పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ‘418’తో డార్కర్ జానర్ లో అడుగుపెడుతోంది. సీరియస్, అన్‌సెటిలింగ్ నెరేటివ్‌తో భయాన్ని కొత్త కోణంలో చూపించబోతున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హారర్, మిస్టరీతో సంచలనం సృష్టించింది.
తాజాగా మేకర్స్ 'ది నైట్‌మేర్ బెగిన్స్ పేరుతో రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ 418 రూమ్ చుట్టూ ప్రజెంట్ చేసిన మిస్టరీ హారర్ టెర్రిఫిక్ గా వున్నాయి. స్టన్నింగ్ విజువల్స్, చిల్లింగ్ పెర్ఫార్మెన్స్, హాంటింగ్ స్కోర్, సూపర్‌నేచురల్ థ్రిల్స్‌తో ‘418’ గ్రిప్పింగ్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతునని రిలీజ్ ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. ది నైట్‌మేర్ బెగిన్స్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
దసరా సందర్భంగా అక్టోబర్ 23న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
What happens when you enter the abandoned room number 418 in that hostel?
Here is the release trailer of #418TheFilm.
Find out on 23 Oct!
Produced by Mythri & presented by Neel. https://t.co/t32BgOCBeA