అమృత ప్రొడక్షన్స్, గుడ్ సినిమా గ్రూప్, సంజనా మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా కొబ్బరిమట్ట. సంపూర్ణేష్ బాబు హీరో. షకీలా, గాయత్రి, గీతాంజలి, ఇషిక, భార్గవి, మహేష్ కత్తి, గురుచరణ్, అజయ్, సురేష్ కానగంటి, రాజ్, భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఆది కుంభగిరి, సాయి రాజేష్ శీలం నిర్మించారు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో సాయిధరమ్‌తేజ్, మారుతి సంయుక్తంగా విడుదల చేశారు.
సాయిరాజేష్ మాట్లాడుతూ ``హృదయకాలేయం వచ్చి రెండేళ్లయింది. నేను ఆ సినిమాకు దర్శకత్వం చేసేటప్పుడు తొలి షాట్‌ను ఘరానా మొగుడు సినిమాను గుర్తుపెట్టుకునే చేశాను. అందరూ దర్శకులను చూసి స్ఫూర్తి పొంది సినిమాలు చేస్తారు. కానీ నేను ఘరానా మొగుడు చూసి మెగా ఫ్యాన్‌గా సినిమా చేశాను. ఆ సినిమా చేసేటప్పుడయినా ఇది హిట్ అవుతుందా? కాదా? అనే అనుమానం ఉండేది. కానీ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. రూపక్ అద్భుతంగా సినిమా తీశాడు. ఇప్పుడు టీజర్‌లో ఉన్న డైలాగును పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించాను. అయితే ఇంటర్వెల్‌లో మూడు నిమిషాల డైలాగును మగాళ్ల మీద రాశాను. దాంతో దీన్ని టీజర్‌లో పెట్టాను`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ``చాలా లెంగ్తీ డైలాగ్ ఇది. రెండు, మూడు పేజీల్లో ఉన్న ఈ డైలాగును చూడగానే సంపూర్ణేష్‌బాబు చెప్పగలడా? అనే అనుమానం వచ్చింది. దానికి తోడు ఒక లొకేషన్ లో చివరిగా ఈ డైలాగును ప్లాన్ చేశాం. ఓ వైపు లైట్ పోతోంది.. మరో వైపు అన్నీ కరెక్ట్ గా ఉండాలి, దానికి తోడు సీన్ సరిగా రావాలి... ఇదే ఉద్దేశంతో అందరం టెన్షన్ పడ్డాం. కనీసం 60 టేకులైనా పడుతుందేమోనని అనుకున్నాం. అయితే సంపూర్ణేష్‌బాబు రెండు మూడు టేకుల్లోనే అంత డైలాగును అనర్గళంగా చెప్పేయడంతో అందరం క్లాప్స్ కొట్టి, విజిల్స్ వేశాం`` అని తెలిపారు.
మారుతి మాట్లాడుతూ ``ఈ టీమ్ ఎప్పుడేం చేసినా నేను గమనిస్తూ ఉంటాను. రెండేళ్ల క్రితం రాలేదు సునామీ. ఇప్పుడు టీజర్‌లో సంపూ చెప్పిన డైలాగుతో వస్తుంది. తను ఆకతాయిగా సినిమా పరిశ్రమలోకి రాలేదు. చాలా మంచి పెర్ఫార్మర్`` అని అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ``ప్రపంచంలోకెల్లా అతి పెద్ద టీజర్‌ను నేను విడుదల చేసినందుకు హ్యాపీగా ఉంది. సంపూర్ణేష్ బాబు ఎంత క ష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడో తెలుసుకుని ఆయన మీద గౌరవం పెంచుకున్నాను. రూపక్‌కి , టీమ్‌కి ఆల్ ది బెస్ట్ `` అని చెప్పారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ``హృదయకాలేయం చిత్రాన్ని చూసి మారుతి నాకు ఫోన్ చేసుకుని పిలిపించి హగ్ చేసుకున్నారు. సాయిధరమ్‌తేజ్‌కి ఒక మెసేజ్ పెట్టి వెళ్లి కలవగానే ఈ ఫంక్షన్‌కి రావడం ఆనందంగా ఉంది. సాయి చేతుల మీదుగా టీజర్ విడుదల కావడం చిరంజీవి చేతుల మీదుగా అయినంత ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: స్టీవెన్ శంకర్, కెమెరా: ముజీర్ మాలిక్, సంగీతం: సయ్యద్ కామ్రాన్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్: శివ కామేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శేఖర్ అలవలపాటి, లైన్ ప్రొడ్యూసర్: సురేష్ కానగంటి, స్టంట్స్ : స్టంట్ జాషువా.