సాయిరాం శంకర్, శరత్ కుమార్, రేష్మీ మీనన్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ``నేనోరకం``. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దీపా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం....
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ``టీజర్ చూడగానే చాలా కొత్తగా అనిపించింది. సినిమా కూడా కొత్తగా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. శరత్‌కుమార్‌గారు విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక హీరోను నేను రామ్ అని పిలుస్తుంటాను. మా పిల్లలిద్దరూ మంచి స్నేహితులు. సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి. దర్శకుడు సుదర్శన్, నిర్మాత దీపా శ్రీకాంత్‌కు ఈ సినిమా మంచి పేరుని తీసుకు రావడమే కాకుండా యూనిట్ సభ్యులకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని, కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ ``మంచి సబ్జెక్ట్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నిర్మాత శ్రీకాంత్ ఏ సమస్య వచ్చిన తేలిగ్గా తీసుకుంటూనే సినిమాను అనేక అడ్డంకులు దాటి చక్కగా వచ్చేలా చేశాడు. చక్రిగారితో నాకు మంచి అనుబంధం ఉంది, అప్పటి నుండి ఆయన సోదరుడు మహిత్‌తోకూడా మంచి అనుబంధం ఉంది. సుదర్శన్ ప్రతి ఫ్రేమ్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. సినిమా పెద్ద హిట్ కావాలని, అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత దీపా శ్రీకాంత్ మాట్లాడుతూ ``నేను సినిమాల్లోకి ముందు కొరియోగ్రాపర్‌గా రావాలనుకున్నాను. కానీ డ్రాప్ అవుతూ వచ్చి ఇప్పటికి నిర్మాతగా మారాను. మంచి కథ. దర్శకుడు సుదర్శన్‌తో మంచి పరిచయం ఉంది. చెప్పిన పాయింట్ నచ్చడంతో సినిమా చేశాను. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. సాయిరాంగారు, శరత్‌కుమార్‌గారు బాగా సపోర్ట్ చేశారు. సహకారం అందించిన అందరికీ థాంక్స్`` అన్నారు.
దర్శకుడు సుదర్శన్ సలేంద్ర మాట్లాడుతూ ``దర్శకుడు మారడంతో కల నిజమైంది. నన్ను, నా కథను నమ్మి శ్రీకాంత్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. అలాగే శరత్‌కుమార్‌గారు ముందు అసలు సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. అయితే రిక్వెస్ట్ మీద కథ విన్న ఆయన సినిమాలో 30 సంవత్సరాల తర్వాత విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నారు. రాధికగారు సినిమా చూసి రాడాన్ సంస్థపై ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. సినిమా మేకింగ్‌లో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. మహత్ గారు మంచి మ్యూజిక్ అందించారు.