pizza
Antariksham 9000 KMPH theatrical trailer launch
`అంత‌రిక్షం 9000 KMPH` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 December 2018
Hyderabad

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్,రాజా, శ్రీనివాస్ అవసరాల ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా తెర‌కెక్కుతోన్న చిత్రం `అంత‌రిక్షం 9000 KMPH`. క్రిష్ జాగ‌ర్ల‌మూడి స‌మ‌ర్ప‌ణ‌లో ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందింది. డిసెంబ‌ర్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో...

సుకుమార్ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ నిజంగా అద్భుతం. అద్భుతం అనే మాట‌ను సాధార‌ణంగా వాడేస్తుంటారు. కానీ కొన్నిసార్లే అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. తెలుగు సినిమాలు అంత‌రిక్షాన్ని అందుకునే స్థాయికి ఎద‌గ‌డం చాలా సంతోషంగా అనిపించింది. డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ తొలి సినిమా `ఘాజీ`తోనే త‌నేంటో ప్రూవ్ చేసుకున్నాడు. త‌దుప‌రి ఏ సినిమా చేస్తాడోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఆ స‌మ‌యంలో మ‌రో డిఫ‌రెంట్ స్టోరీ అంత‌రిక్షంతో మ‌న ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి స్టోరీని సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం ఎంత క‌ష్ట‌మో ద‌ర్శ‌కుడిగా నాకు తెలుసు. కెరీర్ ప్రారంభంలోనే సంక‌ల్ప్ ఇలాంటి నేప‌థ్యంలో సినిమా చేయ‌డం గొప్ప విషయం. ట్రైల‌ర్ చూడ‌గానే చాలా గొప్ప‌గా అనిపించింది. క్రిష్ ఇలాంటి సినిమాకు నిర్మాత‌గా ప్రోత్సాహాన్ని అందించ‌డం గొప్ప విష‌యం. ఇలాంటి క‌థ‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైన వ‌రుణ్‌తేజ్‌కి అభినంద‌న‌లు. సంక‌ల్ప్‌కి భ‌విష్య‌త్‌లో చాలా మంచి పేరు వ‌స్తుంది. డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను థియేట‌ర్‌లో ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో 1500 సీజీ షాట్స్ ఉన్నాయి. అంత సీజీ వ‌ర్క్ ఉన్న సినిమాను మేలో మొద‌లుపెట్టి, డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డం చాలా క‌ష్టం. నిజంగా అద్భుత‌మే ఇది. సంక‌ల్ప్ రెడ్డి డిసిప్లిన్ ఉన్న ఫిల్మ్ మేక‌ర్ అని చాలా మంది చెప్పారు. ఇదే డిసిప్లిన్ ఉంటే త‌ను బాహుబ‌లిలాంటి సినిమాలు కూడా తీస్తాడు. నా కెరీర్ నాగ‌బాబుగారి ఇంటి నుంచి మొద‌లైంది. అప్ప‌ట్లో వ‌రుణ్ స్కూల్‌కి వెళ్లి రావ‌డం చూశాన్నేను. తర్వాత ఒక రోజు స‌డ‌న్‌గా ఇంతెత్తు అయ్యాడు. ఇండ‌స్ట్రీలో చిరంజీవి, అమితాబ్ వంటి సూప‌ర్‌స్టార్ల‌ను చూస్తే వాళ్ల‌కు క‌థ‌ల ప‌ట్ల మంచి జ‌డ్జిమెంట్ ఉంటుంది. వ‌రుణ్‌కి కూడా క‌థ ప‌ట్ల మంచి జ‌డ్జిమెంట్ ఉంది. చ‌ర‌ణ్ కూడా నాతో ఇదే మాట చాలా సార్లు అన్నాడు. తొలిప్రేమ లాంటి సినిమా చేసిన త‌ర్వాత అంత‌రిక్షం చేశాడు. ఇప్పుడు ఎఫ్ 2 అంటున్నాడు. డిఫ‌రెంట్ సినిమాలు చేస్తున్నాడు. కంచె త‌ర్వాత ఈ సినిమాను నిర్మించిన రాజీవ్‌, క్రిష్ కి అభినంద‌న‌లు ``అని అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్‌లో ఓ డైలాగ్ ఉంది.. ప్ర‌య‌త్నంలో ఫెయిల్ అయితే అని... ఎలాంటి సినిమాలు తీయాల‌ని ప్ర‌య‌త్నంతో క్రిష్‌, రాజీవ్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారో.. అలాంటి సినిమాల‌ను తీస్తున్నార‌ని అనుకుంటున్నా. తెలుగు సినిమాల్లో కొత్త‌ద‌నం క‌నిపిస్తోంది. వ‌రుణ్ తేజ్ మా ఫ్యామిలీలో వ‌జ్రం. ఆగి, ఆలోచించి, సినిమాలు చేస్తాడు. మాస్ హీరో కావాల‌నో, డ‌బ్బులు ఎక్కువ సంపాదించాల‌నో కాకుండా, డిఫ‌రెంట్ యాటిట్యూడ్ ఉన్న హీరో. తొలి సినిమా నుండి విల‌క్ష‌ణ‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి ఇప్ప‌టికే మా బ్యాన‌ర్‌లో సినిమాలు చేసింది. అలాగే అదితిరావు హైద‌రి చాలా మంచి న‌టి. బేలెన్స్‌డ్ ఆర్టిస్ట్. సంక‌ల్ప్ తొలి సినిమా `ఘాజీ`తో పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను సాధిస్తాడు. ట్రైల‌ర్ చాలా బావుంది. క్రిష్‌, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు కంచె, గౌతమిపుత్ర శాత‌క‌ర్ణి వంటి సినిమాలు మంచి విజ‌యాల‌ను సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి స‌క్సెస్‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అని అన్నారు.

జాగ‌ర్ల‌మూడి క్రిష్ మాట్లాడుతూ - ``వ‌రుణ్‌లాంటి హీరోలు ఒప్పుకోక‌పోతే ఇలాంటి సినిమాలు రావు. డిఫ‌రెంట్ స్టోరీల‌ను హీరోలు ఒప్పుకోక సంక‌ల్ప్ ద‌గ్గ‌ర చాలా సినిమా క‌థ‌లు ఉండిపోయాయి. అయితే క‌థ‌పై న‌మ్మ‌కంతో ఇలాంటి మూవీ చేయ‌డానికి ఒప్పుకున్న వ‌రుణ్ తేజ్‌కి థాంక్స్‌. సంక‌ల్ప్ చాలా టాలెంటెడ్‌. ఇండ‌స్ట్రీలో చాలా పెద్ద స్థాయికి ఎదుగుతాడు. ఇలాంటి వైవిధ్య‌మైన సినిమాల‌నే మా బ్యాన‌ర్‌లో నిర్మించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం``అని అన్నారు.

సంక‌ల్ప్ మాట్లాడుతూ - ``ఘాజీకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, అంత‌క‌న్నా రెట్టింపు కాన్ఫిడెన్స్ నాలో ఉందిప్పుడు. ఘాజీకి నేను చాలా స్ట్ర‌గుల్ ఫేస్ చేశా. న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవాల‌ని అనుకున్నా. ఇప్పుడు అంత స్ట్ర‌గుల్ లేదు. న‌న్ను అంద‌రూ న‌మ్ముతున్నారు. నేష‌న‌ల్‌ అవార్డ్ వ‌చ్చిన రెండోరోజునే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్‌చేశాం. ఈ సినిమాను ఎనిమిది నెల‌ల్లోనే పూర్తి చేశాం. 1500కి పైగా గ్రాపిక్ షాట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాను ఇంత త‌ర్వ‌గా పూర్తి చేయ‌డానికి కార‌ణం మా టీం అందించిన స‌పోర్టే. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్ర‌తి మనిషికీ దేశ‌భ‌క్తి ఉంటుంది. నాక్కూడా అది ఉంది`` అని అన్నారు.

వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - ``నేను ఇప్పుడే ఈ సినిమా గురించి మాట్లాడ‌లేను. విడుద‌లైన త‌ర్వాత అంద‌రూ చెప్పాలి. సంక‌ల్ప్ సినిమాను గొప్ప స్థాయిలో తీశాడు. హీరోయిన్స్ మంచి పాత్ర‌ల్లో న‌టించారు. నాక్కూడా పాత్ర పోషించే అవ‌కాశం దొరికింది.ఈ చిత్రంలో జీరో గ్రావిటీ సీన్స్ తీయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. రోజంతా మ‌మ్మ‌ల్ని గాల్లో వేలాడ‌దీసేవారు. బ‌ల్గేరియా నుంచి వ‌చ్చిన యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ జూజూ ఆ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేశారు. స్పేస్‌లో వ‌రుణ్‌, అదితీరావు, స‌త్య‌దేవ్‌, రాజా క‌లిసి ఉన్న స‌న్నివేశాలుంటాయి `` అని అన్నారు.

అదితీరావు మాట్లాడుతూ ``తెలుగు ప్ర‌జ‌లు వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఆద‌రిస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విష‌యం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తే ఇలాంటి ప్ర‌య‌త్నాలు మ‌రిన్ని స‌త్ఫ‌లితాన్నిస్తాయి`` అని అన్నారు.

లావ‌ణ్య
మాట్లాడుతూ ``వ‌రుణ్‌తో రెండో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో లావ‌ణ్య త్రిపాఠి, రామ‌కృష్ణ‌, రాజా త‌దిత‌రులు పాల్గొన్నారు.

నటీనటులు: వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్,రాజా, శ్రీనివాస్ అవసరాల తదితరులు

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: సంకల్ప్ రెడ్డి
సమర్ప‌ణ‌ : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు : క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
డీఓపీ : జ్ఞాన శేఖర్ VS(బాబా)
సంగీతం: ప్రశాంతి విహారీ
ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా నిగొత్రే సబ్బాని


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved