pizza

GA2 Pictures, Bunny Vas, Vidya Koppineedi, Narne Nithiin, Anji K Maniputhra's AAY third single "Amma Lalo Ram Bhajana" is out now
GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె.మణిపుత్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ నుంచి ‘అమ్మ లాలో రామ్ భజన..’ పాట విడుదల

You are at idlebrain.com > news today >

08 July 2024
Hyderabad

The most successful and prestigious production GA 2 Pictures next AAY movie stars young and energetic hero Narne Nithiin and gorgeous Nayan Sarika in lead roles. The film directed by debutant filmmaker Anji K Maniputhra. Talented producers Bunny Vas and Vidya Koppineedi are bankrolling this entertainer. The film is hiking prospects with its intriguing promotional content.

AAY single titled "Amma Lalo Ram Bhajana" is out now. Makers called it as Srinivasuni Song as it explains Srinivasa Kalyanam story in a beautiful way using our old tradition Burra Katha. It intricately weaves together the narrative of Lord Srinivas Kalyanam. The song stands as a poignant tribute to our rich tradition and culture, vividly portrayed throughout its Lyrical video.

Penned by director AnjiK Maniputhra, the lyrics form a rich tapestry, capturing the essence of this age-old tale. Penchal Das's mesmerizing vocals and Ajay Arasada's captivating composition imbue the Burra Katha story with a magical allure. This powerful composition is poised to resonate deeply.

The songs already released have become massive chartbusters and are going viral on social media through numerous reels and shorts. The ultimate fun entertainer of the season, "AAY," will be hitting theatres worldwide on Independence Day, August 15th. "AAY" promises to be a full-on fun entertainer set against the picturesque backdrop of Godavari. Narne Nithiin is poised to captivate audiences with this wholesome family entertainer.

This ambitious project sees the coming together of some of the finest acting and technical talents. Ace producer Allu Aravind garu presenting the film. Art direction is handled by Kiran Kumar Manne while cinematography is by Sameer Kalyani. Music is scored by Ram Miryala. More details about this exciting project are awaited.

Cast: Narne Nithiin, Nayan Sarika and others

Technical Team:
Banner: GA2 Pictures
Presenter: Allu Aravind
Producers: Bunny Vas & Vidya Koppineedi
Director: Anji Kanchipalli
Co-Producers: Bhanu Pratapa, Riyaz Chowdary
DOP: Sameer Kalyani
Music : Ram Miriyala
Editor: Kodati Pavan Kalyan
Art Director: Kiran Kumar Manne
Executive Producer: Ajay Gadde
Costumes: Susmitha & Shilpa
Co-Director: Rama Naresh Nunna

GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె.మణిపుత్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ నుంచి ‘అమ్మ లాలో రామ్ భజన..’ పాట విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆయ్ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ లాలో రామ్ భజన..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

‘‘పేరు లేదు ఊరు లేదు ప్రేమించేసిందండోయ్
ఆహా.. అమ్మ లాలో రామ్ భ‌జ‌న‌
మాట లేదు.. మ‌నువు లేదు.. మ‌న‌సిచ్చేసిందండోయ్
అమ్మ లాలో రామ్ భ‌జ‌న‌..’’

అంటూ అమ్మాయి మనసులో ప్రేమను తెలియజేసేలా ‘ఆయ్’ సినిమా నుంచి ‘అమ్మ లాలో రామ్ భ‌జ‌న‌..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి మధ్య ప్రేమను తెలియజేసేలా సాగుతోన్న ఈ పాట‌ను మ‌న బుర్ర‌క‌థ పంథాలో చిత్రీక‌రించటం వైవిధ్యంగా అనిపిస్తోంది. మన గొప్ప సంప్రదాయం, సంస్కృతికి హృదయపూర్వక నివాళిగా నిలుస్తుంది. అది పాట‌లో స్పష్టంగా చిత్రీకరించబడింది.

అజ‌య్ అర‌సాడ సంగీతం అందించిన ‘అమ్మ లాలో రామ్ భ‌జ‌న‌..’ పాట‌ను దర్శకుడు అంజి కె.మణిపుత్ర చాలా చ‌క్క‌గా రాశారు. పెంచ‌ల్ దాస్ పాట‌ను పాడిన తీరు చాలా స‌హ‌జ సిద్ధంగా ఉంది.

ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆయ్‌’ నుంచి రెగ్యుల‌ర్‌గా మూవీ అప్‌డేట్స్‌ను ఇస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌తో ఆయ్ సినిమా రూపొందింది. ఈ ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో నార్నే నితిన్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.

నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:
బ్యానర్ - GA2 పిక్చర్స్, సమర్పణ - అల్లు అరవింద్, నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ - అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి, సంగీతం - రామ్ మిర్యాల, ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ - రామ నరేష్ నున్న

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved