GA 2 Pictures, known for their successful and prestigious productions, is set to release their latest film, AAY. This upcoming movie stars the dynamic Narne Nithiin, recognized for his role in Mad, alongside the stunning Nayan Sarika. Directed by debutant Anji K. Maniputhra, the film is produced by Bunny Vas and Vidya Koppineedi.
The film's recently released songs have quickly become popular hits, gaining traction on social media through numerous reels and shorts. The team has recently unveiled a theatrical trailer that has generated significant excitement with its continuous humor featuring three amusing friends from a Godavari village.
The film recently completed the censor formalities and was awarded a universally appealing U/A certificate with a crisp runtime of 2 hours and 21 minutes. It is a full-on hilarious entertainerr. The film’s shoot is complete. AAY promises a blend of family, friendship, and romance with a unique twist, premiering on August 15th.
Narne Nithiin is expected to charm audiences with this nostalgic Godavari-themed film. The movie will have paid premieres on Independence Day, August 15th. Presented by ace producer Allu Aravind, the project features notable talent both in front of and behind the camera. Art direction is by Kiran Kumar Manne, cinematography by Sameer Kalyani, and the music is composed by Ram Miryala. Further details about this exciting film are anticipated.
జీఏ 2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె మణిపుత్ర కాంబోలో రూపొందిన ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ సెన్సార్ పూర్తి
విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ నుంచి రాబోతున లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో మెప్పించిన డైనమిక్ యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ఆయ్’ సినిమా ప్రారంభం నుంచి వైవిధ్యమైన ప్రమోషన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్, రీల్స్, షార్ట్స్ అన్నీ ప్రేక్షకాదరణను పొందాయి. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్, అక్కడున్న ప్రెండ్స్‌కు సంబంధించిన కథతో ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.
తాజాగా ‘ఆయ్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 21 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అలరించనుంది. కుటుంబంలోని భావోద్వేగాలు, స్నేహం, కామెడీ, రొమాన్స్‌తో పాటు చక్కటి ట్విస్టుతో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది.
ఆగస్ట్ 15న ఆయ్ చిత్రం పెయిర్ ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.
నటీనటులు:
నార్నే నితిన్, నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ - GA2 పిక్చర్స్, సమర్పణ - అల్లు అరవింద్, నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ - అంజి కె.మణిపుత్ర, సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి, సంగీతం - రామ్ మిర్యాల, ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ - రామ నరేష్ నున్న