11 August 2016
        Hyderabad
        
          
        
        70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై తమిళ్, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ప్రభుదేవా, డైరెక్టర్ విజయ్, చిత్ర సమర్పకుడు కోన వెంకట్, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
          
        ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్, సినిమాటోగ్రఫీ: మనీష్ నందన్, ఎడిటింగ్: ఆంటోనీ, ఆర్ట్: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్.