pizza
Janatha Garage Thanks meet
'జనతాగ్యారేజ్‌' థాంక్స్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 August 2016
Hyderaba
d

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో యలమంచిలి రవిశంకర్‌, ఎర్నేని నవీన్‌, సి.వి.మోహన్‌లు నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. సెప్టెంబర్‌ 1న సినిమా రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, కొరటాల శివ, సమంత, దేవిశ్రీప్రసాద్‌, దిల్‌రాజు, రాజీవ్‌కనకాల, బ్రహ్మాజీ, అజయ్‌, కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.యస్‌.ప్రకాష్‌, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో...

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''మాట్లాడటానికి మాటల్లేవ్‌, అనుభూతులు మాత్రమే మిగిలున్నాయి. కొన్ని సందర్భాల్లో మాటలు మాట్లాడలేం, కన్నీళ్ళు మాత్రమే వస్తాయి, అలాంటి గొప్ప అనుభూతినిచ్చిన దర్శకుడు కొరటాల శివగారికి థాంక్స్‌. ఇక్కడొక విషయం చెప్పాలి...సెప్టెంబర్‌ 1న జనతాగ్యారేజ్‌ సినిమా విడుదలైంది. సెప్టెంబర్‌ 2న మా అమ్మనాన్నల పుట్టినరోజు. గత పన్నెండేళ్ళుగా నా తపనను నా తల్లిదండ్రులకు తెలియజేయాలని సంకల్పాన్ని జనతాగ్యారేజ్‌ రూపంలో కొరటాల శివ కల్పించారు. నాకు జనతాగ్యారేజ్‌ రూపంలో ఓ వెలుగు కనపడుతుందని ఆడియో ఫంక్షన్‌లో చెప్పాను. అలా నేను నమ్మిన వెలుగును నాకు అందించిన ఆడియెన్స్‌ను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ విజయాన్ని ఎప్పటికీ మరచిపోలేను. నాకు వచ్చిన అన్నీ విజయాలకంటే ఈ విజయాన్ని నా గుండె దగ్గరగా పెట్టుకుంటాను. అలాగే ఇంకా బాధ్యతతో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. ఇక నేను, సమంత కలిసి చేసిన నాలుగో సినిమా ఇది. మా కాంబినేషన్‌ బృందావనం తర్వాత వచ్చిన రెండు సినిమాలు అనుకున్నంత సక్సెస్‌ సాధించలేకపోయాయి. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ఇందులో సమంత హీరోయిన్‌ అయితే బావుండేదనిపించింది. నా మనసులో మాట కొరటాల శివగారికి తెలిసిందేమో ఈ సినిమ
ాలో నిజంగానే ఆయన సమంతను హీరోయిన్‌గా తీసుకున్నారు. మా కాంబినేషన్‌లో పెద్ద సక్సెస్‌ అయిన సినిమాగా నిలిచిపోయింది. అలాగే బ్రహ్మాజీ, అజయ్‌, బెనర్జీ ఈ సినిమాలో ఆరుగుగుర మాకు అందించిన బలాన్ని మరచిపోలేను. ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావుగారు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌గారు అందించిన సపోర్ట్‌ను మరచిపోలేం. రాజీవ్‌కనకాలగారితో చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన నటించిన జి.హెచ్‌.ఎం.సి సీన్‌ సూపర్బ్‌గా వచ్చింది, చాలా ఏళ్ళ తర్వాత మా కలయికలో వచ్చిన సక్సెస్‌ఫుల్‌ చిత్రమిది. దర్శకుడు కొరటాల శివగారు సన్నివేశాలను ఎంత అందంగా చూపించినా, ఆ సన్నివేశానికి తగిన విధంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను అందించిన దేవిశ్రీప్రసాద్‌ సినిమాకు పరిపూర్ణమైన సంగీతాన్ని అందించాడు. మోహన్‌లాల్‌గారి పక్కన నటించేంత అనుభవం, అర్హత లేని వ్యక్తిని నేను. కానీ ఆయన నన్ను ఓ కొడుకులా, శిష్యుడిలా భావించారు. ఆయనతో ఈ సినిమా సమయంలో చేసిన జర్నీ నాలోని ఎన్నో కొత్త కోణాలను చూశాను. నిర్మాతలను నేను జాన్‌, జానీ, జనార్ధన్‌ అని పిలుచుకుంటూ ఉంటాను. సినిమా ఇంత బాగా రావడానికి వారే కాణం. వారింకా ఎన్నో గొప్ప చిత్రాలు తీయాలని భావిస్తున్నాను'' అన్నారు.

Samantha Glam gallery from the event

కొరటాలశివ మాట్లాడుతూ - ''జనతాగ్యారేజ్‌ నాకు చాలా స్పెషల్‌ మూవీ. ఎన్టీఆర్‌ను నేను అన్న అని అంటుంటాను కానీ వయసులో చాలా చిన్న వ్యక్తి. ఈ కథ వినగానే ఎక్కువగా థ్రిల్‌ అయ్యి మాఅ ందరికీ కంటే సినిమా కథ చేయడానికి చాలా ఎగ్జయిట్‌ అయ్యారు. అలాగే దేవిశ్రీప్రసాద్‌ కూడా అలాగే సినిమా గుంచి నమ్మాడు. అందుకే ఇంత అద్భుతైన సంగీతాన్ని అందించారు. మోహన్‌లాల్‌గారు పాత్రలో ఒదిగిపోయి నటించారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. జయహో..జనతా'' అన్నారు.
' అన్నారు.

హీరోయిన్‌ సమంత మాట్లాడుతూ - ''మంచి టీం చేసిన ప్రయత్నమిది. అందరికీ మంచే జరుగుతుంది. ఇలాంటి బ్లాక్‌బస్టర్‌, కలెక్షన్స్‌కు ఎన్టీఆర్‌ అర్హుదు

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ - ''చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి చిత్రంలో మంచి రోల్‌ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఒక వారంలోనే బయ్యర్స్‌ పెట్టిన మొత్తం తిరిగి రావడం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద అచీవ్‌మెంట్‌ చయడానికి కారణమైన ఎన్టీఆర్‌, మైతీ మూవీ సంస్థకు థాంక్స్‌'' అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్‌ సభ్యులు యూనిట్‌ను అభినందించారు'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved