pizza
Mem Famous Teaser Launch
You are at idlebrain.com > News > Functions
Follow Us


26 March 2023
Hyderabad

Lahari Films and Chai Bisket Films Mem Famous Teaser Unleashed

After the blockbuster success of Writer Padmabhushan, Lahari Films and Chai Bisket Films are coming together with another interesting project Mem Famous! First look of which was released recently. Sumanth Prabhas is playing the lead role, besides directing it. Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi are the other prominent cast of the movie written and directed by Sumanth Prabhas himself. Anurag Reddy, Sharath, and Chandru Manoharan together are producing the movie.

The makers unleashed the teaser of the movie today. This movie is about three reckless friends in a village who enjoy life to the fullest, despite being scolded by their parents. They regularly use the term famous. They are not famous but tell people to make them famous. The torn jeans episode, the discussion about the 13th-day ceremony, and posing for photographs at a function are the entertaining parts in the teaser. The video assures that Mem Famous! is going to be a non-stop hilarious entertainer.

Sumanth Prabhas, Mani Aegurla, and Mourya Chowdary trio provided enough laughs as friends. Sumanth Prabhas who also directed the movie picked a subject that has enough scope for amusement. Shyam Dupati’s cinematography is impressive, while Kalyan Nayak elevated the fun quotient with his background score. Srujana Adusumilli is the editor, wherein Arvind Muli is the art director.

The makers yet again announced to release the movie worldwide on 2nd June.

Cast: Sumanth Prabhas, Mani Aegurla, Mourya Chowdary, Saarya, Siri Raasi, Narendra Ravi, Muralidhar Goud, Kiran Macha, Anjimama, Shiva Nandan

Technical Crew:
Writer & Director: Sumanth Prabhas
Producers: Anurag Reddy, Sharath Chandra and Chandru Manohar
Banners: Chai Bisket Films, Lahari Films
Music: Kalyan Nayak
DOP: Shyam Dupati
Editor: Srujana Adusumilli
Art: Arvind Muli
Ex-Producer: Surya Chowdary
PRO: Vamsi-Shekar
Creative Producers: Uday-Manoj

మేమ్ ఫేమస్’ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది: ‘మేమ్ ఫేమస్’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్ ,చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. ఇటివలే ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైన మేమ్ ఫేమస్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఒక గ్రామంలోని ముగ్గురు నిర్లక్ష్యపు స్నేహితులు తమ తల్లిదండ్రులు తిడుతున్నప్పటికీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంటారు. ఆ ముగ్గురూ ఫేమస్ పదాన్ని తరుచుగా వాడుతుంటారు. వారు ఫేమస్ కాదు ఫేమస్ చేయమని చెబుతుంటారు. టార్న్ జీన్స్ ఎపిసోడ్, 13వ రోజు వేడుక , ఒక ఫంక్షన్‌లో ఫోటోగ్రాఫ్‌లకు పోజులివ్వడం టీజర్‌లోని వినోదాత్మకంగా వున్నాయి. మేమ్ ఫేమస్ నాన్ స్టాప్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని వీడియో భరోసా ఇస్తుంది

సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి ముగ్గురు స్నేహితులుగా నవ్వులు పూయించారు. సినిమాకి దర్శకత్వం వహించిన సుమంత్ ప్రభాస్ వినోదానికి తగినంత స్కోప్ ఉన్న సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, కళ్యాణ్ నాయక్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫన్ ని ఎలివేట్ చేశాడు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రిమల్లా రెడ్డి మాట్లాడుతూ.. సుమంత్ ప్రభాస్ చాలా స్మార్ట్ వున్నాడు. తను తెలంగాణ ప్రభాస్. మంచి కంటెన్ వున్న సినిమాలు ఇవ్వడంలో ఛాయ్ బిస్కట్ చాలా ఫేమస్. నిర్మాతలు అనురాగ్ శరత్ చాలా మంచి అభిరుచి వున్న నిర్మాతలు. ఫేమస్ కావాలంటే కష్టపడాలి. యువత కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలి. పాలు అమ్ముకునే నేను ఈ రోజు మంత్రినయ్యా. లక్షలాది విద్యార్ధులని తీర్చిదిద్దుతున్న. కష్టపడితే ఆటోమేటిక్ గా ఫేమస్ అవుతాం. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా వుంది. సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు

సుహాస్ మాట్లాడుతూ.. మేమ్ ఫేమస్ ట్రైలర్ చూశాను. అదిరిపోయింది. సినిమా అదిరిపోతుంది. చాలా జెన్యున్ గా తీసిన సినిమా ఇది. అందరూ జూన్ 2న థియేటర్ కి వచ్చి మా టీం అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.

సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. కాలేజీలో వున్నపుడు సరదాగా పిల్ల పిల్లగా అనే వెబ్ సిరిస్ చేశాం. అప్పుడు మాకు 19 ఏళ్ళు. అప్పుడు సినిమాలకి రావాలనే ఆలోచనే లేదు. డిగ్రీ పరీక్షల తర్వాత ఎస్సై టెస్ట్ కి ప్రిపేర్ అవుదామని అనుకున్న సమయంలో అనురాగ్ అన్న నుంచి కాల్ వచ్చింది. అది నా జీవితాన్ని మార్చింది. మా దగ్గర ఎనర్జీ వుండేది. కానీ డైరెక్షన్ మాత్రం చాయ్ బిస్కెట్ వలనే వచ్చింది. మేము చూసిన సినిమా షూటింగ్ కూడా మా సినిమా షూటింగ్ నే. మేము సినిమా చేయగలమనే నమ్మకాన్ని ఇచ్చింది అనురాగ్ , శరత్ అన్న. వారికి జీవితాంతం రుణపడి వుంటాను. టీజర్ మీ అందరికి నచ్చడం ఆనందంగా వుంది. జూన్ 2న మంచిగా కుదిరిన మటన్ లాంటి రుచికరమైన సినిమా చూపిస్తాం’’ అన్నారు

అనురాగ్ మాట్లాడుతూ.. రైటర్ పద్మ భూషణ్ ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మీ ఆదరణ గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నమకాన్ని ఇచ్చింది. అథితి దేవో భవ అనే మాట వుంది. రైటర్ పద్మభూషణ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రేక్షక దేవో భవ అని ఫిక్స్ అయిపోయాను. మేమ్ ఫేమస్ సినిమాకి కూడా ఇలానే ఆదరిస్తానే నమ్మకం వుంది. సుమంత్ ప్రభాస్ పాజిటివ్ పర్శన్. సుమంత్ ప్రభాస్ లాంటి తమ్ముడు వుండాలని అందరూ కోరుకుంటారు. ఈ సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను.

శరత్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మల్లా రెడ్డిగారికి కృతజ్ఞతలు. కంటెంట్, యువ ప్రతిభని ప్రోత్సహించాలని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. కొత్త దర్శకుడితో తీసిన రైటర్ పద్మ భూషణ్ పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మేమ్ ఫేమస్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్ లో మజా వస్తుంది.

చంద్రు మనోహర్ మాట్లాడుతూ.. అనురాగ్ శరత్ త కలసి పని చేయడం అనందంగా వుంది. ఇదీ బ్లాక్ బస్టర్ కొడతాం’’ అన్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంత పాల్గొంది.

ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్.

ఈ చిత్రాన్ని జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు.

తారాగణం: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్

నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్

బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్

సంగీతం: కళ్యాణ్ నాయక్

డీవోపీ: శ్యామ్ దూపాటి

ఎడిటర్: సృజన అడుసుమిల్లి

ఆర్ట్ : అరవింద్ మూలి

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్ : సూర్య చౌదరి

క్రియేటివ్ ప్రోడ్యుసర్స్: ఉదయ్-మనోజ్


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved