6 April 2017
Hyderabad
శ్రీ సాయి ఊహా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `ఖయ్యూం భాయ్`. పత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో తెరకెక్కుతోంది. కట్టా శారద చౌదరి నిర్మాత. నయీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నందమూరి తారకరత్న ఇందులో ఏసీపీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. కట్టారాంబాబు, నందమూరి తారకరత్న, ప్రియ, హర్షిత, చలపతిరావు, సుమన్, జీవా, బెనర్జి, చిన్నా, ఎల్బీ శ్రీరామ్, రామ్‌జగన్, జూ.రేలంగి, శేషు బాహుబలి సోఫియా, పల్నాడు శీను, కాకమాను శ్రీనివాస్, ఎస్వీఆర్ రాంబాబు, మాధవి కీలక పాత్రధారులు. గురువారం హైదరాబాద్ లో జరిగిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు సాగర్, కృష్ణంరాజు సతీమణి శ్యామల, గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ నాగభూషణం సంయుక్తంగా టీజర్‌ను ఆవిష్కరించారు.
సాగర్ మాట్లాడుతూ ``కట్టా రాంబాబుగారికి మంచి పేరు, డబ్బులు రావాలి`` అని అన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ ``సినిమా మీద మొదటి నుంచీ మాకు మంచి అభిప్రాయం ఉంది. భరత్ చాలా మంచి టెక్నీషియన్. దురదృష్టవశాత్తు అతను చాలా ఎత్తుకు ఎదగలేదు. ఈ సినిమా చాలా బాగా తీశాడు. రాంబాబుగారిని చూస్తుంటే నయీమ్‌ని చూస్తున్నట్టే ఉంది. సినిమా తప్పుండా హిట్ అవుతుంది. టీజర్‌లో ఉన్నవన్నీ సినిమాలోనూ ఉంటాయి`` అని చెప్పారు.
శ్యామల మాట్లాడుతూ ``టీజర్ బావుంది. భరత్‌కి తప్పకుండా హిట్ అవుతుంది. రాంబాబుగారు అచ్చం నయీమ్‌గారిలాగానే ఉన్నారు. కృష్ణంరాజుగారు ఢిల్లీ వెళ్లారని నేను ఈ కార్యక్రమానికి వచ్చాను`` అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ``రియల్ ఇన్సిడెంట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. సపోర్ట్ చేసినవారందరికీ ధన్యవాదాలు`` అని చెప్పారు.
వీరశంకర్ మాట్లాడుతూ ``కీరవాణి దర్శకుల గురించి ట్వీట్లు చేశాక ఎవరు ఎవరిని పొగుడుతున్నారో, తిడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. మంచి సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అని చెప్పారు.
నాగభూషణం మాట్లాడుతూ ``విలన్‌ని హీరోగా చూపించి తెరకెక్కించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇలాంటి చిత్రాలు చేయడం కత్తిమీద సాము. చిన్న సినిమాలకు ప్రాముఖ్యతనివ్వాలి`` అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ``మే రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కట్టా రాంబాబుగారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. యాక్షన్ బేస్డ్ సినిమా ఇది. వారికి లాభాలు గోనె సంచుల్లో రావాలని ఆకాంక్షిస్తున్నాను`` అని అన్నారు.
రాంబాబు మాట్లాడుతూ ``కథ వినగానే నచ్చి చేశాను. ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదు. పెట్టాల్సిన దగ్గర డబ్బు బాగానే పెట్టాం`` అని చెప్పారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``చాలా మంచి సినిమా అవుతుంది. వర్మ మూడు పార్టుల్లో తీస్తానన్నారు. అంతకు ముందే వీళ్లు ఈ సినిమాను తీసేశారు`` అని చెప్పారు.
బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ ``భరత్ చాలా మంచి టెక్నీషియన్. అయినా ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు. ఇప్పుడు ఈ సినిమా చక్కటి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది. కట్టా రాంబాబు అచ్చం నయీమ్‌లాగానే ఉన్నాడు`` అని అన్నారు.
ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: గౌతంరాజు, కెమెరా: శ్రీధర్ నార్ల, మాటలు: భవాని ప్రసాద్, ఫైట్స్: విజయ్, ఆర్ట్: పీవీరాజు.