pizza
Oopiri Thanks Meet
‘ఊపిరి’ థాంక్స్ మీట్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

13 April 2016
Hyderabad

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగుతమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరికవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. ఈ చిత్రం తెలుగుతమిళ భాషల్లో మార్చి 25న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో డా.దాసరి నారాయణరావు, నాగార్జున, అఖిల్, శ్రీమతి ఎ.నాగసుశీల, కోనవెంకట్, వంశీపైడిపల్లి, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, తమన్నా తదితరులు పాల్గొన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘’వంశీ నుండి ఊపిరి యూనిట్ కు థాంక్స్. ఒక ఆర్టిస్ట్ కు, డైరెక్టర్ కు మంచి ప్రొడ్యూసర్ అవసరం. మాకు పివిపి రూపంలో మంచి ప్రొడ్యూసర్ దొరికాడు. నాగచైతన్య సినిమా టైటిల్ సాహసమే శ్వాసగా సాగిపో అనే టైటిల్ నాకు ఎంతో ఇష్టం. నేను చాలా సంవత్సరాలుగా ఆ టైటిల్ లోని మీనింగ్ ను ఫాలో అవుతున్నాను. ఆ సాహసంతోనే  గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, మాస్, అన్నమయ్య ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పటి వరకు వచ్చాను. సాహసమే శ్వాసగా సాగిపోలో శ్వాస అభిమానులు. వారే లేకుంటే ఇలాంటి సినిమాలు చేసేవాణ్ణి కాను. ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉంటాం. ఇదే సాహసంతో, కాన్ఫిడెంట్ తో తిరుపతి వెంటేశ్వరస్వామి దగ్గరకు కి వెళ్లి హథీరాంబాబాపై కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాను. ఈ రెండు నెలలు ఆ సినిమా కోసం రెడీ అవుతున్నాను. అంతే కాకుండా ఈ రెండు నెలల్లో కళ్యాణ్ కష్ణ, నాగచైతన్యతో ఓ సినిమా మొదలు పెట్టడం, వంశీని, అఖిల్ ను కూర్చోపెట్టి కథను ఫైనల్ చేయించడం కూడా ఈ రెండు నెలల్లో చేయించాలి. నేను ఇంత ముందు వరకు నా ఇద్దరబ్బాయిల మీద మనసు పెట్టలేదు. ఈ  ఏడాది అదే పనిలో ఉంటాను. ఇదే నేను అక్కినేని అభిమానులకు ఇచ్చే ప్రామిస్’’ అన్నారు.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘’అక్కినేని అభిమానులంటే నా అభిమానులు. నా అభిమాన నటుడు నాగేశ్వరరావుగారు. ఊపిరి తెలుగు సినిమా పరిశ్రమకు నాగేశ్వరరావుగారు ఊపిరి. నాగేశ్వరరావుగారికి నాగార్జున ఊపిరి. నాగార్జునకి చైతు, అఖిల్ ఊపిరి. పదిహేను సంవత్సరాల క్రితం బొమ్మరిల్లు సినిమా చూశాను. దాని తర్వాత నేను ఇంత వరకు ఒక గొప్ప సినిమాను చూసుంటే అది కేవలం ఊపిరి మాత్రమే. మన తెలుగు వారు గొప్ప చిత్రం చేయగలరని నిరూపించిన చిత్రమిది. ఈ సినిమా తీయడానికి గట్స్ చూపించిన పివిపిని అభినందిస్తున్నాను. ఇదే టీంతో గొప్ప కమర్షియల్ సినిమా తీయవచ్చు. కానీ పివిపిగారు గొప్ప సినిమా తీశారు. ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్న నాగార్జునగారికి హ్యాట్సాఫ్. నాకు తెలిసి ఈ సినిమా చేయడానికి ఏ కమర్షియల్ హీరో ఒప్పుకోడు. ఒక ఆర్టిస్ట్ కు కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోపెట్టినందుకు వంశీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నాకు నాగార్జున కళ్లంటే ఇష్టం. నా మజ్ను సినిమా తర్వాత నాగార్జున కళ్లను ఎవరూ వాడుకోలేదు. కానీ ఇప్పుడు వంశీ వాడుకున్నాడు.కళ్లతో నటించడం అంటే సులభం కాదు. నటనలో పరిపక్వత వచ్చిన వారు మాత్రమే చేయగలరు. నేనైతే జ్యూరీలో ఉంటే నాగార్జున బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చేస్తాను. నిన్న సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో ఎగిరి గంతేసి, ఈవాళ కుర్చీలో కూర్చుని పెర్ పార్మెన్స్ చేయడం అంత ఈజీకాదు. మనం సినిమాను అన్నపూర్ణ స్టూడియో తప్ప వేరేవరో చేయలేరు. తీసిన ఆడేది కాదు. ఎప్పుడు నాగార్జునగారు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇదంతా నాగేశ్వరరావుగారి నుండి వచ్చినదే. ఒక నటుడు వేయాల్సిన వైవిధ్యమైన పాత్రలన్నింటినీ ఆయన చేసేశారు. అదే వైవిధ్యమే నాగార్జునలో కనిపిస్తుంది. దర్శకుడు వంశీ నిజమైన హీరో. సినిమాను ఎంతో అద్భుతంగా తీశాడు. ప్రతి సీన్ ను డిఫరెంట్ తీశాడు. కార్తీ తప్ప ఆ పాత్రను ఎవరూ చేయలేరు. పదిహేనేళ్ల తర్వాత నేను చూసిన గొప్ప సినిమా ఇది. హిట్ సినిమా, మంచి సినిమాను కలిపితేనే గొప్ప సినిమా అవుతుంది. అలా ఊపిరి గొప్ప సినిమాగా నిలిచిపోయింది. ఇలాంటి సినిమాను ఆదరించిన అక్కినేని అభిమానులకు, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.  

