pizza
Manmadhudu 2 trailer launch
'మన్మథుడు 2' ట్రైలర్‌ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


25 July 2019
Hyderabad

కింగ్‌నాగార్జున హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌ అజిత్‌్‌, డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌, కింగ్‌ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ మాట్లాడుతూ - ''ఈ ఏడాది హిందీలో పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ఓ తెలుగు సినిమా. త్వరలోనే హిందీలో మరో తెలుగు సినిమా కూడా పెద్ద మూవీగా నిలవబోతుంది. ఇక్కడే ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక్కడ స్టార్స్‌ను ఎక్కువ ప్యాషన్‌తో ప్రేమిస్తారు. అందుకనే హాలీవుడ్‌ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరున్న వయాకామ్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. మన్మథుడు 2 కామెడీ ఎంటర్‌టైనర్‌. నాకు అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ బంధాన్ని భవిష్యత్‌లో కొనసాగించాలనుకుంటున్నాను. టైమ్‌లెస్‌ హీరో కింగ్‌ నాగార్జునగారితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను'' అన్నారు.

డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ - ''మన్మథుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంత ప్రేమించారో నాకు తెలుసు. ఇప్పుడు అదే రకమైన సపోర్ట్‌ను ఎదురుచూస్తున్నాను. సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అయ్యిందో తెలియదు లేదు. త్వరగా పూర్తయ్యింది. ఈ సినిమాకు మన్మథుడు కరెక్ట్‌ టైటిల్‌. నాగ్‌సారే చేస్తున్నారు కాబట్టి. మన్మథుడు 2 అని పెట్టాం. మూడు తరాలుగా పోర్చుగల్‌లో సెటిలైన తెలుగు ఫ్యామిలీ కథ ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఎంజాయ్‌ చేసేలా సినిమా క్లాస్‌గా ఉంటుంది. సమంతగారి చిన్న అతిథి పాత్రలో నటించారు. ఆ పాత్రలో ఆమెను ఎందుకు నటింప చేశాననేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ముందే టైటిల్‌ ఫిక్స్‌ అయ్యింది. ఫస్ట్‌ కాపీని చూశాం. అందరం ఎంజాయ్‌ చేశాం. రేపు ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''వయాకామ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ అసోసియేట్‌ కావడం ఇదే తొలిసారి. ఏ ప్రాబ్లెమ్‌ లేకుండా సినిమా చాలా చక్కగా పూర్తయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ అందరూ హ్యాపీగా ఉండాలనే ప్లాన్‌తోనే ఈ సినిమా ముందు నుండి ప్లాన్‌ చేసుకుంటూ వస్తున్నాం. ప్రొడక్షన్‌ కాస్ట్‌, సేల్‌ రేట్స్‌ అన్ని అందరూ హ్యాపీగా ఫీలయ్యేలానే ప్లాన్‌ చేశాం. త్వరలోనే మన్మథుడు జర్నీ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలనుకుంటున్నాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. మన్మథుడు వచ్చి 15 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మన్మథుడు 2 వచ్చింది. ఏది ఎక్కువగా ఎంజాయ్‌ చేశానంటే చెప్పలేను. విజయ్‌భాస్కర్‌గారితో చేసిన మన్మథుడు చాలా ఈజీగా, సాఫీగా ఎలా సాగిందో.. ఈ సినిమాకు కూడా అంతే ఎంజాయ్‌ చేశాం. ఆ సినిమాకు ఇది ఈక్వెల్‌గా ఉంటుందనే నా ధీమా. సమంతతో పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. తనతో ఇప్పటికే మనం, రాజుగారిగది 2 సినిమాలు చేశాను. తను కోడలైన తర్వాత మరింత కేర్‌ తీసుకుంటున్నాను. మన్మథుడు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించలేదు. ఆ క్యారెక్టర్స్‌కు, కథకు ఎక్కడా సంబంధం లేదు. అయితే జోనర్‌ మాత్రం రొమాంటిక్‌ కామెడీ. 'ఊపిరి' సినిమాను 'అన్‌టచ్‌బుల్స్‌' అనే సినిమాను బేస్‌ చేసుకుని, రైట్స్‌ కొనుక్కుని రీమేక్‌ చేశాం. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే.. కేవా మూవీస్‌ నుండి గీత ఏడాదిన్నర క్రితం ఓ ఫ్రెంచ్‌ మూవీను తీసుకొచ్చి మీరు చేస్తే బావుంటుందని చెప్పింది. ఆ సినిమా నేను చూశాను. బాగా నచ్చడంతో ఆ సినిమా హక్కులను కొని దానిపై ఏదాడి పాటు వర్క్‌ చేసి సినిమా చేశాం. తప్పకుండా సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved