అరుణ్ అదిత్, పూజ ఝవేరి జంటగా రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `ఎల్7`. ముకుంద్ పాండే దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సినిమా లోగోను విజయ్ కుమార్ కొండా ఆవిష్కరించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను గొట్టిముక్కల పద్మారావు, డి.ఎస్.రావు విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో....
గొట్టిముక్కల పద్మారావు మాట్లాడుతూ ``థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. బోజ్‌పురి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన అక్కడి పెద్ద ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి వర్షం సాక్షిగా సినిమా తర్వాత తెలుగులో చేస్తున్న రెండో చిత్రం. దర్శకుడు ముకేష్ మంచి టాలెంటెడ్. మనం, ఇష్క్ వంటి చిత్రాలకు కథా సహాకారం అందించాడు. ఇప్పుడు ఈ చిత్రంతో దర్శకుడవుతున్నాడు. తనకు, నిర్మాతకు, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్‌కు మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది`` అన్నారు.
విజయ్‌కుమార్ కొండ మాట్లాడుతూ ``దర్శకుడు ముకుంద్ పాండే పాండేతో మంచి పరిచయం ఉంది. లవ్‌లోని ఏడు వెర్షన్స్‌ను ఈ సినిమాలో చూపిస్తున్నాడు. సినిమా కచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తుంది`` అన్నారు.
డి.ఎస్.రావు మాట్లాడుతూ ``నిర్మాత తెలుగులో చేస్తున్న రెండో సినిమా. చాలా కష్టపడి నిర్మించారు. సినిమాపోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే సినిమా బావుందనే టాక్ వచ్చింది. అరుణ్ మంచి హీరో అవుతాడు. తనతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను`` అన్నారు.
ముకుంద్ పాండే మాట్లాడుతూ ``నిర్మాత సుబ్బారెడ్డిగారు పూర్తి సహకారం అందించారు. సపోర్ట్ చేసిన నటీనటులకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్`` అన్నారు.
నిర్మాత బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ``నేను బోజ్‌పురిలో స్టార్ హీరోలతో సినిమాలు చేశాను. తెలుగులో నేను చేస్తున్న రెండో సినిమా ఇక్కడ కూడా మంచి నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ముకుంద్ చెప్పిన కథ నచ్చడంతో అతన్నే డైరెక్షన్ చేయమని అన్నాను. మూడు నెలలు పాటు కథపై వర్కవుట్ చేశాం. కొత్త దర్శకుడైనా చక్కగా తెరకెక్కించాడు. సినిమా బాగా వచ్చింది. సినిమాటోగ్రఫీ బావుంది. హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. ప్రతి ఒక్కరూ పూర్తి సపోర్ట్ చేశారు అందరికీ థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.