ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న చిత్రం ‘AA23’. ఈ మూవీ ప్రకటనతో రీసెంట్‌గా సోషల్ మీడియాలో భారీ సందడి నెలకొన్న సంగతి తెలిసిందే..ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన అనౌన్స్‌మెంట్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియుల మధ్య ఈ పాట హాట్ టాపిక్‌గా నిలిచింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ వంటి స్టార్స్ వర్క్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఎప్పుడు వెల్లడవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘AA23’ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ అప్‌డేట్‌ను షేర్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. లోకేష్ కనగరాజ్ షేర్ చేసిన ఫొటోలో అల్లు అర్జున్‌కు ఆయన ఏదో వివరిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొనగా.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు వెలువడనున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తనదైన కథాకథనాలతో, వైవిధ్యమైన మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ‘AA23’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితులైన నలుగురు ఈ ప్రాజెక్ట్‌లో సహ నిర్మాతలుగా భాగమయ్యారు. బన్నీ వాస్, సందీప్ రామినేని, నటరాజ్, స్వాతి సహ నిర్మాతలుగా ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు.
‘AA23’ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ కాగా.. చిత్ర బృందం నుంచి రాబోయే అప్‌డేట్స్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన ప్రకటనలు వచ్చే అవకాశం ఉండటంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.