pizza
Maya Mall teaser launch
`మాయామాల్‌` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

08 August 2016
Hyderaba
d

గ్రీష్మ ఆర్ట్స్ స‌మ‌ర్పిస్తున్న చిత్రం `మాయామాల్‌`. వైష్ణ‌వి మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతోంది. దిలీప్‌, ఇషా, దీక్షాపంత్‌, సోనియా, పృథ్విరాజ్‌, నాగినీడు, కాశీ విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి గోవింద్ లాలం దర్శ‌క‌త్వం వ‌హించారు. కె.వి.హ‌రికృష్ణ‌, చందు ముప్పాళ్ళ‌, న‌ల్లం శ్రీనివాస్ నిర్మాత‌లు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను శ్రీకాంత్‌,సునీల్ సంయుక్తంగా విడుద‌ల చేశారు.

సునీల్ మాట్లాడుతూ ``టీజ‌ర్ చాలా బావుంది. అద్భుతంగా న‌టించారు. అంద‌రికీ మంచి పేరు రావాలి. నిర్మాత‌ల‌కు డ‌బ్బులు రావాలి. శివేంద్ర కెమెరా ప‌నిత‌నం బావుంది. టీజ‌ర్ రేంజ్‌లో సినిమా కూడా హిట్ కావాలి`` అని చెప్పారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ ``సినిమా హిట్ కావాలి. నేను మామూలుగా భ‌య‌ప‌డ‌ను. ఈ సినిమా భ‌య‌పెడుతోంది`` అని అన్నారు.

Diksha Panth Glam gallery from the event

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నేను మూడేళ్లుగా ఈ సినిమా స్క్రిప్ట్ ప‌ట్టుకుని అంద‌రి చుట్టు తిరిగాను. ఈ నిర్మాత‌లు ముందుకొచ్చి సినిమా తీశారు. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు న‌లుగురు పిల్ల‌ర్లు నిర్మాత‌లే`` అని చెప్పారు.

హీరో మాట్లాడుతూ ``గోవింద్ సినిమాను చాలా బాగా తీశారు. ట్రైల‌ర్ చూసి నేనే చాలా ఇంప్రెస్ అయ్యాను`` అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ``సినిమా బాగా వ‌చ్చింది. మేం ఆనందంగా ఉన్నాం. ద‌ర్శ‌కుడు చెప్పిన‌దానిక‌న్నా 500 రెట్లు బాగాతీశాడు. విల‌న్ ఎవ‌రో క‌నుక్కోండి చూద్దాం అనే కాన్సెప్ట్ ను పెడుదామ‌ని అనుకుంటున్నాం. రీరికార్డింగ్ బాగా కుదిరింది`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, దీక్షాపంత్‌, కాశీ విశ్వ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved