నిఖిల్‌కుమార్ హీరోగా హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ బ్యానర్‌పై ఎ.మహాదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'జాగ్వార్'. టి.సుబ్బరామిరెడ్డి, అల్లు అరవింద్, గంటాశ్రీనివాసరావు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్.డి.కుమారస్వామి, అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, విజయేంద్రప్రసాద్, రఘరామకృష్ణంరాజు, కె.యస్.రామారావు, జగపతిబాబు, కుపేంద్ర రెడ్డి, పుట్టరాజు.సి.యస్, బండపు కాసంపురి, ఎ.మహాదేవ్, సంపత్, ఎస్.ఎస్.థమన్, రామజోగయ్యశాస్త్రి, సాధుకోకిల, ఆదిత్య మీనన్, రఘుబాబు, చిన్ని జయంత్, రామ్‌లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ''దేవగౌడగారు పి.ఎం.గా ఉన్నప్పుడు నేను, కుమారస్వామి లోక్‌సభకు ఎన్నికయ్యాం. కుమారస్వామి సినిమా రంగంలో, రాజకీయాల్లో ఎంత సక్సెస్ సాధించినా కామ్‌గా, సింపుల్‌గా ఉంటారు. ఆయనకు సినిమా అంటే చాలా ఆసక్తి, అందుకని తన తనయుడు నిఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. నిఖిల్ కూడా బాగా కష్టపడ్డాడు. తను తెలుగులో పెద్ద స్టార్ కావాలని కోరుకంటున్నాను. తెలుగు, కన్నడంలో కాకుండా తమిళంలో కూడా పెద్ద సక్సెస్ కావాలి. ఈ సినిమాలో జగపతిబాబు సిబిఐ ఆఫీసర్ పాత్ర పోషించడం పెద్ద ఎసెట్ అయ్యింది. అలాగే విజయేంద్రప్రసాద్‌గారి వంటి మంచి రచయిత కథను తీసుకున్నారు. నిఖిల్ డైమండ్‌లాంటి వ్యక్తి. థమన్, మనోజ్ పరమహంస వంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు'' అన్నారు.
హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ ''నా జీవితంలో ఇది చాలా సంతోషకరమైన రోజు. నేను కన్నడంలో రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాను. నేను ఎగ్జిబిటర్‌గా ఇండస్ట్రీలో ఎంటర్ అయి డిస్ట్రిబ్యూటర్‌గా మారి ప్రొడ్యూసర్ అయ్యాను. వంద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత తెలుగు నిర్మాతలు కన్నడలో సినిమాలు చేసినపుడు విడుదల సమయంలో నావంతు సపోర్ట్ చేశాను. 2004లో 'చంద్ర చకోరి' నిర్మాతగా నేను చేసిన చివరి చిత్రం. తర్వాత ఈ చిత్రం చేస్తున్నాను. ఈ సినిమాని తెలుగులో చేయడానికి కారణం విజయేంద్రప్రసాద్‌గారు. కథ చెప్పడానికి వచ్చిన ఆయన కన్నడలోనే సినిమా ఎందుకు చేస్తున్నారు? తెలుగులో కూడా చేయండి. మీ అబ్బాయి మంచి హీరో అవుతాడని ఆయన అన్న మాటతో ఈ సినిమాను కన్నడ, తెలుగులో చేస్తున్నాను. మహదేవ్ బాగా కష్టపడ్డాడు. సినిమా చాలా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులు నా బిడ్డని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 2016లో విడుదలయ్యే సినిమాల్లో ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఇకపై ప్రతి ఏడాది తెలుగు, కన్నడలో ఖచ్చితంగా ఒక సినిమా చేస్తాను'' అన్నారు.
హీరో నిఖిల్‌కుమార్ మాట్లాడుతూ - ''నాకు తెలుగంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలను చూస్తుంటాను. విజయేంద్ర ప్రసాద్‌గారు మా నాన్నగారిని కలవడానికి వచ్చినపుడు మీ అబ్బాయిని మా అబ్బాయి అనుకుని నా చేతుల్లో పెట్టండి అన్నారు. అది నాకిప్పటికీ గుర్తే. అలా మంచి కథను సిద్ధం చేశారు. మహదేవ్‌గారు ఎంతో కష్టపడి సినిమాను డైరెక్ట్ చేశారు. మనోజ్ పరమహంస బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫి అందించారు. థమన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. నావంతుగా నేను బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టివర్క్‌చేశాను. మా నాన్నగారు నాకోసం ఎంతో చేశారు. ఆయనకు నేను ఏం చేసినా తక్కువే అవుతుంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ''తండ్రి కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఎంత తపన ఉంటుందో ఆ తపనని నేను ఇప్పుడు కుమారస్వామి గారిలో చూస్తున్నాను. ఇక్కడ హీరోగా రాణించాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. ఆ కష్టం నిఖిల్ పడ్డాడు. అది టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
డి. సురేష్‌బాబు మాట్లాడుతూ - ''టీజర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. నిఖిల్ చాలా హార్డ్‌వర్క్ చేసినట్టు కనబడుతోంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ - ''తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంటరై పెద్ద నిర్మాతగా ఎదగాలని, కుమారుడ్ని పెద్ద హీరో చేయాలనే తపన కుమారస్వామి గారిలో కనబడుతోంది. ఓ సందర్భంలో నిఖిల్ గురించి అడిగినపుడు రాష్ట్రం కోసం ఎంతో చేశాను. నా కొడుకు కోసం ఈమాత్రం చేయలేనా అన్నారు. అది ఆయనకు సినిమాలపై ఉన్న ఆసక్తి. రాజకీయాలకంటే ఆయనకు సినిమాలంటే ఆసక్తి అధికం. నిఖిల్ గురించి చెప్పాలంటే చాలా హార్డ్‌వర్కర్. సిన్సియర్ పర్సన్. విజయేంద్రప్రసాద్, మహదేవ్, థమన్, మనోజ్ వంటి మంచి టీమ్ దొరికింది. తను ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. ఇలాంటి సినిమాలో నేను పార్ట్ కావడాన్ని ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను'' అన్నారు.
గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''కుమారస్వామిగారి అబ్బాయి నిఖిల్ హీరోగా పరిచయం కావడం ఆనందంగా వుంది. తాత పిఎం, తండ్రి సిఎం కావడంతో ఇంట్రడ్యూస్ అవుతున్నపుడు ఎవరికైనా ప్రెజర్ ఉంటుంది. నిఖిల్ చాలా హార్డ్‌వర్క్ చేశాడు. టీజర్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ - ''చెన్నాంబిక బ్యానర్ అంటేనే హిస్టరీ. ఒకప్పుడు ఈ బ్యానర్‌లో ఏ హీరో ఇంట్రడ్యూస్ అయినా సెన్సేషనే. కుమారస్వామి గారు సినిమా కోసం ప్రతి నిమిషం ఆలోచిస్తారు. డెడికేషన్ ఉన్న వ్యక్తి. కన్నడ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న నిఖిల్ ఈ సినిమాకు ముందు వన్ ఇయర్ పాటు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిఖిల్ చాలా పెద్ద స్టార్ అవుతాడు'' అన్నారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ''మొదటిసారి నన్ను పిలిచి కథ రాయమన్నప్పుడు ఏం రాద్దాంలే అనుకున్నాను. నిఖిల్‌కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ చూశాక తనలో స్పార్క్ చూసి తను ఒక డైమండ్ అని అర్ధమైంది. నాపై నమ్మకంతో నిఖిల్‌ను నాకు అప్పగించారు. మహదేవ్ సినిమాని కష్టపడి తెరకెక్కిస్తున్నాడు. ఆల్ ది బెస్ట్'' అన్నారు.
మహదేవ్ మాట్లాడుతూ - ''2015 జనవరిలో కుమారస్వామిగారు కథ విన్నారు. వన్ ఇయర్ పాటు హీరో ఏం కావాలో దాని కోసం కథకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యారు. నిఖిల్ పర్‌ఫెక్షన్ కోసం బాగా తపనపడతాడు. సినిమా చాలా వరకు పూర్తయింది. మనోజ్, నారాయణరెడ్డి, థమన్ వంటి మంచి టీమ్‌తో కలసి వర్క్‌చేశాను. కుమారస్వామిగారికి సినిమా పరంగా అన్ని విషయాలు తెలుసు. కన్నడ, తెలుగులో ద్విభాషా చిత్రంగా సినిమా విడుదలవుతుంది. తెలుగులో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండడం వల్ల ఇది తెలుగు సినిమాగానే భావించాను. అవకాశం ఇచ్చిన కుమారస్వామి, నిఖిల్, సునీల్ అందరికీ థాంక్స్'' అన్నారు.
యస్.యస్.థమన్ మాట్లాడుతూ - 'బిగ్గెస్ట్ ఫిలిం ఇది. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. నిఖిల్ చాలా ట్రైనింగ్ తీసుకుని సినిమా కోసం రెడీ అయ్యాడు. మంచి టీమ్ కుదిరింది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు.
నిఖిల్‌కుమార్, దీప్తి జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యమీనన్, భజ్రంగ్ లోకేష్, అవినాష్, వినాయక్ జోషి, ప్రశాంత్, సుప్రీత్ రెడ్డి, రావు రమేష్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, మ్యూజిక్: యస్.యస్. థమన్, ఆర్ట్: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్: రవివర్మ, రామ్-లక్ష్మణ్, కలోయాన్ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: ఎ. మహదేవ్.