting the story. I was also impressed by the teaser. I asked to show this movie and they showed it. Dushyant directed the movie with very mature writing. There is drama in every scene while remaining very natural. As an actor, Suhas made a National Award winning movie like Color Photo. After that he selects all his movies with content. This movie should also be a big hit for him.

Director Hanu Raghavapudi said - The job of the teaser is to create the required hype for the film. After watching the teaser of "Ambajipeta Marriage Band", I got curious about the movie. Everyone's performance is good. If the performance of all the artists is good, then the director has done it well, and I am appreciating Dushyant for that. Lot of people are saying that the movie is already a hit. So, congratulations to this team.

Director Sailesh Kolanu said - Suhas used to talk about "Ambajipet Marriage Band" while making our Hit 2. There is a head shaving scene in this movie. Before the completion of Hit 2, I was worried that he would shave for that scene. There are few actors who own every audience. Suhas is making such a name for himself. I want him to do more good movies.

Director Sai Rajesh said - I saw the movie "Ambajipet Marriage Band". You will remember every character in it. Everyone from the critics to the audience will appreciate this movie. Director Dushyant will score a hit with this movie. Sekhar Chandra is responsible for doing background score so well. Our Dheeraj is a good producer and businessman. I wish him and the team all the best.

Producer SKN said - I have seen the content of this film and the team made a good film. It feels like Dushyant made this movie after about ten movies. Suhas is a good actor, who is proving as an actor with every film. "Ambajipet Marriage Band" should give our Dheeraj another hit.

Hero Suhas said - Our producers are the reason why the movie "Ambajipeta Marriage Band" has came out so well. Dheeraj gave us the necessary support and anchored us. Also, I would like to thank Dushyant for bringing me such a good story. My co-star Shivani acted well in the character of Lakshmi. Cinematography, music, editing, every department has given superb output. My directors built my career like a house, one brick at a time. In our village, at the housewarming time, the palm is dipped in saffron water and a mold is made on the wall of the new house. That mold stays the same for a long time. "Ambajipeta Marriage Band" was such a mold in my career.

Director Dushyant Katikineni said - Thanks to all the guests who came here for the teaser release of our movie. It is a great thing for a new director like me to get a film opportunity in GA2 Pictures. I would like to thank Allu Aravind and Bunny Vass garu for giving me this opportunity. A movie like "Ambajipet Marriage Band" needs the support of producers. Our producers Allu Aravind, Bunny Vass, Dheeraj and Venkatesh gave me full support. They encouraged us to make a good film. Suhas is my good friend. In 2017, we both wanted to make a short film together, but it was not possible. After that I worked as an assistant director for two films starring Suhas. During that time we thought of some stories. We definitely decided to do a film together. I told this story over the phone. After hearing the title and story line, Suhas said let's make the film. I would like to thanks Suhas for doing the movie with me.

ఘనంగా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా టీజర్ రిలీజ్

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్, భరత్ కమ్మ నిర్మాత ఎస్కేఎన్, ఛాయ్ బిస్కట్ శరత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" టీజర్ చూడగానే ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయా. ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేశాం. మూవీ చేస్తున్న క్రమంలో యూనిట్ అంతా ఒక ఫ్యామిలీలాగ అయిపోయాం. నాకు ఈ మూవీలో క్యారెక్టర్ ఇచ్చి, నేను చేయగలను అని బిలీవ్ చేసిన దర్శకుడు దుశ్యంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. టెక్నికల్ గా అన్ని క్రాఫ్ట్ లలో సినిమా ఆకట్టుకుంటుంది. మూవీ మీ అందరికీ నచ్చేలా బాగుంటుంది. అన్నారు.

యాక్టర్ జగదీశ్ మాట్లాడుతూ - సుహాస్ అన్న యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన మజిలీ సినిమా చూసినప్పుడు నటుడిగా ఒక ఇన్సిపిరేషన్ కలిగింది. మనకూ అవకాశాలు వస్తాయని నమ్మాను. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కు థ్యాంక్స్. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అన్నారు.