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘’ఊపిరి తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు కొత్తగా కనపడుతున్నారు. నా ఇన్నేళ్ల జర్నీ ప్రతి ఒక్కరూ సహకారంతో ఇక్కడికి వచ్చాను. నాగార్జునగారు ఏ నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నారో తెలియదు. ఆయన నమ్మకాన్ని ఫ్యాన్స్, ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ కొత్త జీవితాన్నిచ్చారు. నాగార్జుగారి నమ్మకమే ఈ సినిమాను, మమ్మల్ని ముందుకు నడిపించింది. కార్తీగారు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పిన తక్కులే. తమన్నా అందగత్తె కాదు, అమేజింగ్ పర్సన్. నాగార్జునగారు, పివిపి అన్నయ్యే ఊపిరి. ఈ కంటెంట్ ను నమ్మి నాకు నమ్మకాన్ని ఇచ్చినందుకు ఆయనకు పాదాభివందనాలు. ఒక తమ్ముడిలా చూసుకున్నారు. ఆయన విజన్ లేకుండా ఈ సినిమా లేదు. అలాగే హరిగారు, అబ్బూరి రవి, పి.ఎస్.వినోద్, గోపీసుందర్, ఎడిటర్ మధు సహా నా డైరెక్షన్ టీం సహా అందరికీ ఏమిచ్చినా రుణం తీరదు. దాసరిగారు, రాఘవేంద్రరావుగారు, రాజమౌళిగారు, శ్రీనువైట్లగారు, వినాయక్ గారు, హరీష్ గారు, శివగారు ఇలా అందరరూ ఫోన్ చేసి అభినందించారు. మంచి సినిమాను తీస్తే కలిగే గౌరవం ఈ సినిమాతో తెలిసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లెట్ అస్ సెలబ్రేట్ లైఫ్ అని చేసిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు మా లైఫ్ బ్యూటీ ఫుల్ చేశారు’’ అన్నారు.

ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ ‘’మంచి సినిమాను చేసినందుకు నాగార్జునగారికి, ఆదరించిన తెలుగుప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ ‘’ఇలాంటి మంచి స్క్రిప్ట్ ఇచ్చినందుకు వంశీకి థాంక్స్. పివిపిగారు గట్స్ తో పాటు, రిస్క్ తీసుకుని చేసినందుకు ఆయనకు థాంక్స్. ఈ సినిమా ఎమోషనల్ జర్నీ. సినిమా చూసి ఏడ్చేశాను. నాన్నగారే మా ఊపిరి. ఈసినిమా చేసినందుకు నాన్నగారికి థాంక్స్’’ అన్నారు.

తమన్నా మాట్లాడుతూ ‘’చాలా మంచి సినిమాలు, గుర్తుండిపోయే సినిమాలు చేశాను. సక్సెస్ ను టీంతో, ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేసే సినిమాలు తక్కువ. అలా ఎంజాయ్ చేసిన సినిమాలో ఇదొకటి. కార్తీతో మూడో సినిమా. తనతో హ్యాట్రిక్ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. నాగార్జుగారితో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పివిపిగారికి, సపోర్ట్ చేసిన యూనిట్ సభ్యులకు థాంక్స్’’అన్నారు.

సుశాంత్ మాట్లాడుతూ ‘’ఇన్ టచ్ బుల్స్ మూవీని ఊపిరి సినిమా చూడలేదు. సినిమా చూడగానే యూనిట్ అందరికీ ఫోన్ చేసి అభినందించాను. ఇలాంటి సినిమా చేయడానికి చిన్న మావయ్యకైనా, పివిపిగారికైనా, వంశీకైనా గట్స్ కావాలి. కొన్ని సన్నివేశాలు చూసేటప్పుడు కంట్లో నీళ్లు తిరిగాయి. సినిమా చూసేటప్పుడు ఎడుపొస్తుంది, అలాగే నవ్విస్తుంది. ఎమోషనల్ గా ఫీలయ్యాను. ఇలాంటి సినిమాను ఈ మధ్య కాలంలో ఎక్స్ పెక్ట్ చేయలేదు. గీతాంజలి, శివ, నిన్నేపెళ్లాడతా, అన్నమయ్య, సోగ్గాడే చిన్నినాయనా తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు హథీరాంబాబా సినిమా చేస్తున్నారు. వెర్సటైల్ ఆర్టిస్ట్. చాలా గర్వంగా ఉంది. వంశీ కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడు. ఇలాంటి సినిమాలు చేయడం కష్టం. కమర్షియల్ సినిమాలను ఇలా కూడా చేయగలమని చూపించారు. పివిపి గారు గట్స్ తో ఎంతో నమ్మి చేసిన సినిమా. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ విభాగాలు బావున్నాయి’’ అన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో పాటలు కానీ పాటలు రాసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ఊపిరి ఇలాంటి చిత్రాన్ని చేయడానికి గట్స్ కంటే నమ్మకం కావాలి. నాగార్జునగారికి అలాంటి నమ్మకం చాలా ఉంది. అందుకే కెరీర్ స్టార్టింగ్ లోనే గీతాంజలి వంటి సినిమా చేశారు. నాగేశ్వరరావుగారు తన కెరీర్ లో ఎలాంటి ప్రయోగాలు చేశారో, నాగార్జునగారు తండ్రిని అనుసరిస్తున్నారు. కొత్తదనాన్ని నమ్మి చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన పదే పదే ప్రూవ్ చేశారు. రీమేక్ అంటే ఫ్రీమేక్ చేసేస్తుంటారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ అటు ఇటు మార్చి తీసేస్తుంటారు. కానీ ఇది కంప్లీట్ గా ఇతివృత్త పరంగా, కథాపరంగా చాలా తేడా ఉంది. అచ్చమైన, స్వచ్చమైన తెలుగు కథలా తీసినందుకు వంశీ పైడిపల్లి అండ్ టీంను అభినందిస్తున్నాను’’ అన్నారు.

కోనవెంటక్ మాట్లాడుతూ ‘’ఊపిరి సక్సెస్ ప్రేక్షక విజయం. మూస సినిమాల ఊబిలో కూరుకుపోతున్న తెలుగు సినిమాకు ఊపిరి పోసిన సినిమా ఊపిరి. అభినేత్రి షూటింగ్ టైంలో చిత్రీకరణ ముగిసిన తర్వాత ప్రభుదేవా, నేను సహా యూనిట్ అందరం వెళ్లి సినిమా చూశాం. సినిమాను ఇలా కూడా తీయవచ్చా అని ఆలోచించాం. కమర్షియల్ సినిమాకు కొత్త డెఫినిషన్ ఇచ్చిన సినిమా ఇది. మనసుకు హత్తుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. నాగార్జునగారు కదలలేని క్యారెక్టర్ చేసి మనల్ని కదిలించారు. ఆయన క్యారెక్టర్ హాంట్ చేసింది. అభిరుచి గల యూనిట్ సభ్యులు పనిచేసిన సినిమా ఇది. మా అందరికీ కనువిప్పు కలిగేలా చేశారు’’ అన్నారు.

కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ‘’ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నాగ్ గారు, కార్తీ, పివిపిగారికి, వంశీగారికి, తమన్నాగారికి అందరికీ థాంక్స్. గత 25 సంవత్సరాల్లో తెలుగు సినిమా డైరెక్షన్ ను మార్చిన సినిమాలు తీసుకుంటే అందులో నాగ్ సార్ సినిమాలే ఎక్కువ. నాగార్జున అభిమానులు గర్వపడాల్సిన విషయం. నాగార్జునగారు తెలుగు హీరో అయినందుకు తెలుగువారు గర్వపడాల్సిన సినిమా ఇది. చాలా పెద్ద రిస్క్ తో చేసిన సినిమా. ప్రయత్నం బలంగా ఉంటే ఫలితం తృప్తిగా ఉంటుంది. ప్రయత్నం కొత్తగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుందని ఈ సినిమాతో అర్థమైంది.

దిల్ రాజు మాట్లాడుతూ ‘’నాగార్జునగారు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చినందుకు ఇండస్ట్రీ తరపున, ఆడియెన్స్ తరపున ఆయనకు థాంక్స్. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు, నెక్ట్స్  జనరేషన్ హీరోలకు నాగార్జునగారు కొత్త సినిమాలు ఎలా చేయాలో చూపిస్తున్నారు. నాగార్జునగారితో పాటు, తమన్నా, కార్తీ హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించారు. యూనిట్ కు అభినందనలు’’ అన్నారు.

భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ ‘’నేను చాలా గొప్ప సినిమాలు చూశాను. ఈ రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప చిత్రాన్ని చూసినందుకు హ్యపీగా ఉంది’’ అన్నారు.

ఎ.నాగసుశీల మాట్లాడుతూ ‘’ఎవరికైనా ఆరోగ్యం సరిలేకపోతే జాలీ చూపించకుండా, వారిని మోటివేట్ చేస్తుండాలి. నాన్నగారికి నచ్చే సినిమా. ఈ సినిమాలో నాగార్జున, కార్తీని తప్ప మెరవరినీ ఊహించుకోలేను. సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు. 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved