pizza
Baby movie trailer launch
Baby film will be celebrated in theatres on July 14th : Director Vamsi Paidipally at trailer launch event
జూలై 14న టీం అంతా కూడా పండుగ చేసుకునేలా ఉంటుంది.. 'బేబీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వంశీ పైడిపల్లి
You are at idlebrain.com > News > Functions
Follow Us


07 July 2023
Hyderabad

Baby is the upcoming film of Anand Deverakonda. Vaishnavi Chaitanya is making her debut as the lead actress with this film. Sai Rajesh, the story writer and producer for the national award-winning film Colour Photo, is the director for this film. Producer SKN bankrolled this dilm under Mass Movie Makers. The teaser and songs are mesmerized the audience. Now today makers launched the Trailer in a grand event. On this occasion,

Director Vamsi Paidipalli said, 'I am overjoyed to watch SKN's growth. The team delivered an excellent trailer. I knew Viraj and Anand before they became artists. Vijay Deverakonda started the industry with a passion, not to become a hero, and Anand did the same. I got into the industry because to Viraj's uncles, Marthand K Venkatesh and Marthand K Shankar. Vaishnavi Chaitanya performed admirably. Maruti exudes courage whenever you see him. Bunny Vass makes anything possible in the industry. After the release of Baby, Sai Rajesh would be celebrated even more. 'On July 14, the entire team will celebrate the festival,' he stated.

SKN said, 'SKN doesn’t have caste or money, he has only good friendship. Bunny Vass, Maruti and Allu Arvind are my strength. Maruthi garu directed many blockbusters. I wanted to make a film with him. I wanted to become a producer to introduce talented people among my friends as directors. Maruthi garu now stands as my backbone. Sai Rajesh and I are fans of Chiranjeevi. Sai Rajesh is a creator and I know his power. I became a producer to make my friend a director.

Rowdy star Vijay Deverakonda stood by side all the time. He gave me a chance to film eith him Taxiwala. At that time I said that I will make Anand a hero and make a film. At the same time, Sai Rajesh narrated the story of Baby. I said that if Taxiwala becomes a hit, I will make this film. Bunny Vass also heard the story. His judgment is good. He said it was so good. Due to Corona, the film has been delayed.

He added "This story needs another hero. We took chocolate boy Viraj Ashwin. I think that Telugu girls and Telugu heroines should be in the movies I make. I saw Vaishnavi in a small scene in Ala Vaikunthapurramuloo. I liked her very much. That is why we cast Vaishnavi for this film. Thanks to Vamsi Paidipally for coming to the event. He becme successful director in Tamil too. Adidha Vamsi Paidipally. Vijay Bulganin gave his life for the songs. He did not make music its all magic. DOP Bal Reddy gave excellent visuals. I make films with my friends. That's enough for me. I did not become a producer to make money. It will take some time to be successful but be patient. If we have fire, we will succeed. The industry does not belong to anyone. Today is not my birthday, it's my baby's trailer day. Everyone watch the movie on July 14th and bless us,'' he said.

Bunny Vass said, "I saw the movie 7/G Brindavan Colony a week ago. Baby film will give that feel to this generation now. It takes guts to make a film like this. If the directors have the courage to make such films. Ee Rojullo was a cult film, now Baby is going to be cult film. Our friendship has won now. A man named Allu Arjun was standing behind us. The reason we are standing like this now is another person Vijay Devarakonda.

After the Pelli choopulu, he believed in SKN and made a film Taxiwala. Seeing the fire in him, I chose him for Geetha Govindam. He knew that Sai Rajesh could create a miracle, when he heard the story. But I was shocked by Anand's performance. Does he have this much depth? I was surprised. Our baby Vaishnavi and Viraj Ashwin acted brilliantly. Vijay Bulganin has given excellent music. Everyone who worked for the film gets a good name. This movie becomes a cult trend. Thanks to Vamsi Paidipally who came to the event and supported us.

Maruthi said, ' Premiste and 7/G Brindavan Colony kind of films can be made here in Telugu? But Sai Rajesh made such a movie after many years. It is not a common thing to make such a good movie with three characters, making us laugh and cry.. I was shocked after watching the whole movie. I can say that such a good movie has not come out in recent times. You can bravely watch this movie with your family. Anand, Vaishnavi and Viraj acted brilliantly. They will make you come out of the theatre in tears. Thanks to Sai Rajesh for giving such a good movie to our mass movie makers. My friend SKN takes good care of everyone. I wish he makes a good film like this for his birthday every year', he said.

Director Sai Rajesh said, 'Baby movie is coming on July 14. I definitely made a good movie. When Maruthi garu and Bunny Vass garu saw the first copy, they asked me Do you write this well? Is there such a depth in your writing? and Allu Aravind garu asked "Can you direct this well"? It was my friend SKN who believed in me before making the film. I can say that Baby brings respect to the producer. He noticed my talent and gave me a chance. This is a lifetime opportunity for me. With this movie, his journey will go to the next level. Thanks to Vamsi Paidipally garu for coming to this event. Everyone should watch the movie on July 14', he said.

Anand Devarakonda said, 'After watching the movie, it haunts everyone for a week. Songs and dialogues are all haunting. Everyone gave thier life and made the film. We should be proud that we found another solid writer and great director, Sai Rajesh anna. Sai Rajesh believed in my acting potential. I got emotional just watching his dialogues and writing. On July 14th we will touch everyone's hearts. Baby will make you all laugh and cry. Thanks to Vamsi Anna for coming to the event', he said.

Viraj Ashwin said 'I swa the trailer for the first time with all of you. After watching the trailer I felt like this is my movie, our movie. The writer and director of this movie has written it in a very hard hitting story. Everyone will connect with characters. I can say that for sure. Thanks to Vamsi Paidipalli garu who came to the event to bless us.'

Vaishnavi Chaitanya said, 'Thanks to Vamsi Paidipally sir and Maruti sir for coming to the event. We have just seen the trailer along with the audience. So many love stories? You may ask why we should watch this movie. You should watch it because have shown reality in Baby. We have shown what happens in everyone's life. Everyone connects to every character. Rarely actors get such characters with so much depth. Thanks to Maruti and Sai Rajesh for giving me such a good opportunity,' he said.

జూలై 14న టీం అంతా కూడా పండుగ చేసుకునేలా ఉంటుంది.. 'బేబీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వంశీ పైడిపల్లి

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎస్.కే.ఎన్ నిర్మించిన బేబీ సినిమా జూలై 14న విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. 'ఎస్‌కేఎన్ జర్నీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ట్రైలర్‌ను చూపించాడు. విరాజ్‌, ఆనంద్‌లు హీరోలవ్వాలనే ఆలోచనలేనప్పటి నుంచి నాకు తెలుసు. విజయ్ ఏదో హీరో అవ్వాలని ఆనంద్ హీరో అవ్వాలని రాలేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి తన ప్యాషన్ కోసం వచ్చాడు. విరాజ్ మామయ్య మార్తాండ్ కే వెంకటేష్, మార్తాండ్ కే శంకర్‌ల వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను. వైష్ణవీ చైతన్య అద్భుతంగా నటించారు. మారుతిని చూసినప్పుడల్లా ఓ ధైర్యం కనిపిస్తుంది. బన్నీ వాసు వల్ల ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యం అవుతుంది. బేబీ తరువాత సాయి రాజేష్‌ను ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకుంటారు. జూలై 14న టీం అంతా కూడా పండుగ చేసుకునేలా ఉంటుంది'ని అన్నారు.

ఎస్.కే.ఎన్ మాట్లాడుతూ.. 'ఎస్‌కేఎన్ దగ్గర కులం, ధనం లేదు. మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. బన్నీ వాసు, మారుతి, అల్లు అరవింద్ గారు వీళ్లే నా బలం. నేను ప్రొడ్యూసర్‌ని కాదు. మారుతి గారు చాలా బ్లాక్ బస్టర్‌లు తీశాడు. ఆయనతో ఒక సినిమాను తీయాలని అనుకున్నాను. నా ఫ్రెండ్స్‌లో టాలెంట్‌లు ఉన్న వాళ్లని డైరెక్టర్లుగా చేయాలని నిర్మాతని అవ్వాలని అనుకున్నాను. మారుతి గారు ఇప్పుడు నా వెన్నెముకలా నిల్చున్నాడు. సాయి రాజేష్‌, నేను చిరంజీవి గారి అభిమానులం. సాయి రాజేష్‌ ఓ క్రియేటర్. ఆయన సత్తా నాకు తెలుసు. నా ఫ్రెండ్‌ని దర్శకుడిగా చేయాలని నిర్మాతగా మారాను. అలాంటి సమయంలో నాకు అండగా నిలిచింది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. టాక్సీవాలా సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ టైంలోనే ఆనంద్‌ను హీరోని చేస్తానని, సినిమా తీస్తానని అన్నాను. అదే సమయంలో బేబీ కథను సాయి రాజేష్‌ చెప్పాడు. టాక్సీవాలా హిట్ అయితే ఈ సినిమాను తీస్తానని చెప్పాను. బన్నీ వాసుకి కూడా కథ వినిపించాం. ఆయన జడ్జ్ మెంట్ బాగుంటుంది. కథ విని బాగుందని అన్నారు. కరోనా వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ కథకు ఇంకో హీరో కావాలి. చాక్లెట్ బాయ్ విరాజ్ అశ్విన్‌ను తీసుకున్నాం. నేను చేసే సినిమాల్లో తెలుగు అమ్మాయిలు, తెలుగు హీరోయిన్లే ఉండాలని అనుకుంటాను. అల వైకుంఠపురములో సినిమాలో ఓ చిన్న సీన్లో చూశాను. నాకు చాలా నచ్చింది. అందుకే ఈ సినిమాకు వైష్ణవిని పెట్టుకున్నాం. ఈవెంట్‌కు వచ్చిన వంశీ పైడిపల్లికి థాంక్స్. తమిళ్‌లో జెండా పాతాడు. అది దా వంశీ పైడిపల్లి. విజయ్ బుల్గానిన్ తన ప్రాణం పెట్టి పాటలు ఇచ్చాడు. ఆయన మ్యూజిక్ చేయలేదు. మ్యాజిక్ చేశాడు. డీఓపీ బాల్ రెడ్డి గారు అద్భుతమైన విజువల్స్ అందించాడు. నా ఫ్రెండ్స్‌తోనే సినిమాలు తీస్తాను. అది నాకు చాలు. డబ్బులు సంపాదించడానికి నేను నిర్మాతను కాలేదు. నేను సక్సెస్ అయ్యానంటే.. మీ(ఆడియెన్స్) సక్సెస్. మీలో ఒక్కడిని. సక్సెస్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కానీ కాస్త ఓపిక పట్టండి. మనలో ఫైర్ ఉంటే.. సక్సెస్ అవుతాం. ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదు. ఫైర్ ఉంటే జెండా పాతేయొచ్చు. ఇది నా బర్త్ డే కాదు.. నా బేబీ ట్రైలర్ డే. అందరూ సినిమాను చూసి ఎంకరేజ్ చేయండి' అని అన్నారు.

బన్నీ వాసు మాట్లాడుతూ.. 'ఓ వారం క్రితమే సినిమాను చూశాను. 7/జీ బృందావన కాలనీ ఎలాంటి ఫీల్‌ను ఇచ్చిందో ఇప్పుడు ఈ తరానికి ఆ ఫీల్‌ను ఇస్తుంది. ఇలాంటి సినిమాను తీయాలంటే గట్స్ కావాలి. కుర్రాళ్లను థియేటర్లో అల్లాడిస్తుంది. దర్శకనిర్మాతలకు డేరింగ్ ఉంటేనే ఇలాంటి సినిమాలు తీస్తారు. ఆనాడు ఈరోజుల్లో కల్ట్, ఇప్పుడు బేబీ కల్ట్ అవుతుంది. సినిమాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి. కానీ మా ఫ్రెండ్ షిప్ ఇప్పుడు గెలిచింది. మా వెనకాల అల్లు అర్జున్ అనే వ్యక్తి నిల్చున్నాడు. మేం ఇప్పుడు ఇలా నిల్చోవడానికి కారణం మరో వ్యక్తి విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు తరువాత ఎస్‌కేఎన్ తీసుకొచ్చి టాక్సీవాలా తీశాడు. అతనిలో ఉన్న ఫైర్ చూసి నేను గీతగోవిందం తీశాను. సాయి రాజేష్ గారు ఓ అద్భుతాన్ని సృష్టించగలడని కథ విన్నప్పుడే తెలుసు. కానీ ఆనంద్ పర్ఫామెన్స్‌ చూసి షాక్ అయ్యాను. ఆయనలో అంత డెప్త్ ఉందా? అని ఆశ్చర్యపోయాను. నా అన్న హీరో అయ్యాడు కదా? అని ఆనంద్ హీరో అవ్వలేదు. అది ఈ సినిమాతో అందరికీ అర్థం అవుతుంది. మా బేబీ వైష్ణవి, విరాజ్ అశ్విన్‌లు అద్భుతంగా నటించారు. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. ఈ సినిమా ఒక కల్ట్ ట్రెండ్ అవుతుంది. ఈవెంట్‌కు వచ్చి మాకు సపోర్ట్ చేసిన వంశీ పైడిపల్లికి థాంక్స్' అని అన్నారు.

మారుతి మాట్లాడుతూ.. 'ప్రేమిస్తే, 7/జీ బృందావన కాలనీ లాంటి సినిమాలు తెలుగులో ఎవరైనా తీస్తారా? అని అనుకున్నాను. చాలా ఏళ్లకు సాయి రాజేష్ అలాంటి సినిమాను తీశాడు. మూడు పాత్రలతో ఇంత మంచి సినిమాను తీయడం, మనల్ని నవ్వించడం, ఏడ్పించడం మామూలు విషయం కాదు. ఫస్ట్ టైం ఫస్ట్ పార్ట్ చూశాను. సినిమా మొత్తం చూసిన తరువాత షాక్ అయ్యాను. ఇంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని మాత్రం చెప్పగలను. ధైర్యంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. ఆనంద్, వైష్ణవి, విరాజ్‌ అద్భుతంగా నటించారు. కన్నీళ్లతో థియేటర్లోంచి బయటకు వస్తారు. ఇంత మంచి సినిమా మా మాస్ మూవీ మేకర్స్‌కు ఇచ్చినందుకు సాయి రాజేష్‌కు థాంక్స్. నా ఫ్రెండ్ ఎస్‌కేఎన్ అందరినీ బాగా చూసుకుంటాడు. ప్రతీ ఏడాది ఇలా బర్త్ డేకు ఓ మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

డైరెక్టర్ సాయి రాజేష్‌ మాట్లాడుతూ.. 'జూలై 14న బేబీ సినిమా రాబోతోంది. కచ్చితంగా ఓ మంచి సినిమాను తీశాను. ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఇంత బాగా రాస్తావా? అని మారుతి గారు.. ఇంత డెప్త్ ఉందా?.. అని వాసు గారు అన్నారు. ఇంత బాగా తీస్తావారా? అని అల్లు అరవింద్ గారు అన్నారు. ఇలా తీయడం కూడా వచ్చా? అని వైఫ్ అడిగింది. సినిమా తీయక ముందు నన్ను నమ్మింది మాత్రం నా ఫ్రెండ్ ఎస్‌కేఎన్. పోతే మొత్తం పోతుందని తెలుసు. కానీ నన్ను నమ్మాడు. బేబీ అనేది నిర్మాతకు గౌరవాన్ని తీసుకొస్తుందని చెప్పగలను. నాలోని టాలెంట్‌ని గమనించి.. చాన్స్ ఇచ్చాడు. ఇది నాకు లైఫ్‌ టైం ఆపర్చునిటీ. ఈ సినిమాతో ఆయన జర్నీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుంది. ఈ ఈవెంట్‌కు వచ్చిన వంశీ పైడిపల్లికి థాంక్స్. జూలై 14న అందరూ సినిమాను చూడండి' అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినిమా చూసిన తరువాత అందరికీ ఓ వారం పాటు వెంటాడుతూ ఉంటుంది. పాటలు, మాటలు అన్నీ హంట్ చేస్తుంటాయి. అందరూ ప్రాణం పెట్టి సినిమాను చేశారు. ఇంకో సాలిడ్ రైటర్, గ్రేట్ డైరెక్టర్ దొరికాడని సాయి రాజేష్‌ అన్నను చూసి గర్వపడాలి. నాలోని యాక్టింగ్ పొటెన్షియల్‌ను సాయి రాజేష్‌ గారు నమ్మారు. ఆయన డైలాగ్స్, రైటింగ్‌ను చూస్తేనే ఎమోషనల్ అయ్యాను. జూలై 14న అందరి హృదయాలను కదిలిస్తాం. బేబీ మీ అందరినీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఈవెంట్‌కు వచ్చిన వంశీ అన్నకి థాంక్స్' అని అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూశాక.. ఇది నా సినిమా, మన సినిమా అనిపించింది. ఈ సినిమా రైటర్ అండ్ డైరెక్టర్ ఎంతో హార్ట్ హిట్టింగ్‌గా రాశారు. తీశారు. ప్రతీ కారెక్టర్‌కు అందరూ కనెక్ట్ అవుతారు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈవెంట్‌కు వచ్చిన వంశీ పైడిపల్లి మామకు థాంక్స్' అని అన్నారు.

వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ.. 'ఈవెంట్‌కు వచ్చిన వంశీ పైడిపల్లి సర్‌, మారుతి సర్‌లకు థాంక్స్. ఆడియెన్స్‌తో పాటుగా ఇప్పుడే మేం కూడా ట్రైలర్ చూశాం. ఇన్ని ప్రేమ కథలు వచ్చాయి కదా? మేం ఈ సినిమా ఎందుకు చూడాలని అడగొచ్చు.. బేబీ సినిమాలో రియాల్టీని చూపించాం. అందరి లైఫ్‌లో జరిగేది చూపించాం. ప్రతీ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. ఇంత డెప్త్, ఇంపార్టెంట్ ఉన్న కారెక్టర్లు చాలా తక్కువ మందికి వస్తాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మారుతి గారు, సాయి రాజేష్‌ గారికి థాంక్స్' అని అన్నారు.


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved