18 November 2022
Hyderabad
One of the most anticipated romantic films from the Geetha Arts is 18 Pages. Nikhil and Anupama Parameswaran are working together again after the recent blockbuster Karthikeya 2 and their chemistry seems just right.
Bunny Vaas from Geetha Arts-2 is producing the project while Palnati Surya Prathap who previously directed Current and Kumari 21F is handling the direction department.
The film will be releasing worldwide on December 23rd. The 18 Pages team is currently busy with final leg of shoot and post production work.
The makers delighted fans and audiences with the exciting single announcement ahead of the film's release. Nannaya Raasina, a breezy melody for the hearts, will be released on November 22nd. The eye catching poster showed the two different worlds of the leads.
This film is touted to be a youthful entertainer in which the male lead loves the female lead in a very genuine manner and without any second thoughts. The title of the film itself has gotten the attention of many.
18 Pages is presented by Allu Aravind, Starring Nikhil Siddhartha & Anupama Parameswaran in lead roles. Story by Sukumar. Screenplay & direction by Palnati Surya Pratap. Produced by Bunny Vas. Music by Gopi Sundar. Cinematography by A Vasanth. Editing by Navin Nooli. Production by GA2 Pictures & Sukumar Writings.
నవంబర్ 22న నిఖిల్,అనుపమ పరమేశ్వరన్ నటించిన "18 పేజిస్" చిత్రం నుండి "నన్నయ్య రాసిన" లిరికల్ వీడియో విడుదల
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.
ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. మాములు చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం రోజురోజుకు థియేటర్స్ ను, కలక్షన్స్ ను పెంచుకుంటూ తిరుగులేని విజయాన్ని సాధించింది. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ "18 పేజిస్" సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంను డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదివరకే గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
"18 పేజిస్" చిత్రం నుండి విడుదలకాబోయే సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి "నన్నయ్య రాసిన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.
తారాగణం: నిఖిల్ సిద్దార్థ & అనుపమ పరమేశ్వరన్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్
కథ: సుకుమార్
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్
నిర్మాత: బన్నీ వాస్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: వసంత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్), అశోక్ బండ్రెడ్డి
రచయిత: శ్రీకాంత్ విస్సా
లైన్ ప్రొడ్యూసర్: బాబు
పిఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, మేఘ శ్యామ్.