
17 June 2015
Hyderabad
‘ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు’, ‘సాహసబాలుడు విచిత్రకోతి’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి తనయుడు నాగఅన్వేష్ ఇప్పడు యంగ్ అండ్ ఎనర్టిటిక్ హీరోగా వినవయ్యా రామయ్యా చిత్రంతో పరిచయం అవుతున్నాడు. సరస్వతి ఫిలింస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వినవయ్యా రామయ్యా చిత్రం ఈ నెల 19న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఇటీవల ఈ సినిమా స్పెషల్ షో చూసిన సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చిత్రయూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’సింధూర పువ్వు కృష్ణారెడ్డిగారితో మంచి అనుబంధం ఉంది. ఆయన తనయుడు నాగఅన్వేష్ బాలనటుడిగా మనకు పరిచయమే. వినవయ్యా రామయ్యా చిత్రం తొలి చిత్రమైనా నాగఅన్వేష్ మంచి ఎక్స్ పీరియెన్స్ ఉన్న హీరోలా నటించాడు. ఫైట్స్, డ్యాన్సులు బాగా చేశాడు. బ్రహ్మానందం, అలీ, సప్తగిరి కామెడి సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, అనూప్ మ్యూజిక్ సూపర్ గా ఉన్నాయి. మంచి టీమ్ ఈ సినిమాకి వర్క్ చేసి ఒక మంచి చిత్రాన్ని రూపొందించారు. తప్పకుండా అందరూ చూడాల్సిన, అన్నీ వర్గాలను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్ టైనర్’’ అన్నారు.