యాక్టర్ నితిన్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో మేమంతా ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేశాం. నా కెరీర్ లో ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కు దుశ్యంత్ కు థ్యాంక్స్. మల్లీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు. మీకు ఈ సినిమాలో ఏ ఆర్టిస్ట్ కనిపించరు. కేవలం ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అంతలా ప్రతి ఒక్కరూ కథలో కలిసిపోయినట్లు నటించారు. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" కథను నమ్మి టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా కష్టపడ్డాం. ఈ కథను ఇంతే సహజంగా తెరపైకి తీసుకురావాలనే ఒకే ఒక ఆలోచన మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరిలో ఉండేది. మంచి సినిమా చేశామని నమ్ముతున్నాం. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీ థియేటర్ లో తప్పకుండా చూడండి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ - రైటర్ పద్మభూషణ్ తర్వాత సుహాస్ తో నేను వర్క్ చేస్తున్న రెండో సినిమా ఇది. పాట బాగా వచ్చినా, ఆర్ఆర్ బాగున్నా స్టూడియోకు వచ్చి సెలబ్రేట్ చేస్తుంటాడు సుహాస్. ఈ సినిమాను డైరెక్టర్ చాలా సహజంగా చిత్రీకరించాడు. ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంది. డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటికి మంచి ట్యూన్స్ చేశాం. ఒక లవ్ సాంగ్. ఈ పాటలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నాను. థియేటర్ లో మా మూవీ చూడండి. అన్నారు.

హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" టీజర్ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్ కు వెళ్లాను. కానీ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఫస్ట్ మూవీ అవకాశం రావడం నమ్మలేకపోయాను. ఈ సినిమా హీరోయిన్ లక్ష్మీ క్యారెక్టర్ నాకు ఇచ్చిన డైరెక్టర్ దుశ్యంత్ కు థ్యాంక్స్. ఆయన చాలా మొండివాడు. సెట్ లో సీన్ కు కావాల్సినవన్నీ ఉండాల్సిందే. అదే పట్టుదల, కన్విక్షన్ తో సినిమా చేశాడు. టీజర్ లో మీకు ఆ క్వాలిటీ కనిపిస్తుంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" లో ప్రతి ఒక్కరికీ యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ మల్లీ మేము చేయగలమో లేదో తెలియదు. సుహాస్ మంచి కోస్టార్. అతని ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది. ఇందులో కూడా చాలా న్యాచురల్ గా నటించాడు. అతను మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా నేను చూశాను. ఈ మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సుహాస్ కెరీర్ లో ఇప్పటిదాకా వైవిధ్యమైన సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమా వాటిన్నంటిలో గొప్పగా నిలబడిపోతుంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లో సుహాస్ యాక్టింగ్ జెమ్ అనుకోవాలి. మరో రెండేళ్లలో సుహాస్ హీరోగా తనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. నేను నా పిల్లలకు సుహాస్ మామ ఏం చేశాడంటే ఈ సినిమా చూపిస్తా. లక్ష్మీ క్యారెక్టర్ లో శివాని సూపర్బ్ గా నటించింది. దుశ్యంత్ నా ఫ్రెండ్. మా బ్యాచ్ నుంచి వస్తున్న మరో డైరెక్టర్. ఈ సినిమాతో అతను డైరెక్టర్ గా నిలబడిపోతాడు. అలాగే టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - ఈ సినిమా పోస్టర్, టైటిల్ చూసినప్పుడే వీళ్లు ఎంత నేటివ్ గా కథను తెరకెక్కిస్తున్నారో అర్థమైంది. అలాగే టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమా చూపించమని అడిగితే వాళ్లు చూపించారు. చాలా మెచ్యూర్డ్ రైటింగ్ తో దుశ్యంత్ సినిమాను తెరకెక్కించాడు. చాలా నాచురల్ గా ఉంటూనే ప్రతి సీన్ లో ఒక డ్రామా ఉంటుంది. సుహాస్ యాక్టర్ గా కలర్ ఫొటో లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ చేశాడు. ఆ తర్వాత అతని సినిమాలన్నీ కంటెంట్ ఉన్నవి ఎంచుకుంటున్నాడు. ఈ మూవీ కూడా పెద్ద హిట్ కావాలి. అన్నారు.

డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ - సినిమా కావాల్సిన హైప్ క్రియేట్ చేయడం టీజర్ పని. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" టీజర్ చూశాక నాకు మూవీ మీద ఆ క్యూరియాసిటీ ఏర్పడింది. ప్రతి ఒక్కరి పర్ ఫార్మెన్స్ బాగుంది. ఆర్టిస్టులందరి ఫర్ ఫార్మెన్స్ బాగుందంటే డైరెక్టర్ బాగా చేయించాడని, అందుకు దుశ్యంత్ ను అప్రిషియేట్ చేస్తున్నా. సినిమా ఆల్రెడీ హిట్ అని మన వాళ్లు చెబుతున్నారు. సో..ఈ టీమ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ - సుహాస్ మా హిట్ 2 సినిమా చేసేప్పుడు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" గురించి తరుచూ చెప్పేవాడు. ఈ సినిమాలో గుండు సీన్ ఉంది. హిట్ 2 కంప్లీట్ కాకముందే ఆ సీన్ కోసం ఎక్కడ గుండు చేయించుకుంటాడో అని భయపడేవాడిని. ప్రతి ఒక్క ఆడియెన్ ఓన్ చేసుకునే నటులు కొందరే ఉంటారు. సుహాస్ అలాంటి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూశాను. ఇందులో ప్రతి క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. క్రిటిక్స్ దగ్గర నుంచి ఆడియెన్స్ దాకా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను అప్రిషియేట్ చేస్తారు. డైరెక్టర్ దుశ్యంత్ ఈ సినిమాతో హిట్ కొట్టినట్లే. ఆర్ఆర్ బాగా చేసే బాధ్యత శేఖర్ చంద్రదే. ఇక ఆయన చేతుల్లో ఉంది. మా ధీరజ్ మంచి ప్రొడ్యూసర్, బిజినెస్ మ్యాన్. ఆయనతో పాటు టీమ్ అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ - ఈ సినిమా కంటెంట్ చూశాను. మంచి మూవీ చేశారు. కొత్త దర్శకుడు చేసినట్లు లేదు. దుశ్యంత్ ఒక పది సినిమాల తర్వాత ఈ మూవీ చేసినట్లు రూపొందించాడు. సుహాస్ మంచి యాక్టర్. తన కెరీర్ బిగినింగ్ లో ఎవరెవరు తనతో సినిమాలు చేశారో...వాళ్లందరితో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మా ధీరజ్ కు మరో హిట్ ఇవ్వాలి. అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా ప్రొడ్యూసర్స్ కారణం. ధీరజ్ గారు మాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అలాగే ఇంత మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన దుశ్యంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. లక్ష్మీ క్యారెక్టర్ లో బాగా నటించింది నా కోస్టార్ శివానీ. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ..ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ ఔట్ పుట్ సూపర్బ్ గా ఇచ్చారు. నా డైరెక్టర్స్ నా కెరీర్ ను ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లులా తీర్చిదిద్దారు. మా ఊరిలో గృహప్రవేశం టైమ్ లో కుంకుమ నీళ్లలో అరచేతిని అద్ది కొత్త ఇంటికి గోడకు అచ్చు వేస్తారు. ఆ అచ్చు అలాగే చిరకాలం ఉండిపోతుంది. నా కెరీర్ లో అలాంటి అచ్చు లాంటి సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". అన్నారు.

డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ - ఇక్కడికి మా సినిమా టీజర్ రిలీజ్ కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. నాలాంటి ఒక కొత్త డైరెక్టర్ కు జీఏ2 పిక్చర్స్ లో మూవీ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" లాంటి మూవీకి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చాలా అవసరం. నాకు మా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, ధీరజ్, వెంకటేష్ మహా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మంచి సినిమా చేద్దామని ఎంకరేజ్ చేశారు. సుహాస్ నాకు మంచి ఫ్రెండ్. 2017లో మేమిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిలిం చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఆ తర్వాత సుహాస్ హీరోగా నటించిన రెండు సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ టైమ్ లో మేము కొన్ని కథలు అనుకున్నాం. ఖచ్చితంగా కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. నేను ఈ కథను ఫోన్ లో లైన్ గా చెప్పాను. టైటిల్, స్టోరీ లైన్ విని మనం సినిమా చేద్దాం అన్నారు సుహాస్. నాతో మూవీ చేసినందుకు సుహాస్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

 

Photo Gallery
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved