మేఘన, సృజన, ప్రత్యూష, జస్వంత్ సమర్పణలో శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ బ్యానర్ పై క్రాంతి చంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్ దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘చంద్రుళ్లో ఉండే కుందేలు’. వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మాజీ పార్లమెంట్ సభ్యులు నర్రెడ్డి తులసి రెడ్డి, సిగ్నేచర్ టీజర్ ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు. జడ్జ్ భాషా నవాబ్ ఖాన్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదలైంది. ఈ కార్యక్రమంలో వి.సముద్ర, నిర్మాత లగడపాటి శ్రీనివాస్, గుంటూరు శ్రీనివాస్, సైంటిస్ట్ వై.వి.రావ్, వేమల లక్ష్మణ్ రావ్, అంజిశ్రీను సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
మాజీ పార్లమెంట్ సభ్యులు తులసి రెడ్డి మాట్లాడుతూ ‘’కళలు మానవ జీవితంలో ఓ భాగం. కళలు లేకుంటే మానవ జీవితం నిస్తారమవుతుంది. సినిమా పరిశ్రమ అనేక మందికి జీవనోపాధిక కల్పిస్తుంది. ఈ సినిమా టైటిల్ లో అట్రాక్షన్ ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తూ చిత్రయూనిట్ ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘’ఈ సినిమాతో అందరూ కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకు దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో ఇలాగే యువతకు పట్టం కట్టాలి. రెండు రాష్ట్రాలైనా అందరూ కలిసి జీవిస్తున్నాం. అందరినీ సంతోష పెట్టేలా సినిమా ఉంటుందని భావిస్తున్నాం’’ అన్నారు.
వి.సముద్ర మాట్లాడుతూ ‘’టైటిల్ వినగానే సక్సెస్ అయినట్లే కనపడుతుంది. యూత్,ఫ్యామిలీ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేలా ఉంది. సినిమా పెద్ద సక్సెసై యూనిట్ కు మంచి పేరు, నిర్మాతలకు లాభాలను తీసుకు రావాలని కోరుకుంటున్నాను‘’ అన్నారు.
నిర్మాతలు ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘’ఈ సినిమా ద్వారా రియల్ ఎస్టేట్ రంగం నుండి సినిమా రంగంలోకి వచ్చాం. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు’’.
దర్శకుడు వెంకటరెడ్డి ఉసిరిక మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
పావనిరెడ్డి, పమేల, కీ.శే.రంగనాథ్, సుమన్, నాజర్, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, సప్తగిరి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్: శివకామేష్ దొడ్డి, రాజీవ్ నాయర్, పాటలు: శ్రీమణి, కరుణాకర్ అడిగర్ల, ఫైట్స్: విజయ్, జాషువా, రాంబాబు, డ్యాన్స్: స్వర్ణ, నిక్సన్, కిరణ్, రాజు, సంగీతం: విజయ్ గోర్తి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దాము నర్రావుల, నిర్మాతలు: ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: విశ్వనాథ్, దర్శకత్వం: వెంకటరెడ్డి ఉసిరిక.