pizza
Ram Leela Teaser launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

03 February 2015
Hyderabad

రామ్ లీల టీజర్ విడుదల

కొనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై హవీష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం రామ్ లీల. శ్రీపురం కిరణ్ దర్శకుడు. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. కె.రాఘవేంద్రరావు టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

లంకాలబుచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘’రాఘవేంద్రరావుగారు టీజర్ ను విడుదల చేయడం హ్యపీగా ఉంది. శ్రీపురం కిరణ్ సినిమాని చక్కగా డైరెక్ట్ చేశాడు. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా, ఫ్రెష్ గా ఉంటుంది’’ అన్నారు.

దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ‘’గతంలో నిర్మించిన జీనియస్ చిత్రం కంటే రామ్ లీల చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా కథకి తగిన విధంగా ఆర్టిస్టులను ఎంపిక చేసుకున్నాం. శ్రీపురం కిరణ్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నెల 7న ఆడియో ఆవిష్కరణకి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

డైరెక్టర్ శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ ‘’రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో డైరెక్టర్ గా మారాను. ఎస్.గోపాల్ రెడ్డి వంటి సీనియర్ ఫోటోగ్రాఫర్ తో పనిచేయడం అదృష్టం. ఈ సినిమాకి ఆయన నన్ను బాగా గైడ్ చేశారు. ఈ సినిమాతో దాసరి కిరణ్ కుమార్ గారు నన్ను డైరెక్టర్ గా మార్చారు అందుకు ఆయనకి థాంక్స్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‘’ అన్నారు.

ముత్యాల రమేష్ మాట్లాడుతూ ‘’టీజర్ చాలా బావుంది. హవీష్ కి ఈ సినిమా పెద్ద పేరు తీసుకొస్తుంది’’ అన్నారు.

 ఈ కార్యక్రమంలో ఇంకా ఎస్.గోపాల్ రెడ్డి, రచయిత విస్సు తదితరులు పాల్గొన్నారు.

హవీష్, అభిజీత్, అక్ష, నందిత, అలీ, మదాలసశర్మ, భానుచందర్, సప్తగిరి, నాగినీడు, శివన్నారాయణ, కృష్ణుడు, అనితా చౌదరి, గుండు సుదర్శన్, ఇంద్ర తదితరలు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: విస్సు, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: చిన్నా, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, సహ నిర్మాత: ముత్యాల రమేష్, నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ , కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: శ్రీపురం కిరణ్

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved