pizza
18 Pages Trailer Launch
18 పేజస్ చిత్రం ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ - మెగా నిర్మాత అల్లు అరవింద్
You are at idlebrain.com > News > Functions
Follow Us


17 December 2022
Hyderabad

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ చేయనున్నారు.ఇందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ...
ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేశాం అండి,23న సినిమాను రిలీజ్ చేస్తున్నాం.సుకుమార్ గారు కొంచెం బిజీ వలన రాలేకపోయారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్పకుండా వస్తారు.ఈ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు.ఇప్పటి ట్రెండ్ కి సరిపోయేటట్లు మోడ్రన్ గా ఈ సినిమాను తెరకెక్కించాం.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19th న జరుపుతున్నాం. అప్పుడు మాట్లాడుకుందాం.

హీరో నిఖిల్ మాట్లాడుతూ...
ఇక్కడికి వచ్చిన అభిమానులు అందరికీ కృతజ్ఞతలు.నా కార్తికేయ సినిమాకి మంచి ప్రోమోషన్ చేశారు.అలానే ఈ సినిమాకి మీ సపోర్ట్ కావాలి. నాపై మంచి ప్రేమను చూపిస్తున్నారు థాంక్యూ.ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమాలో సరయు మంచి పాత్రను చేసింది.ఇప్పటి వరకు మీరు చూసిన సరయు వేరు,ఈ సినిమాలో మీరు చూడబోయే సరయు వేరు.ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్న అని మీకు 23న అర్థం అవుతుంది.

దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ...
ఈ పాటలను ఆదరించినందుకు చాలా థాంక్స్. ఈ కథను అరవింద్ గారికి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు.అరవింద్ గారు స్టిల్ యంగ్. అల్లు అర్జున్ గారితో మంచి అనుబంధం ఉంది నాకు.ఆర్య సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటినుండి ఆయనతో నాకు అనుబంధం ఉంది.ఆయన నా మొదటి సినిమాకి బ్లెస్ చేయడానికి వచ్చారు,ఈ సినిమాకి కూడా బ్లెస్సింగ్ ఇవ్వడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారు. నిఖిల్ చెప్పినట్లు ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ప్రేమలో పడతారు.నాకు అరవింద్ గారి స్మైల్ మంచి ఎనర్జీ ఇస్తోంది. ఈ సినిమా చేయడానికి మంచి సపోర్ట్ అందించారు. అన్నయ్య సుకుమార్ గారికి, బన్నీ వాసు అన్నయ్య కి ప్రత్యేక కృతజ్ఞతలు.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...
ఇక్కడికి వచ్చిన మీమర్స్ కి ఇన్ఫ్లుయెన్సర్స్ కి థాంక్యూ,ఈ సినిమా 23న రిలీజ్ అవుతోంది మీరే ముందుకు తీసుకెళ్లాలి. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అందరికీ బాగా నచ్చుతుంది.అందుకే తెరకెక్కించాం.ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్ బన్నీ వస్తాడు. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్యూ.

 

 


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved