pizza

M.S. Raju's Mystic Divine Thriller 'AGADHA' Set for a Grand Worldwide Release on August 14
ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఎం.ఎస్. రాజు మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’

You are at idlebrain.com > news today >

09 July 2026
Hyderabad

Acclaimed filmmaker M.S. Raju, who created a remarkable legacy as a producer, has crafted his latest directorial venture, 'AGADHA', as a spectacular visual wonder. This prestigious mystic divine thriller is all set for a grand worldwide release on August 14, 2026.

Presented by Ajay KR under the banner of Sri Adi Varaha Productions, the film is produced by Kashi Visalakshi Balusu.

The teaser of AGADHA, released recently, created a sensation and generated tremendous excitement among audiences. Its stunning visuals, haunting background score, mysterious atmosphere, and grand production values received widespread appreciation from all sections of viewers. The teaser has already crossed 14 million views, reflecting the enormous anticipation surrounding the film.

Speaking about the film, director M.S. Raju said:

"AGADHA is my dream project. What audiences saw in the teaser is only a small glimpse of the world we have created. The film has many more surprising elements that will leave viewers amazed. Every frame has been designed as a visual spectacle, while emotions remain the film's highest priority. Every artist and technician has delivered exceptional work. Kamakshi Bhaskarla, Shravan Reddy, Ulka Gupta, and Jovika Vijay Kumar have all given extraordinary performances. Audiences will experience something truly unique in theatres. Blending mythological elements, mystery, thrilling moments, breathtaking visuals, and deep emotions, AGADHA promises to be an unforgettable emotional roller-coaster ride. The film will have a grand worldwide release on August 14, 2026."

Producer Kashi Visalakshi Balusu said:

"AGADHA has been produced with the highest technical standards. The overwhelming response to the teaser has made us even more confident. We strongly believe audiences across the world will embrace the film when it releases on August 14."

Actress Kamakshi Bhaskarla said:

"The role of Mahadevi will always remain one of the most memorable characters of my career. This film will offer audiences a completely new cinematic experience."

Hero Shravan Reddy said:

"I'm delighted to reunite with M.S. Raju garu after Dirty Hari. My role in AGADHA is completely different from anything I've done before. The film is packed with many exciting surprises."

The film stars Kamakshi Bhaskarla, Shravan Reddy, Ulka Gupta, Jovika Vijay Kumar, Sijju, Roshan, and Shreya Rani Reddy, among others.

Credits:

Written & Directed by: M.S. Raju

Presented by: Ajay KR

Producer: Kashi Visalakshi Balusu

Banner: Sri Adi Varaha Productions

Music: Rakesh Venkatapuram

Cinematography: Nani Chamidishetty

Editing: Junaid Siddiqui

Production Designer: Rajeev Nair

Additional Screenplay: Chaitanya Vegi

Executive Producer: N.V.N. Subbaraju

ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఎం.ఎస్. రాజు మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’

నిర్మాత గా ఒక చరిత్ర సృష్టించిన ఎం.ఎస్. రాజు , దర్శకునిగా ‘అగధ’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ చిత్రం ‘అగధ’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14, 2026న భారీ స్థాయిలో విడుదల కానుంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆ మధ్య విడుదలైన ‘అగధ’ టీజర్ ఒక సెన్సేషన్ సృష్టించింది. ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. టీజర్ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ వాతావరణం, గ్రాండియర్ మేకింగ్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. 14 మిలియన్ల మంది ఈ టీజర్ ని వీక్షించారంటేనే, ఎంతలా ప్రేక్షకుల్లోకి రీచ్ అయ్యిందో అర్థమవుతోంది.

‘అగధ’ గురించి దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ”‘అగధ’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. టీజర్‌లో చూసింది ఈ సినిమా ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే. సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇది ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ విజువల్ వండర్‌లా అనిపించే సినిమా. అలాగే ఎమోషన్స్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చాం. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పనిచేశారు. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ తమ పాత్రల్లో అసాధారణ నటన కనబరిచారు. ప్రేక్షకులు థియేటర్లలో ఒక కొత్త అనుభూతిని పొందుతారు. మైథలాజికల్ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అత్యున్నత విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఓ ఎమోషనల్ రోలర్ కోస్ట్ రైడ్ లా రూపొందిన ‘అగధ’ చిత్రం ఆగస్ట్ 14, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది” అని తెలిపారు.

నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ, ”‘అగధ’ను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాం. టీజర్‌కు వచ్చిన స్పందన మా ఆనందాన్ని మరింత పెంచింది. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం” అన్నారు.

నటి కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, “మహాదేవి పాత్ర నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు.

హీరో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, ”‘డర్టీ హరి’ తర్వాత మళ్లీ ఎం.ఎస్. రాజు గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ‘అగధ’లో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి” అన్నారు.

 

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: ఎం.ఎస్. రాజు,

సమర్పణ: అజయ్ కేఆర్,

నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు,

బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్,

సంగీతం: రాకేష్ వెంకటాపురం,

సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి,

ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ,

ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్,

అదనపు స్క్రీన్‌ప్లే: చైతన్య వేగి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.వి.ఎన్. సుబ్బరాజు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved