ఉపేంద్ర హీరోగాశ్రీతారక పిక్చర్స్ బ్యానర్ పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో విజయ్.ఎమ్, గుర్రం మహేష్ చౌదరి నిర్మాతలుగా కన్నడ చిత్రం శివంను తెలుగులో బ్రాహ్మణ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. సలోని, ఉపేంద్ర హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ...
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ``కన్నడంలో శివం పేరుతో విడుదలై అక్కడ మంచి విజయాన్ని సాధించిన చిత్రమిది. తెలుగులో కూడా ఉపేంద్రగారికి మంచి మార్కెట్ ఉంది. జూలై మొదటివారంలో సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నాం. చిన్న సినిమాలను మంచి రిలీజ్ డేట్ చూసుకుని విడుదల చేసుకుంటే బావుంటుంది. మా బ్యానర్‌పై 150-170 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయాలని మాట్లాడటం జరిగింది. తెలుగులో మరింత పెద్ద హిట్ సాదించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ``దండు పాళ్యం శ్రీనివాసరాజుగారి దర్శకత్వంలో కన్నడంలో విడుదలైన శివం సినిమా అక్కడ పెద్ద హిట్ అయ్యింది. నేను కూడా ఆ సినిమాను చూశాను. చాలా బావుంది. రామసత్యనారాయణగారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు వచ్చినందుకు థాంక్స్. అలాగే ఈ చిత్ర నిర్మాతలు విజయ్, మహేష్‌లు నా మిత్రులు ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
హీరో తరుణ్ మాట్లాడుతూ ``ఉపేంద్రగారి సినిమాలు మాసివ్‌గా ఉంటూనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్ర నిర్మాతలు మాకు మంచి మిత్రులు. దర్శకుడు శ్రీనివాసరాజుగారు డైరెక్ట్ చేసిన దండుపాళ్యం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే దాని కంటే ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ యూనిట్ ను అభినందిస్తున్నాను`` అన్నారు.
దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ``కన్నడంలో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది`` అన్నారు.
నిర్మాతలు విజయ్.ఎమ్, గుర్రం మహేష్ చౌదరి మాట్లాడుతూ ``ఉపేంద్రగారి సినిమాలు గతంలో తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాయి. శివం పేరుతో శ్రీనివాసరాజుగారు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ మంచి హిట్ సాధించింది. ఇప్పుడు తెలుగులో బ్రాహ్మణ పేరుతో విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు కూడా మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః వెంకటప్రసాద్, ఎడిటర్ః వినోద్ మనోహర్, సంగీతంః మణిశర్మ, సహనిర్మాతః గుంటూరు కేశవుల నాయుడు, సమర్పణః సి.ఆర్.మనోహర్, నిర్మాతలుః విజయ్.ఎమ్, గుర్రం మహేష్ చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః శ్రీనివాస్ రాజు