pizza
Bluff Master trailer launch
`బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 December 2018
Hyderabad

శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్న చిత్రం `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌`. అభిషేక్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. స‌త్య‌దేవ్‌, నందితా శ్వేత‌, ఆదిత్య మీన‌న్‌, బ్ర‌హ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, టెంప‌ర్ వంశీ, దిల్ ర‌మేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి. బి.ఎఫ్‌.ఎ ద‌ర్శ‌కుడు. ర‌మేష్.పి.పిళ్లై నిర్మాత‌. ఈ చిత్రం ట్రైల‌ర్‌ను శ‌నివారం హైదరాబాద్‌లో విడుద‌ల చేశారు. ముంబై నుంచి లింక్‌ను రానా విడుద‌ల చేశారు.

శివ‌లెంక మాట్ల‌డుతూ ``సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ వ‌చ్చింది. డిసెంబ‌ర్ 28న సినిమాను విడుద‌ల చేస్తాం. చాలా హార్డ్ వ‌ర్క్ చేశాం. సెన్సార్ స‌ర్టిఫికెట్ కూడా వ‌చ్చేసింది. సెన్సార్ స‌భ్యులు చాలా మెచ్చుకున్నారు. ప్ర‌స్తుత స‌మాజానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న సినిమా. సొసైటీలో బ్ల‌ఫ్ మాస్ట‌ర్లు చాలా ఉంది ఉన్నారు. వారి వ‌ల్ల ప‌లువురు మోస‌పోతున్నారు. ఆ విష‌యాల‌తో ద‌ర్శ‌కుడు బాగా తీశారు. ఈ సినిమా త‌ర్వాత అత‌నికి మంచి ఆఫ‌ర్లు వ‌స్తాయి. హీరో కూడా చాలా బాగా చేశారు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం నెక్స్ట్ లెవ‌ల్లో ఉంది. ఇంత వ‌ర్స‌టైల్ ఉన్న ఆర్టిస్ట్ ని తొలి సారి చూశాను. ప్ర‌జ‌ల్లో అవేర్ నెస్ తెచ్చే సినిమా ఇది. పుల‌గం చిన్నారాయ‌ణతో నాకు 20 ఏళ్ల ప‌రిచ‌యం ఉంది. ఆయ‌న ఈ చిత్రంలో మంచి డైలాగులు రాశారు`` అని అన్నారు.

ద‌ర్శకుడు మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. సెన్సార్ బోర్డ్ స‌భ్యులు చాలా అప్రిషియేట్ చేశారు. 20 నిమిషాల సినిమా పృథ్వి భుజాల మీద తీసుకెళ్లారు. చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. హిల్ స్టేష‌న్స్ లో ఎన్నిసార్లు ఎక్క‌మ‌న్నా ఎక్క‌డా విసుక్కోకుండా చేశారు. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ వింటే రెహ‌మాన్ సంగీతం చేశారా అని అనిపించింది. చైతూ, స‌త్య బాగా చేశారు. పుల‌గం చిన్నారాయ‌ణ‌ రాసిన డైలాగులు ఆక‌ట్టుకుంటాయి`` అని చెప్పారు.

హీరో మాట్లాడుతూ ``మోస‌పోయే వాళ్లు చాలా మందే ఉంటారు. నేను కూడా ఒకప్పుడు మోస‌పోయాను. ఓ కంపెనీలో 20 మందిని జాయిన్ చేయించాను. వాళ్లు మోస‌పోయారు. చేర్పించినందుకు ఆ 20 మంది న‌న్ను ప‌ట్టుకుని అడిగారు. దీన్ని దో నెంబ‌ర్ బిజినెస్ అని అంటారట‌. మిడిల్ క్లాస్ వాళ్ల‌ను టార్గెట్ చేసి, ట్రాప్ చేస్తారు ఈ బిజినెస్‌లో. అలాంటి కేర‌క్ట‌ర్‌ను నేను `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌`లో చేశాను. ద‌ర్శ‌కుడు చాలా బాగా తీశారు. శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌గారు చాలా పెద్ద నిర్మాత‌. నాలాంటి వాడిని ఎంక‌రేజ్ చేసి, అవ‌కాశాలు ఇవ్వ‌డం చాలా హ్యాపీ. నాతోపాటు చేసిన చైతూ చాలా గొప్ప న‌టుడు. గొప్ప న‌టుడ‌ని నేను చెప్ప‌డం కాదు. ప్రూవ్ అయిన న‌టుడు`` అని అన్నారు.

సునీల్ క‌శ్య‌ప్ మాట్లాడుతూ ``నేను సినిమా గురించి ఎక్కువ చెప్ప‌ద‌ల‌చుకోలేదు. సినిమా చూసి ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా మాట్లాడ‌తారు. అంద‌రూ ఇష్టంతో క‌ష్ట‌ప‌డ్డారు`` అని చెప్పారు.
ఈ చిత్రానికి క‌థ‌: హెచ్‌. వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్: పుల‌గం చిన్నారాయణ‌, పాట‌లు: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, మ‌ధుర‌క‌వి కోగంటి వెంక‌టాచార్యులు, విశ్వ‌నాథ్ కార‌సాల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఎం.కృష్ణ‌కుమార్ (కిట్టు), ఆర్ట్: బ‌్ర‌హ్మ క‌డ‌లి, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, సినిమాటోగ్ర‌ఫీ: దాశ‌ర‌థి శివేంద్ర‌, సంగీతం: సునీల్ కాశ్య‌ప్‌, నిర్మాత‌: ర‌మేష్‌, పి.పిళ్లై, మాట‌లు- ద‌ర్శ‌క‌త్వం: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి బి.ఎఫ్‌.ఎ.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved