pizza

GA2 Pictures, Bunny Vas, Vidya Koppineedi, Narne Nithiin, Anji K Maniputhra's "AAY" second single, Mass celebratory anthem Ranganayaki out now
GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కంచిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ నుంచి రెండో పాట ‘రంగనాయకి’ విడుదల

You are at idlebrain.com > news today >

25 May 2024
Hyderabad

The most successful and prestigious production GA 2 Pictures next AAY stars young and energetic hero Narne Nithiin and gorgeous Nayan Sarika in lead roles. The film directed by debutant filmmaker Anji K Maniputhra. Talented producers Bunny Vas and Vidya Koppineedi are bankrolling this fun entertainer. The film is hiking prospects with its intriguing promotional content and hilarious concept videos.

After the catchy Melody Sufiyana, today makers dropped a banger mass song titled "Ranganayaki." The promo of the song set high expectations and the lyrical video which is out now lives up to it. This is out and out rural mass number that will make listeners tap thier foot and dance thier hearts out. Masses will celebrate this song in cinemas for its thumping sound.

Most happening singer Anurag Kulkarni sung this energetically and Suresh Banisetti wrote the lyrics that has pure rural essence. Ram Miriyala, known for his magical compositions gave a massy tune. Ram Miriyala is in top-form and the song hits you right away. Complimenting every lyric and beat choreographer Bhanu master composed superb steps.

The set looks colorful, and so are the costumes. Narne Nithiin simple steps, Nayan Sarika looks and AAY gang's crazy moments are the highlights. Makers began the musical promotions with instantly addictive mass beat which will be trending in reels and social media in no time.

Team is confident that this entertainer is going to be full on fun ride and focusing to promote it in innovative way. These unique promotions raising buzz in the film. This ambitious project sees the coming together of some of the finest acting and technical talents. Ace producer Allu Aravind garu presenting the film. Art direction is handled by Kiran Kumar Manne while cinematography is by Sameer Kalyani. Music is scored by Ram Miryala. More details about this exciting project are awaited.

About GA2 pictures:

Through the GA2 Pictures banner, the dynamic duo of Ace Producer Allu Aravind garu and producer Bunny Vas always delivered super hit and content-oriented films. The banner is known for blockbusters such as Bhale Bhale Magadivoy, Geetha Govindam, Taxiwala, Prathi Roju Pandage, Most Eligible Bachelor, and more.

Cast: Narne Nithiin, Nayan Sarika and others

Technical Team:

Banner: GA2 Pictures
Presenter: Allu Aravind
Producers: Bunny Vas & Vidya Koppineedi
Director: Anji Kanchipalli
Co-Producers: Bhanu Pratapa, Riyaz Chowdary
DOP: Sameer Kalyani
Music : Ram Miriyala
Editor: Kodati Pavan Kalyan
Art Director: Kiran Kumar Manne
Executive Producer: Ajay Gadde
Costumes: Susmitha & Shilpa
Co-Director: Rama Naresh Nunna
Marketing: Vishnu Thej Putta
Posters: Anil & Bhanu

GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కంచిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ నుంచి రెండో పాట ‘రంగనాయకి’ విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఆయ్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వస్తుంది. టైటిల్ రివీల్ సహా సినిమా కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు, పోస్ట‌ర్స్‌, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో శ‌నివారం మేక‌ర్స్ ఈ మూవీ నుంచి ‘రంగనాయకి’ అనే మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సాంగ్ ప్రోమోతో పాట‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను మ‌రింతంగా ఆక‌ట్టుకుంటోంది. మాస్ బీట్‌తో ఉన్న ఈ పాట‌ను వింటుంటే స్టెప్స్ వేయాల‌నిపించేలా ఉంది.

ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ పాట‌ల‌కు కేరాఫ్‌గా మారిన రామ్ మిర్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌టం విశేషం. సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. భాను మాస్టర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చారు. సెట్స్‌, ఆర్టిస్టుల డ్రెస్సింగ్ చాలా కల‌ర్‌ఫుల్‌గా ఉంది. న‌య‌న్ సారిక కూడా ఈ పాట‌లో క‌నిపించింది.

నితిన్‌, న‌య‌న్ సారిక జోడి సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ చ‌క్క‌గా ఉంది. ఈ సాంగ్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. ‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

GA2 పిక్చర్స్:

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ - GA2 పిక్చర్స్, సమర్పణ - అల్లు అరవింద్, నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ - అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి, సంగీతం - రామ్ మిర్యాల, ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ - రామ నరేష్ నున్నమార్కెటింగ్ - విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ - అనిల్, భాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved