pizza
Guppedantha Prema trailer launch
‘గుప్పెడంత ప్రేమ’ ట్రైలర్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

09 March 2016
Hyderabad

ది ఐ వింక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయిరోనాక్, ఆదితి సింగ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. వినోద్ లింగాల దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. మధురశ్రీధర్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

మధుర శ్రీధర్ మాట్లాడుతూ ‘’ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రానికి వినోద్ నా డైరెక్షన్ టీంలో అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. గతంలో నా టీంలో వర్క్ చేసినవారు అందరూ మంచి పోజిషన్స్ లో ఉన్నారు. వినోద్ మంచి హార్డ్ వర్కర్, మంచి క్రియేటివ్ పర్సన్. చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా చెప్పగలడు. సినిమా ట్రైలర్ చూస్తుంటే హానెస్ట్ చేశాడనిపిస్తుంది. వండర్ ఫుల్ మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం’’ అన్నారు.

కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ‘’ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రంలో నేను పనిచేసేటప్పుడు వినోద్ పరిచయం ఉంది. మంచి టాలెంట్ ఉన్న నటుడు. హీరో, హీరోయిన్ పెయిర్ బావుంది. ట్రైలర్ బావుంది. నవనీత్ సుందర్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఎంటర్ టైన్మెంట్ ఉన్న మంచి లవ్ స్టోరీ’’ అన్నారు.

Aditi Singh Glam gallery from the event

దర్శకుడు వినోద్ మాట్లాడుతూ ‘’ఇది స్వచ్చమైన ప్రేమకథ. మన గుండె పిడికిలంత ఉంటుంది. ఆ గుండెలో ఉన్న ప్రేమ ఏమైనా చేస్తుంది. ఆ ప్రేమ కోసం మనిషి ఏమైనా చేస్తాడని చెప్పే ప్రయత్నం. నార్త్ ఈస్ట్ బ్యాక్ డ్రాప్ లో మేఘాలయా,చిరపుంజి పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను చేశాం. మంచి మ్యూజిక్ కుదిరింది’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్ సుందర్ మాట్లాడుతూ ‘’హానెస్ట్ మూవీ, నార్మల్ లవ్ స్టోరీ కాదు. సినిమాలో ఎనిమిది పాటలుంటాయి. అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సాయిరోనక్, అదితి సింగ్, నోయల్ తదితరులు పాల్గొన్నారు.

ఐశ్వర్య, ఆనంద్, నోయల్, నవీన్ నేని, ప్రతీక్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సాహిత్యం: వనమాలి, శ్రీమణి, గణేష్ సాలాది, టిల్లు పశునూరి, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్: బసవ పైడిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్; సంగీతం: నవనీత్ సుందర్, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పావని లింగాల, నిర్మాత: ఐ వింక్ ప్రొడక్షన్స్, దర్శకత్వం: వినోద్ లింగాల.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved