pizza

Audience once again proved that films with good content will be a big success: Bunny Vas at the AAY Success Meet
మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారు.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్

You are at idlebrain.com > news today >

24 August 2024
Hyderabad

Narne Nithiin and Nayan Sarika starred in the film AAY, produced by Bunny Vas and Vidya Koppineedi under the banner of GA2 Pictures, presented by Allu Aravind. The movie is directed by Anji K Maniputhra. It had a grand release on August 15 and received an amazing response from the audience. At this time of huge success at the box office, the film unit organized a success meet. In this program,

Producer Bunny Vas said, "It started with 110 screens and went up to 382 screens. It started with 27 screens in the US and went up to 86. AAY has proved that if a movie comes with good content and good word of mouth, it can go far and be greatly appreciated by the audience. The media has been very supportive. It has collected more than 11 crore gross. We are still seeing 60-70 percent occupancy. People love movies from Geetha Arts. Thanks to the team and SKN for supporting me in the journey of this film. Nithiin is a lucky star, picking projects with good content and success. After hearing the story, he immediately agreed. He has good judgment on stories. It seems that there will be no flop movie from Nithiin in the future. We made our DOP work hard. We told him that even if it was shot in summer, it should look as if it was shot in the rainy season. The visuals are better than we expected. Ram Miriyala and Ajay gave excellent music and background score. Anji has been in the industry for 12 years. Anji has not forgotten our roots. That's why he made a wonderful movie. Anji is doing a film under our banner again. Thanks to everyone who worked on the film."

SKN said, "Vas told me this story two years ago. He tells me all the stories that he works on. Bunny is multi-talented with a good grip on all crafts. I loved it when he told me the story. The story is good, but I didn’t know how it would come to the screen. But Bunny Vas was very confident about the story. Nithiin loved the story. The story doesn't need to revolve around me; it’s enough if I am in the story, Nithiin said. His way of thinking is what brings him success. The timing of the friendship and bromance between them was perfect. Everyone is laughing for the scenes. Everyone liked the music by Ram Miriyala and Ajay. Sameer's visuals are good. Nayan Sarika got good success. Kasireddy was also very busy. Everyone is talking about the committee Kurrollu too. Even without the stars, the movie is doing well. Audiences from all walks of life are enjoying this movie."

Director Anji K Maniputhra said, "Thanks to the audience for supporting the film AAY so well. I was a bit scared coming in the middle of big movies. But it was understood that the decision by Allu Aravind and Bunny Vas to release during the long weekend was right. Thanks to the audience for making a small film a big success. Whether they come with friends or with their parents, they watch the movie and leave with smiles on their faces. SKN was very supportive of our film. For those who haven’t seen the movie, watch it. Our film is getting a good response in the US as well. This is a movie that needs to be seen and enjoyed in theaters."

Narne Nithiin said, "Though our movie AAY came out amidst big films, thanks to the audience for such a big success. Anji narrated me a good story. Thanks to the director who gave me a hit. Sameer’s visuals are amazing. Everyone is talking about the 'Sufiyana' song. It was a pleasure to work with Ankith and Kasireddy. We had a lot of fun while shooting. Bunny Vas garu worked hard for our film. Ajay and Ram Miriyala gave great RR and music. Thanks to Allu Aravind garu and Vidya akka for giving me such a good opportunity."

Ankith Koyya said, "Thanks to the media for supporting the movie AAY. Thanks to the audience who are taking the film forward with word of mouth. People are enjoying our trio. Everyone worked very hard for our film. Thanks to the director and producers who believed in me and gave me such a good role."

Music director Ajay Arasada said, "I am happy that many of those who have seen the movie have called and congratulated me. Not only comedy but they've also connected emotionally. If the concept is good, the music will also be good."

DOP Sameer said, "Bunny Vas has a lot of vision. Anji knows what he wants. Every shot is very particular. Audiences from all walks of life are enjoying this movie very much."

 

మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారు.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ తరుణంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘110 స్క్రీన్‌లతో మొదలై.. 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లింది. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే.. మౌత్ టాక్ బాగుంటే.. సినిమా ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఆడియెన్స్ ఎంతగా ఆదరిస్తారో ఆయ్ నిరూపించింది. మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. 11 కోట్ల గ్రాస్‌కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ 60, 70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే సినిమాలను జనాలు ఆదరిస్తుంటారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్టివ్‌గా నిలిచిన టీంకు, ఎస్ కే ఎన్‌కు థాంక్స్. నితిన్ గారు లక్కీ స్టార్. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నారు. కథ చెప్పగానే వెంటనే ఓకే చేశారు. కథల మీద ఆయనకు మంచి జడ్జ్మెంట్ ఉంది. నితిన్ నుంచి భవిష్యత్తులోనూ ఫ్లాప్ సినిమా రాదని అనిపిస్తుంది. మా డీఓపీని చాలా కష్టపెట్టాం. ఎండాకాలంలో తీసినా.. వర్షకాలంలో సినిమా తీసినట్టుగా ఉండాలని చెప్పాం. మేం ఏం ఆశించామో దాని కంటే గొప్ప విజువల్స్ ఇచ్చారు. రామ్ మిర్యాల, అజయ్ అద్భుతమైన సంగీతాన్ని, ఆర్ఆర్‌లను ఇచ్చారు. అంజి ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది. అంజి మన మూలాల్ని మర్చిపోలేదు. అందుకే అద్భుతమైన సినిమాను తీశాడు. మళ్లీ మా బ్యానర్‌లోనే అంజి సినిమా చేస్తున్నాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ‘ఓ రెండేళ్ల క్రితం వాసు ఈ కథను నాకు చెప్పారు. వాసు చేసే కథలన్నీ నాకు చెబుతుంటాడు. బన్నీ వాస్ మల్టీ టాలెంటెడ్. అన్ని క్రాఫ్ట్‌ల మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఆయ్ కథను నాకు చెప్పినప్పుడు చాలా నచ్చింది. కథ అయితే బాగుంది తెరపైకి ఎలా వస్తుందో తెలియదు. కానీ కథ మీద మాత్రం బన్నీ వాస్ చాలా నమ్మకంగా ఉండేవాడు. నితిన్ గారికి కథ చాలా నచ్చింది. కథ నా చుట్టూ ఉండాల్సిన పని లేదు.. కథలో నేను ఉంటే చాలు అని.. నితిన్ గారు అన్నారు. ఆయన ఆలోచించే విధానమే ఆయనకు సక్సెస్‌లను తెచ్చి పెడుతున్నాయి. మిత్రత్రయం, వారి మధ్య బ్రొమాన్స్‌ టైమింగ్ బాగా కుదిరింది. వారి సీన్లను చూసి అందరూ తెగ నవ్వేసుకుంటున్నారు. రామ్ మిర్యాల గారు, అజయ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అందరికీ నచ్చేసింది. సమీర్ గారి విజువల్స్ బాగా వచ్చాయి. నయన్ సారిక గారికి మంచి సక్సెస్ వచ్చేసింది. కసిరెడ్డి గారు కూడా చాలా బిజీ అయ్యారు. మొన్న కమిటీ కుర్రోళ్లు.. నిన్న ఆయ్ వచ్చింది.. అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. స్టార్‌లు లేకపోయినా సినిమా బాగా ఆడుతోంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నారు.

దర్శకుడు అంజి కే మణిపుత్ర మాట్లాడుతూ.. ‘ఆయ్ చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. పెద్ద సినిమాల మధ్యను వస్తుండటంతో కాస్త భయపడ్డాను. కానీ లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు తీసుకున్న నిర్ణయమే సరైందని అర్థమైంది. చిన్న చిత్రమే అయినా పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. ఫ్రెండ్స్‌తో వచ్చినా, పేరెంట్స్‌తో వచ్చినా సినిమా చూసి భుజం మీద చేయి వేసుకుంటూ వెళ్తారు. ఎస్ కే ఎన్ గారు మా సినిమాకు చాలా సపోర్టివ్‌గా నిలిచారు. సినిమాను చూడని వాళ్లంతా ఇంకా చూడండి. యూఎస్‌లోనూ మా చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పక్కా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా’ అని అన్నారు.

నార్నే నితిన్ మాట్లాడుతూ.. ‘పెద్ద సినిమాల మధ్యలో మా ఆయ్ మూవీ వచ్చినా.. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. అంజి గారు మంచి కథను నాకు ఇచ్చారు. నాకు హిట్ ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. సమీర్ గారి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సూఫీయానా సాంగ్ గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అంకిత్, కసిరెడ్డిలతో పని చేయడం ఆనందంగా ఉంది. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. బన్నీ వాస్ గారు మా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అజయ్ గారు, రామ్ మిర్యాల గారు మంచి ఆర్ఆర్, మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారు, విద్యా గారికి థాంక్స్’ అని అన్నారు.

అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘ఆయ్ సినిమాకు ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. మౌత్ టాక్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా ముగ్గురి కాంబోను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాకు ప్రతీ ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

అజయ్ అరసాడ మాట్లాడుతూ.. ‘ఆయ్ సినిమాను చూసిన వారిలో చాలా మంది ఫోన్స్ చేసి అభినందించడం ఆనందంగా ఉంది. కామెడీ మాత్రమే కాకుండా.. ఎమోషనల్‌గానూ కనెక్ట్ అవుతున్నారు. కాన్సెప్ట్ బాగుంటేనే.. మ్యూజిక్ కూడా బాగా వస్తుంది’ అని అన్నారు.

కెమెరామెన్ సమీర్ మాట్లాడుతూ.. ‘బన్నీ వాస్ గారికి చాలా విజన్ ఉంది. అంజి గారికి తనకేం కావాలో బాగా తెలుసు. ప్రతీ షాట్‌ను ఎంతో పర్టిక్యులర్‌గా అడిగేవారు. అన్ని వర్గాల ఆడియెన్స్ ఈ సినిమాను చూస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved