pizza

Thandel Hindi trailer launch
Thandel trailer is fantastic and the movie should be huge success - Aamir Khan
‘తండేల్’ ట్రైలర్ ఫెంటాస్టిక్ గా వుంది. నాగచైతన్య అమెజింగ్ యాక్టర్. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి: హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్

You are at idlebrain.com > News > Functions
Follow Us


30 January 2025
Hyderabad

 

Yuva Samrat Akkineni Naga Chaitanya and Sai Pallavi’s highly anticipated film Thandel, directed by Chandoo Mondeti, is set to release worldwide on February 7th. Presented by mega producer Allu Aravind and produced by the passionate Bunny Vasu under the prestigious Geetha Arts banner, the trailer and songs have already generated immense buzz and anticipation. Today, Bollywood superstar Aamir Khan unveiled the Hindi trailer of the film in Mumbai.

Speaking at the trailer launch event, Bollywood superstar Aamir Khan said, "Thank you all for your love. Aravind garu is like an elder brother to me. Thandel is coming on February 7. My son's film is also coming on the same day. But it doesn't matter, I said I will come to the trailer launch of this film. If the story is good, the audience will watch any number of films. I really liked the trailer of Thandel. It is fantastic. The director has shot it very well. The music is fantastic. Actually, I should share this, I really love "Dinka Chika Dinka Chika" song among Devi Sri Prasad's compositions. Basically, I don't like dancing but I will start dancing listening to it.

There are heart touching emotions in the trailer of Thandel. Chaitanya is a fantastic actor and an ideal co-star. Working with him is an amazing experience. He is a good human being. Sai Pallavi is also a very good performer. This film should be a big success. All the very best to the whole team."

Naga Chaitanya said, “I’m someone who believes in sentiments a lot. I remember the film I did with Sai Pallavi, Love Story. Aamir sir watched the trailer and messaged me saying, he liked it. That film became a big hit. Now, Aamir Khan launching the trailer of my film Thandel gave me a lot of confidence. Working for the film Laal Singh Chaddha with Aamir was a great experience for me. I learned a lot from him in those six months.

I felt very excited when Chandoo told me the story. It’s a beautiful love story. I went to Srikakulam and met the fishermen there. When I heard the stories they shared, I understood how challenging this film would be for me. Such stories rarely come to actors, and this is a big opportunity for me. I feel very lucky to be a part of this film. Thanks to Allu Arvind garu for trusting me with the character of Thandel Raju. It took me a year and a half to transform into this look. Arvind garu made this film without compromising on anything. 100% Love with Arvind garu was a turning point in my career, and I think ‘Thandel’ will also be another turning point and a huge positive in my career. Chandoo has made a wonderful film. Devi Sri Prasad’s songs have already become chartbusters. Sai Pallavi has given a mind-blowing performance. I hope you all enjoy the film on February 7. I also wish Junaid’s film all the very best at the box office."

Producer Allu Aravind said, "Aamir Khan’s son, Junaid Khan's film, will be released alongside Thandel. Despite that, I wanted a superstar to release my trailer in Mumbai. So, I called him, told him about the trailer launch, and specified the release date. He said, ‘No problem. Both films will do wonderfully at the box office. I’m coming to the event.’ I thank him for his kind heart. Thandel is based on a true story. It’s about fishermen from the coastal area of Vizag who went to Gujarat for fishing, mistakenly crossed the border, and were caught by the Pakistani army and imprisoned. We met and spoke to the real-life people involved. Director Chandoo has crafted this story wonderfully. The prison scenes, village scenes, and love story will impress the audience. Sai Pallavi has performed very well, and Naga Chaitanya has given his career-best performance. His career will be divided into 'before Thandel' and 'after Thandel'. He worked continuously for a year and a half on this film. Devi Sri has given chartbuster music, and all the songs have become superhits. Thanks to the entire team for giving us such a great film."

Director Chandoo Mondeti said, "It’s a great pleasure to share the stage with Aamir Khan. I want to work as an assistant director on Aamir’s films for six months. After that, I’d like to tell him a story. That’s my sincere request (laughs). Thandel is a beautiful love story. What the character Raju did for his people in Karachi will also be very interesting. Devi Sri has contributed not only with the music but also in writing."

Rockstar Devi Sri Prasad said, " Aamir sir, we love you. It’s a great pleasure to have Aamir Khan supporting Thandel. I’m proud to meet him. His contribution to Indian cinema is priceless. The Mumbai audience has always given a great response to my songs. Thank you, Allu Aravind garu. Geetha Arts has been producing wonderful films, and Thandel has also come out wonderfully. This has been a great journey. Director Chandoo has written a very wonderful story, and the film has been made in a heart-touching way. Naga Chaitanya has performed fantastically; he’s transformed into beast mode for this character. Sai Pallavi has acted marvelously, and their chemistry is amazing. It will impress everyone. I’d like to thank all the lyricists, technicians, and musicians. I’m sure you’ll all love this movie."

 

‘తండేల్’ ట్రైలర్ ఫెంటాస్టిక్ గా వుంది. నాగచైతన్య అమెజింగ్ యాక్టర్. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి: హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైల‌ర్‌ను ముంబైలో లాంచ్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు. అరవింద్ గారు నాకు బ్రదర్ లాంటివారు. తండేల్ ఫిబ్రవరి 7న వస్తుంది. అలాగే మా అబ్బాయి నటించిన సినిమా కూడా అదే రోజు వస్తుంది. అయినా పర్లేదు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి వస్తానని చెప్పాను. కథ బావుంటే ఎన్ని సినిమాలు అయినా ఆడియన్స్ చూస్తారు. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్. తను మంచి హ్యూమన్ బీయింగ్. సాయి పల్లవి కూడా చాలా మంచి పెర్ఫార్మర్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీ వన్. సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం నాకు మ్యాజికల్ మూమెంట్. లాల్ సింగ్ సినిమా అమీర్ గారితో చేయడం నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆరు నెలల్లో ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కథ చెప్పినప్పుడే నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుందో అర్థమైంది. ఇలాంటి కథలు యాక్టర్స్ కి చాలా అరుదుగా వస్తాయి. ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ. ఇలాంటి సినిమాల్లో పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ట్రస్ట్ చేసిన అరవింద్ గారికి థాంక్యూ. ఈ లుక్ లోకి ట్రాన్స్ఫర్ కావడానికి ఏడాదిన్నర పట్టింది. అరవింద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీశారు. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జునైద్ సినిమాకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ సినిమాతో పాటే అమీర్ ఖాన్ గారి అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ సినిమా చేసిన సూపర్ స్టార్ ఒక్కరే. ఆయనకి ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ గురించి చెప్పాను. 'ఏం పర్లేదు.. రెండు సినిమాలు అద్భుతంగా ఆడుతాయి. నేను వస్తున్నాను'అన్నారు. ఆయన కైండ్ హార్ట్ కి థాంక్ యూ. తండేల్ నిజంగా జరిగిన కథ. వైజాగ్ తీర ప్రాంతంలోని కొందరు వ్యక్తులు చేపల వేటకు గుజరాత్ వెళ్లి పొరపాటున బోర్డర్ క్రాస్ చేసి పాక్ సైన్యం చేతిలో చిక్కుకొని జైలు పాలైనవారి కథ. నిజ జీవితంలోని వ్యక్తులని కలసి వారితో మాట్లాడటం జరిగింది. దర్శకుడు చందు ఈ కథని అద్భుతంగా తీర్చిదిద్దాడు. జైలు సీన్స్, విలేజ్ సీన్స్, లవ్ స్టొరీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయి పల్లవి చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్ తండేల్ తర్వాత తండేల్ కి ముందు అన్నట్టుగా వుంటుంది. ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటుగా నిరంతరం కష్టపడ్డారు. దేవిశ్రీ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ' అన్నారు.

డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ...అమీర్ ఖాన్ గారితో స్టేజ్ ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అమీర్ గారి సినిమాల్లో ఆరు నెలలపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉంది.తర్వాత ఆయనకి ఒక కథ చెప్పాలని ఉంది. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. (నవ్వుతూ). ఇది బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. రాజు అనే క్యారెక్టర్ కరాచీలో తన మనుషుల కోసం ఏం చేశాడనేది కూడా చాలా ఆసక్తికరంగా వుంటుంది. దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు రైటింగ్ లో కూడా తన కాంట్రీబ్యుషన్ వుంది' అన్నారు

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. అమీర్ సార్ వి లవ్ యు. తండేల్ సినిమాకి అమీర్ ఖాన్ గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని కలవడం గర్వంగా ఉంది. ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. ముంబై ఆడియన్స్ నా పాటలకు ఎప్పుడు కూడా చాలా గ్రేట్ రెస్పాన్స్ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి థాంక్యూ. గీత ఆర్ట్స్ అద్భుతమైన చిత్రాలన్నీ నిర్మిస్తుంది. తండేల్ ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది చాలా గ్రేట్ జర్నీ. డైరెక్టర్ చందు చాలా అద్భుతమైన కథను రాశారు. సినిమాని హార్ట్ టచింగ్ గా తీశారు. నాగచైతన్య ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన బీస్ట్ మోడ్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సాయిపల్లవి మార్వలెస్ గా యాక్ట్ చేసింది. వారి కెమిస్ట్రీ మీ అందరిని ఆకట్టుకుంటుంది. లిరిక్ రైటర్స్ కి, టెక్నీషియన్స్ కి, మ్యూజిషియన్స్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది'అన్నారు.

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved