19 February 2024
Hyderabad
Salman Khan, Ram Charan Launched The Gripping Trailer Of the Biggest Aerial War Drama Operation Valentine Starring Varun Tej
There was huge anticipation for the theatrical trailer of Mega Prince Varun Tej’s biggest aerial war drama Operation Valentine with the teaser and other promotional material impressing the audience big time. Salman Khan and Ram Charan have unveiled the trailer of the movie in Hindi and Telugu languages respectively.
Arjun Dev (Varun Tej) who is an IAF officer has nightmares because of an incident in the past. But that doesn’t change his attitude and approach. He is stubborn, fearless, and an adventure lover who is in love with Radar Officer Sonal (Manushi Chhillar). In the meantime, the Pulwama Attack kills 42 CRPF Jawans. The Indian Airforce which never faced a defeat earlier announced the aerial strike on enemies. Arjun who leads the team is in danger when a grenade hits his fighter jet. However, Radar Officer Sonal is there to guide him.
Varun Tej excels as a courageous squadron leader and he delivers in both the action and emotional scenes. Watching Varun in uniform offers an eye-feast. His chemistry with Manushi worked well.
A tribute to the relentless and undying courage of the Indian Air Force (IAF), Operation Valentine stays committed to its sole purpose, presenting a visually stunning experience and offering goosebumps with intensity in action and authenticity in emotions.
The plot is intriguing and lets you feel awestruck all through. It offers a fine mix of action, emotion, patriotism, music, and a bit of romance too. Dialogues are so impactful. The gripping screenplay keeps the viewers on the edge of their seats as they watch that spectacular air combat.
Debutant Shakti Pratap Singh Hada wins brownie points for his commendable writing and brilliant taking. Hari K Vedantam’s cinematography makes this one a visual treat and a stunning extravaganza. Mickey J Meyer has rightly complemented the visuals with his excellent background score. The film is produced by Sony Pictures and Sandeep Mudda, with co-production by God Bless Entertainment and Nandkumar Abbineni, and the production design is top-notch.
The expectations have reached sky-high with the trailer. The Telugu-Hindi bilingual will grace the cinemas on March 1st.
'ఆపరేషన్ వాలెంటైన్' గూస్ బంప్స్ మూమెంట్స్ తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ పంచుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్ టీజర్, ఇతర ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో థియేట్రికల్ ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్, రామ్‌చరణ్ లాంచ్ చేశారు.
IAF అధికారి అయిన అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్)కి గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పీడకలలు వస్తుంటాయి. కానీ అది అతని వైఖరి, విధానాన్ని మార్చలేదు. అతను మొండి పట్టుదలగలవాడు. రాడార్ ఆఫీసర్ సోనాల్ (మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉన్న అడ్వంచర్ లవర్. మరోవైపు పుల్వామా దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణిస్తారు. ఇంతకుముందు ఓటమిని ఎదుర్కోని భారత వైమానిక దళం శత్రువులపై వైమానిక దాడిని ప్రకటిస్తుంది. టీంకు నాయకత్వం వహిస్తున్న అర్జున్ తన యుద్ధ విమానానికి గ్రెనేడ్ తగలడంతో ప్రమాదంలో పడతాడు. అయితే, అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడార్ ఆఫీసర్ సోనాల్ వుంటుంది. వరుణ్ తేజ్ అడ్వంచరస్ స్క్వాడ్రన్ లీడర్‌గా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ అదరగొట్టారు. యూనిఫాంలో వరుణుడిని చూడటం కన్నుల పండువగా వుంది. మానుషితో కెమిస్ట్రీ బాగా కుదిరింది.
భారత వైమానిక దళం (IAF) ధైర్యానికి నివాళిగా, ఆపరేషన్ వాలెంటైన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్, భావోద్వేగాలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. కథాంశం అద్భుతంగా వుంది. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి, సంగీతం తో పాటు కొంచెం రోమాన్స్ కూడిన ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. డైలాగ్స్ ఇంపాక్ట్ ఫుల్ గా వున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులని ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్ ని పంచుతోంది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా అద్భుతమైన టేకింగ్ ఆకట్టుకున్నాడు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్ లా వుంది. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్టిపడేశారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సందీప్ ముద్దా నిర్మించారు, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ నందకుమార్ అబ్బినేని సహ-నిర్మాత, ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ గా వుంది. ట్రైలర్‌తో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం మార్చి 1న గ్రాండ్ గా విడుదల కానుంది.
గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మన దేశంలో సినిమా అనేది బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరు ముందు సినిమా వైపు వెళ్తారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుని టికెట్ రూపంలో మాకు ఇస్తారు. ప్రేక్షకులు ఖర్చుపెట్టే డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి కష్టపడుతుంటాను. ప్రేక్షకులకు కొత్త కథ చూపించాలనే ప్యాషన్ నాకు, మా టీంకు వుంది. అందుకే 'ఆపరేషన్ వాలెంటైన్'లాంటి సినిమాని తీయగాలిగాం. తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ అఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే చాలా సీన్స్ ఇందులో వున్నాయి. మార్చి 1న ఈ సినిమాని చాలా గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్ కి సెల్యూట్ కొడతారు ప్రేక్షకులు. మన జవాన్స్ త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని మీముందుకు తీసుకురావడాని చేస్తున్న ప్రయత్నం ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరికీ దేశభక్తి లోపల వుంటుంది. ఈ సినిమా చూశాక అది మరింత పెరుగుతుందని నమ్మకంగా చెబుతున్నాం. మార్చి 1న థియేటర్స్ లో కలుద్దాం. జై హింద్’’ అన్నారు.
హీరోయిన్ మానుషి చిల్లర్ మాట్లాడుతూ.. 'ఆపరేషన్ వాలెంటైన్' చాలా స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. వరుణ్ తేజ్ వండర్ ఫుల్ కో స్టార్. చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఇది నాకు డ్రీం రోల్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సినిమా చేసిన ఘనత వరుణ్ తేజ్ కి దక్కుతుంది. 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ లో విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. మార్చి 1న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కి, నిర్మాతలకు కృతజ్ఞతలు. వారి వలనే ఈ సినిమా సాధ్యపడింది. ఈ సినిమా సమిష్టి కృషి. టీం అందరం సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. యాక్షన్ డ్రామా ఫన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. మార్చి 1 సినిమాని ఎంజాయ్ చేయండి’ అని కోరారు.