19 August 2024
Hyderabad
ఫన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయ్ మూవీ భారీ ఆదరణ చూరగొంటోంది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్స్ లో హంగామా చేస్తోంది. పాజిటివ్ వైబ్రేషన్స్ నడుమ ఓ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. కొత్త దర్శకుడైన అంజి రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 15న తో షోతో ప్రారంభమైంది. అప్పటినుంచి మంచి మౌత్ టాక్ తో వరుసగా షోలు, స్క్రీన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఓ చక్కని సినిమాను చూశామనే ఫీలింగ్‌తో జనాలు బయటకు వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ ఆధారణపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
మొదటి రోజు అరవై లక్షల గ్రాస్ వస్తే.. నాలుగో రోజుకి 2.2కోట్ల గ్రాస్ వచ్చింది. తొలిరోజుతో పోల్చితే మూడు వందల రెట్లు ఎక్కువగా వసూళ్లు వచ్చాయి.
ఇతర సినిమాల కఠినమైన పోటీ నడుమ ఈ చిత్రానికి గణనీయమైన విజయం దక్కుతోంది. ప్రతి షోకి కలెక్షన్లు పెరుగుతుండటంతో అన్ని ఏరియాల్లో దీనికి అధిక డిమాండ్ నెల్లకొంది. ఈ వారం ప్రేక్షకులకు ఈ చిత్రం నంబర్ వన్ ఛాయిస్‌గా మారడంతో మేకర్స్ మరిన్ని స్క్రీన్‌లను యాడ్ చేస్తున్నారు. థియేటర్ల సంఖ్య పెంచుతున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించిన ఆయ్ మూవీ.. గోదావరి ప్రాంత నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రం. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రంతో అంజి కె. మణిపుత్ర దర్శకుడిగా పరిచయం అయ్యాడు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్‌తో దూసుకుపోతోంది. సెన్సిబుల్, హ్యూమరస్ స్టోరీతో సత్తా చాటుతోంది.
|