pizza

18 Pages trailer on 17 December
17న విడుదలకానున్న నిఖిల్, అనుపమ జంటగా నటించిన "18 పేజెస్" ట్రైలర్

You are at idlebrain.com > news today >
Follow Us

15 December 2022
Hyderabad

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ "18పేజిస్" ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ "18పేజిస్" టీజర్ కి, "నన్నయ్య రాసిన" అలానే "టైం ఇవ్వు పిల్ల" అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన "ఏడు రంగుల వాన" అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్ర ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఈ తరుణంలో ఈ చిత్ర యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

ప్రొమోషన్స్ లో భాగంగా ఒక క్రేజి వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు అనుపమ & నిఖిల్.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved