రాజ్ కందుకూరి సమర్పిస్తున్న సినిమా `నాయకి`. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. త్రిష ఈ సినిమాలో నాయికగా నటిస్తోంది. గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలు. గోవి దర్శకుడు.ఈ సినిమాలోని టీజర్‌ను హైదరాబాద్‌లో గురువారం దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ ``టీజర్ ఇంప్ఎసివ్‌గా ఉంది. సినిమా బావుంటుందనే ఒపీనియన్ వచ్చింది. గిరిధర్ ఉదయంలో పనిచేశారు. ఆ తర్వాత హీరోయిన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఇప్పుడు నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. లక్ష్మీరావే మా ఇంటికి సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రెండో సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి. నేను శివరంజని, సుజాత, వంటి సినిమాలను చేశాను. నాయకి కూడా అంతే పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నాను`` అని అన్నారు.
త్రిష మాట్లాడుతూ ``ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా స్టెప్స్ దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చాం. హారర్ కామెడీ సినిమా ఇది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. మా నిర్మాతగారు చాలా ఇన్వాల్వ్ అయి ఈ ప్రాజెక్ట్ చేశారు. మంచి టీమ్‌తో పనిచేశాను`` అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ``ఇలియానాకి మేనేజర్‌గా ఉన్నప్పటి నుంచి గిరిధర్ నాకు తెలుసు. ఈ సినిమా కథను ఇంతకు ముందు వినమంటే వినలేదు. హారర్ కథల కోసం వెతుకుతున్నారని తెలిసి మరలా ఓ సారి వెళ్ళి చెప్పాను. త్రిష కూడా ఐదు నిమిషాలు కథ విని ఒప్పుకుంది. మా పోస్టర్‌కి, ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. రెట్రో హారర్ సినిమా ఇది. ఈ సినిమాతో సత్యం రాజేశ్‌ని తమిళ్‌లోనూ పరిచయం చేస్తున్నాం`` అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``గిరిధర్ చాలా కష్టపడి పైకి వచ్చాడు. ప్రస్తుతం డబ్బింగ్, రీరికార్డింగ్ జరుగుతోంది`` అని చెప్పారు.
రఘు కుంచె మాట్లాడుతూ ``మంచి సంగీతం కుదిరింది. తెలుగు, తమిళంలో త్రిష పాడిన పాట వినాలంటే మరో వారం ఆగాల్సిందే`` అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ``దాసరిగారిని సంప్రదించకుండా నేను ఏ పనీ చేయను. లక్ష్మీరావే మా ఇంటికి సినిమాను చ ఊసి బాగా చేశానని మెచ్చుకున్నారు. ఈ కథ ఎక్స్ ట్రార్డినరీగా ఉండటంతో త్రిష సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు. హారర్ సినిమా ఇది. హారర్ సినిమాలను బ్యాన్ చేయాలని ఆ మధ్య దాసరిగారు అన్నారు. అయితే మా సినిమా వైవిధ్యంగా ఉంటుందని, మా సినిమా విడుదలైన తర్వాత చేయమని చెప్పాను (నవ్వుతూ). త్రిష ఇందులో త్రీ డైమన్షన్స్ ఉన్న కేరక్టర్స్ చేసింది`` అని చెప్పారు.