లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం `సిద్ధార్థ`. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో....
నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ``దర్శకుడు దయానంద్, హీరో సాగర్ నాకు మంచి స్నేహితులు. సాగర్ నాకు బ్రదర్ కంటే ఎక్కువగా భావిస్తున్నాను. టీం అందరి సపోర్ట్‌తో మంచి సినిమాను చేశాం. సెప్టెంబర్ 2న న ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎమోషనల్, ఎంటర్ టైనింగ్ మూవీ. పరుచూరి బ్రదర్స్ నాకు గాడ్ ఫాదర్స్ లా మంచి డైలాగ్స్ అందించారు. ఈ చిత్రంతో దర్శకుడు దయానంద్ ఇండస్ట్రీలోని టాప్ 5 డైరెక్టర్స్‌లో ఒకడిగా నిలుస్తాడు`` అన్నారు
దర్శకుడు కె.వి.దయానంద్ రెడ్డి మాట్లాడుతూ``నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారు తన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలని కోరుకునే నిర్మాత. ఈ సినిమా సక్సెస్‌తో ఆయన మరింత పెద్ద నిర్మాతగా ఎదగాలి. అలాగే పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ సినిమాకు పెద్ద ఎసెట్. విస్సుగారు అద్భుతమైన కథను అందించారు. మణిశర్మగారు ఎక్సలెంట్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. ఫస్ట్ కాపీ చూశాం. చాల హ్యాపీగా ఉన్నాం. అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నాకు, హీరో సాగర్‌కు 17 సంవత్సరాల నుండి మంచి అనుబంధం ఉంది. సాగర్ బుల్లితెరపైనే కాదు, వెండితెరపై కూడా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకుంటారు`` అన్నారు.
హీరో సాగర్ మాట్లాడుతూ``మూవీ ఎంత పెద్ద సక్సెస్‌ను సాధిస్తుందనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో వర్క్ చేయడం వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ ఏర్పడింది. దాసరి కిరణ్‌కుమార్‌గారు, పరుచూరి బ్రదర్స్, విస్సు, మణిశర్మ,గోపాల్ రెడ్డి ఇలా అందరూ టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. డైరెక్టర్ దయానంద్‌గారు చాలా కూల్ గా ఉంటూనే తనకు కావాల్సిన వర్క్ ను అందరి దగ్గర నుండి రాబట్టుకున్నారు. అన్నీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ``హీరో సాగర్‌కు మాస్, క్లాస్‌ల్లో మంచి ఆదరణ దొరుకుతుంది. కథలో మంచి ప్రేమ, పగ, సెంటిమెంట్ ఉన్నాయి. అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా కుదిరాయి. విసు మంచి కథను అందించాడు. టీజర్ చాలా బావుంది. ట్రైలర్, సినిమా ఇంకా బావుంటాయని భావిస్తున్నాను`` అన్నారు.
కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ``టైటిల్ చాలా బావుంది. ఇలాంటి టైటిల్ పెట్టడంతోనే సగం విజయం సాధించినట్టయ్యింది. మణిశర్మ, గోపాల్ రెడ్డి, పరుచూరి బ్రదర్స్ ఇలా టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేశారు. దాసరి కిరణ్‌గారు మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసరే కాదు, మంచి ప్రొఫెషనల్ నిర్మాత కూడా. సాగర్ తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు`` అన్నారు.