నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై తరుణ్ శెట్టి, అవంతిక, కిరిటీ దామరాజు, జెన్ని, భరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం మీకు మీరే మాకు మేమే. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా...
చిత్ర దర్శకుడు హుస్సైన్ షా కిరణ్ మాట్లాడుతూ ‘’మేమందరం ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులమే. అయితే సినిమాల మీద ప్యాషన్ తో ఇక్కడకు వచ్చాం. షార్ట్ ఫిలింస్ తో జర్నీ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఫీచర్ ఫిలి స్థాయికి వచ్చాం. తెలుగు సినిమా ఆల్‌టైం క్లాసిక్ మిస్సమ్మ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం ఆ చిత్రం లోని ఓ సీన్ ని ఇన్స్పైర్ అయ్యి ఈచిత్రాన్ని చేశాను. అందుకే మిస్సమ్మ చిత్రానికి గౌరవం ఇస్తూ ఆ చిత్రంలోని బిట్ సాంగ్ లిరిక్ ని మీకు మీరే మాకు మేమే అనే టైలిల్ ని పెట్టాము. మా చిత్రం అందరికి నచ్చుతుంది. చక్కటి ప్రేమ కథ అందులో చిన్న ఫీల్ తో కథనం వుంటుంది. అంతేకాదు ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ గా వుంటుంది. సినిమాతో పాటే ఆడియెన్స్ కూడా ట్రావెల్ చేస్తారు. ప్రతి ప్రేమను డిఫైన్ చేయడానికి మాకు మేముగా ప్రయత్నించాం. ప్రేమలో ఉండే ప్రాబ్లమ్స్ సహా ప్రేమ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాం. అలాగని కాంప్లెక్స్ లవ్ స్టోరీ కాదు, ఇద్దరూ కాంప్లికేటెడ్ వ్యక్తులు మధ్య నడిచే లవ్ స్టోరీ. అల్లు అరవింద్ గారు మా టీంకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఆయన సపోర్ట్ తోనే సుకుమార్ గారిని కలిశాను. నాన్నకు ప్రేమతో కథను అందించాను. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.
హీరో తరుణ్ శెట్టి మాట్లాడుతూ ‘’హీరోగా చేయడం ఆనందంగా ఉంది. అవంతిక బాగా సపోర్ట్ చేసింది. దర్శకుడు అందించిన ప్రోత్సాహం, మంచిటీం ఎఫర్ట్ తో మంచి అవుట్ పుట్ రాబట్టగలిగాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.
ఎగ్జిక్టూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ వంశీ తాడేపల్లి మాట్లాడుతూ ‘’అందరం మా వంతుగా కష్టపడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఏడు సంవత్సరాల్లో 45 మంది వ్యక్తుల కష్టమిది. మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
కిరిటీ దామరాజు మాట్లాడుతూ ‘’ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ ఇలా సినిమాల్లో పెళ్ళి కొడుకు పాత్రలో కనిపించాను. కానీ ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు.
నటీనటులు.. తరుణ్ షెట్టి(నూతన పరిచయం), అవంతిక మిష్రా, కిరిటి దామరాజు, జెన్ని(నూతన పరిచయం), భరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ అభిషేక్ రాఘవ్, మనీషా, రామ్ గోపాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ వంశీ తాడేపల్లి, సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్, మ్యూజిక్: శ్రవణ్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ప్రొడక్షన్: ఎన్.పి.జి స్టూడియో, కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: హుస్సైన్ షా కిరణ్.