pizza
Bhimaa Trailer Launch
Witness The Power-packed Trailer Of Macho Star Gopichand, A Harsha, Sri Sathya Sai Arts’ Bhimaa
మాచో స్టార్ గోపీచంద్, ఎ హర్ష, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'భీమా' పవర్ ప్యాక్డ్ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


24 February 2024
Hyderabad

Macho hero Gopichand’s unique action entertainer Bhimaa is one of the most awaited movies of the season. The film is directed by A Harsha and produced lavishly by KK Radhamohan under the banner of Sri Sathya Sai Arts. From the teaser to the songs, every promo of the movie received a good response from all corners. As the release date is not far away, the makers increased the dose in promotions. Meanwhile, they unleashed the theatrical trailer of the movie.

The trailer opens by showing the spiritual side of the movie. Parasurama is the sixth avatar among the Dashavatara of the savior god Vishnu. He created a wonderful land called Parasurama Kshetram by sending back the ocean with his axe. When demons trouble the innocent with their cruelty, the Lord sends Brahma Rakshasudu to stop them. He is a ruthless cop who announces war on the demons. The trailer also introduces the other character of Gopichand.

A Harsha who is already a proven director in Kannada has come up with a larger-than-life story and he rightly included the spiritual and other layers impeccably. Gopichand has appeared in two completely diverse characters. While he looks merciless as a cop, the other avatar is much more frightening. Gopichand delivered a power-packed performance. Although the trailer showed the other characters including heroines Priya Bhavani Shankar and Malvika Sharma, the main concentration was only on Gopichand’s two characters and also to establish the core elements of the movie.

Swamy J Gowda’s cinematography is impressive, while Ravi Basrur’s background score is riveting. The dialogues are impactful. The high production values and strong technical output make this look grand all through. The trailer surely sets the ball rolling for the movie.

Ramana Vanka is the production designer and Thammiraju is the editor. Kiran is an online editor, while Ajju Mahankali provides dialogues. The movie has fights choreographed by Ram-Lakshman, Venkat, and Dr. Ravi Varma.

Bhimaa is getting ready for release on March 8th for Maha Shivaratri.

Cast: Gopichand, Priya Bhavani Shankar, Malvika Sharma

Technical Crew:
Director: A Harsha
Producer: KK Radhamohan
Banner: Sri Sathya Sai Arts
DOP: Swamy J Gowda
Music Director: Ravi Basrur
Production Designer: Ramana Vanka
Editor: Thammiraju
Online Editor: Kiran
Dialogues: Ajju Mahankali
Fights: Ram-Lakshman, Venkat, and Dr Ravi Varma

 

మాచో స్టార్ గోపీచంద్, ఎ హర్ష, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'భీమా' పవర్ ప్యాక్డ్ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్

మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా ఈ సీజన్‌లో చాలా మంది ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోకు అన్ని వైపులా నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో డోస్ పెంచారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్ గా చేశారు.

సినిమాలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూపిస్తూ ట్రైలర్‌ అద్భుతంగా ఓపెన్ అవుతుంది.శ్రీమహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు. ట్రైలర్‌లో గోపీచంద్‌లోని మరో పాత్రను కూడా చాలా అద్భుతంగా పరిచయం చేశారు.

కన్నడలో స్టార్ దర్శకుడైన హర్ష లార్జర్ దెన్ లైఫ్ కథతో ముందుకు వచ్చాడు, ఆధ్యాత్మిక, ఇతర లేయర్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో మెస్మరైజ్ చేశారు. అతను కనికరం లేని పోలీసుగా కనిపిస్తుండగా, మరో అవతార్ చాలా టెర్రిఫిక్ గా ఉంది. గోపీచంద్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునంరు. ట్రైలర్‌లో కథానాయికలు ప్రియా భవానీ శంకర్ , మాళవిక శర్మతో సహా ఇతర పాత్రలను చూపించినప్పటికీ, ప్రధాన దృష్టి గోపీచంద్ యొక్క రెండు పాత్రలపై ఉంది. సినిమా ప్రధాన అంశాలను చాలా ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లెస్ చేసారు.

స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. డైలాగ్స్ ఎఫెక్టివ్ గా వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, స్ట్రాంగ్ టెక్నికల్ అవుట్‌పుట్ తో ట్రైలర్ చాలా గ్రాండ్‌గా వుంది. ట్రైలర్ ఖచ్చితంగా సినిమా అంచనాలని మరింతగా పెంచింది. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు 'భీమా' చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాచో స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ.. అభిమానులతో కలసి ట్రైలర్ చూడటం చాలా అనందంగా వుంది. నేను ప్రేక్షకులతో పాటే ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. దర్శకుడు హర్ష కథ చేప్పినప్పుడు ఎంత బాగా చెప్పాడో అంత బాగా తీశాడు. ఎక్స్ ట్రార్డినరీగా కథని తెరపైకి తీసుకొచ్చాడు. హర్ష కన్నడలో చాలా మంచి దర్శకుడు. ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమా మెటిరిలైజ్ అవ్వడానికి శ్రీధర్ గారు కారణం. మంచి కథని, దర్శకుడిని నాకు పరిచయం ఆయనకి థాంక్స్. ఈ కథని ఇంత అద్భుతంగా రూపొందించడానికి కారణం నిర్మాత రాధమోహన్ గారు. ఆర్ట్ డైరెక్టర్ చాలా అద్భుతమైన సెట్స్ వేశారు. స్వామి ఎక్స్ ట్రార్డినరీ గా కెమరా వర్క్ చేశారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. సినిమా అంతా నెక్స్ట్ లెవల్ లో తీశాడు. హీరోయిన్స్ ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ చాలా చక్కగా నటించారు, వారి పాత్రలు కీలకంగా వుంటాయి. నరేష్ గారితో చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను. మా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా వచ్చాయి. రఘు బాబు అన్నయ్యతో చాలా సినిమాలు చేశాను. ఇందులో కూడా మా మధ్య సీన్స్ అలరిస్తాయి. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. భీమా మార్చి 8న మహా శివరాత్రి రోజున విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. చాలా మంచి సినిమా ఇది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు' అన్నారు.

దర్శకుడు ఎ హర్ష మాట్లాడుతూ.. గోపీచంద్ గారు వండర్ ఫుల్ పర్సన్. వెరీ స్వీట్ హార్ట్. నిర్మాత కె కె రాధామోహన్ గారు, సహా నిర్మాత శ్రీధర్ గారు చాలా సపోర్ట్ చేశారు. స్వామి జె గౌడ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. రవి బస్రూర్ మ్యూజిక్ తో అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. గోపీచంద్ గారిని ప్రేక్షకులు చాలా డిఫరెంట్ గా చూడబోతున్నారు. యాక్షన్ తో పాటు కామెడీ ఎంటర్ టైన్మెంట్ చాలా గొప్పగా వుంటుంది. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ చాలా చక్కగా నటించారు. సినిమా కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మార్చి 8న అందరూ థియేటర్స్ లో భీమా చూడాలి' అని కోరారు.

హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ.. మీ అందరిప్రేమకు ధన్యవాదాలు, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు. గోపిచంద్ గారికితో పని చేయడం చాలా అనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి' అని కోరారు.

హీరోయిన్ మాళవిక శర్మ మాట్లాడుతూ..గోపీచంద్ గారితో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమాలో ఎంపిక చేసిన దర్శకుడు హర్ష గారికి, నిర్మాత మోహన్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వుంటుంది. అందరూ థియేటర్స్ లో చూడాలి' అని కోరారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన గోపీచంద్ గారికి, హర్ష గారికి కృతజ్ఞతలు. కేజీఫ్ సలార్ లాంటి సినిమాలు చేసిన సంగీత దర్శకుడు రవి బసృర్ గారు మా సినిమా చేయడం ఆనందంగా వుంది. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మహా శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను.

నటుడు డా. నరేష్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ చుసిన తర్వాత మాటలు రాలేదు అంత అద్భుతంగా వుంది. భీమా ఆల్ రౌండర్ ఎంటర్ టైనర్. హీరో గోపీచంద్ గారికి, టీం అందరికీ అభినందనలు. ఈ సినిమాలో కొత్త గోపీచంద్ ని చూస్తారు. మహా శివరాత్రి జాగారంలో భీమా అద్భుతమైన ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది' అన్నారు. రఘుబాబు, సప్తగిరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె గౌడ
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
ఎడిటర్: తమ్మిరాజు
ఆన్‌లైన్ ఎడిటర్: కిరణ్
డైలాగ్స్: అజ్జు మహంకాళి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ

 

Photo Gallery

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved