pizza
Kodi Ramakrishna launches Ido Prema Lokam teaser & poster
శ‌తాధిక‌చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఆవిష్క‌ర‌ణ‌లో `ఇదో ప్రేమ‌లోకం` టీజ‌ర్‌, పోస్ట‌ర్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 March 2017
Hyderaba
d

‘Ido Prema Lokam’ is the film produced by SP Nayudu under the banner of Sri Srinivasa Films. Kodi Ramakrishna’s protégé Karan Raj has penned the story as well as directed it. The film is done with all the formalities including censor and it is slated for release soon after Ugadi. Kodi Ramakrishna launched teaser and poster of the film.

While speaking on the occasion, Kodi Ramakrishna said, “This is must watch love entertainer film for every youngster of this generation. Most of the love stories are tragedies. Such love stories will get place in history. Karan Raj is very close to me. He worked at me in large number of films in direction department. Karan has got all the talents to become a successful director.

Ashok Chandra is introduced as hero. Senior actors Suman and Naresh performed well. Vandemataram Srinivas has provided wonderful music. I wish the film will become a huge success and bring good name to everyone.”

Ashok Chandra, Teja Reddy, Karunya, Suman, Naresh, Bhagawan, 'Raja Surya Vamsi’ Melkoti, Chitti Babu, Dhanunjaya, Master Chandra Mahess, Devi Sri, Prabhavati etc have featured in the film. Lyrics are by T Karanraj- A Karunakar, Chilaka Rekka Ganesh, music is by Vandemataram Srinivas, Camera is by Shiva K, editing is by Nandamuri Hari. Producer: SP Nayudu, Presenter: Dr Swarnalata-Suresh Babu, Story-Screenplay-dialogues-direction: T Karan Raj.

శ‌తాధిక‌చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఆవిష్క‌ర‌ణ‌లో `ఇదో ప్రేమ‌లోకం` టీజ‌ర్‌, పోస్ట‌ర్‌

శ్రీ శ్రీ‌నివాస ఫిలింస్ ప‌తాకంపై ఎస్‌.పి.నాయుడు నిర్మించిన చిత్రం -`ఇదో ప్రేమ‌లోకం`. కోడి రామ‌కృష్ణ శిష్యుడు క‌ర‌ణ్ రాజ్ స్వీయ‌ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. సెన్సార్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. ఉగాది త‌ర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న‌ ఈ సినిమా టీజ‌ర్‌, పోస్ట‌ర్‌ని క‌ర‌ణ్‌రాజ్‌ గురువు గారైన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కోడి రామ‌కృష్ణ స్వ‌యంగా లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా కోడి రామ‌కృష్ణ మాట్లాడుతూ -``ఈ త‌రం చూడాల్సిన చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ప్రేమ‌క‌థ‌లు ఎప్పుడూ విషాదాంత‌మే. అలాంటివి చ‌రిత్ర పుట‌ల్లోనూ నిలుస్తాయి. అశోక్ చంద్ర ఈ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సీనియ‌ర్లు సుమ‌న్‌, న‌రేష్ చ‌క్క‌గా న‌టించారు. వందేమాత‌రం సంగీతం అద్భుతంగా కుదిరింది. పాట‌లు బావున్నాయి. సినిమా పెద్ద విజ‌యం సాధించి అంద‌రికీ పేరు తేవాలి`` అన్నారు.

అశోక్‌చంద్ర‌, తేజారెడ్డి, కారుణ్య‌, సుమ‌న్‌, న‌రేష్, భ‌గ‌వాన్, `రాజా సూర్య వంశీ` మేల్కోటి, చిట్టిబాబు, ధ‌నుంజ‌య‌, మాష్ట‌ర్ చంద్ర‌మ‌హేష్‌, దేవీశ్రీ‌, ప్ర‌భావ‌తి త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి పాట‌లు: టి.క‌ర‌ణ్‌రాజ్‌- ఎ.కరుణాక‌ర్‌, చిల‌క‌రెక్క గ‌ణేష్‌, సంగీతం: వ‌ందేమాత‌రం శ్రీ‌నివాస్‌, కెమెరా: శివ‌.కె, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి, నిర్మాత‌: ఎస్‌.పి.నాయుడు, స‌మ‌ర్ప‌ణ‌: డా.స్వ‌ర్ణ‌ల‌త‌-సురేష్ బాబు, క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: టి.క‌ర‌ణ్ రాజ్‌.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved