pizza
Chandamama Raave teaser launch
`చందమామ` రావే టీజర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 August 2016
Hyderaba
d


అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యి యూత్ హ‌ర్ట్ ని దొచుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రం చందమామ రావే . అది రాదు.. వీడు మార‌డు అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రాన్ని IEF CORPORATION – Italian of the East Films corporation ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా నిర్మాత‌లు కిర‌ణ్ జ‌క్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ధ‌ర్మ‌-ర‌క్ష ద‌ర్శ‌కులు. ప్రియ‌ల్ గోర్ అనే నూత‌న తార హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్య‌బ్స్‌లో జరిగింది. ద‌ర్శ‌కుడు మారుతి బ్యాన‌ర్ లోగో, టీజ‌ర్‌ను నాని(వీడియో ద్వారా) విడుద‌ల చేశారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో....

మారుతి మాట్లాడుతూ ``చంద‌మామ‌రావే ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యే టైటిల్‌. నేను చాలా రోజులుగా అంటే ర‌క్త‌చ‌రిత్ర‌ నుండి ధ‌ర్మ, ర‌క్ష పేర్ల‌ను వింటున్నాను. ఇప్పుడు వీరిద్ద‌రూ ద‌ర్శ‌కులుగా చేస్తున్న తొలి చిత్రం. టీజ‌ర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. నిర్మాత తొలి చిత్ర‌మే అయినా ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా హిమాల‌యాలు, గ్యాంగ్‌ట‌క్‌ల్లో సినిమాను నిర్మించారు. అందాల‌రాక్ష‌సి, ద‌ళం చిత్రాల నుండి ఇప్ప‌టి వ‌ర‌కు హీరో నవీన్ చంద్ర హీరోగా కాకుండా న‌టుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. త‌న‌కు ఈ చిత్రం మ‌రో స‌క్సెస్ ఇవ్వాల‌ని, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తెచ్చే చిత్రం ఇది కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కులు ధ‌ర్మ‌, ర‌క్ష మాట్లాడుతూ ``త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. సినిమా కాన్సెప్ట్ ఏంటో టీజ‌రే చెప్పేస్తుంది. మ‌రి సినిమాలో ఏం చెప్ప‌బోతున్నామ‌నేది చూడాల్సిందే. క‌చ్చితంగా డిఫ‌రెంట్ చిత్ర‌మని చెప్ప‌గ‌లం. నిర్మాత‌గారు, న‌వీన్ గారు పూర్తి స‌పోర్ట్ అందించారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత కిర‌ణ్ జ‌క్కంశెట్టి మాట్లాడుతూ ``ద‌ర్శ‌కులు ధ‌ర్మ‌, ర‌క్ష‌లు సినిమాను చ‌క్క‌గా రూపొందించారు. హీరో న‌వీన్‌చంద్ర పూర్తి స‌హ‌కారాన్ని అందించారు. స‌పోర్ట్ చేసిన అందరికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

 

Priyal Gor Glam gallery from the event

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ``చందమామ రావే టీజ‌ర్ చాలా ప్లెజెంట్‌గా,ఫ్రెష్‌గా ఉంది. సినిమా కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. నిర్మాత కొత్త‌వాడైనా సినిమాను చ‌క్క‌గా నిర్మించారని తెలుస్తుంది. న‌వీన్‌చంద్ర‌కు మంచి స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను. యూనిట్ స‌భ్యుల‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ ``ట్విన్స్ డైరెక్ట్ చేసిన తెలుగు సినిమా ఇది. క‌చ్చితంగా డ‌బుల్ ధ‌మాకా అవుతుంద‌ని భావిస్తున్నాం. నిర్మాత‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

హీరో న‌వీన్ చంద్ర మాట్లాడుతూ ``డేడికేష‌న్ ఉన్న ద‌ర్శ‌క నిర్మాత‌లు, యూనిట్‌తో ప‌నిచేశాను. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ . ప్రియ‌ల్ గోర్ సహా ఇతర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved