pizza

M.S. Raju’s Mystic Divine Thriller ‘Agadha’ Trailer to Release on August 3rd
ఎం.ఎస్. రాజు మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్ ఆగస్టు 3న విడుదల!

You are at idlebrain.com > news today >

31 July 2026
Hyderabad

Public interest is growing day by day in ‘Agadha’, a mystic divine thriller directed by the renowned M.S. Raju. Following the tremendous response to the previously released teaser and posters, expectations for the film have soared.

Heightening this anticipation, the film unit has announced that the ‘Agadha’ trailer will be released on August 3rd at 12:00 PM. A poster released for the occasion—featuring a female ascetic standing amidst a mysterious forest atmosphere—further piques curiosity about the secrets hidden within the story. The poster clearly suggests that ‘Agadha’ will transport the audience into a unique world of spiritual mystery.

Produced by Kasi Visalakshi Balusu under the Sri Adi Varaha Productions LLP banner, the film is presented by Ajay K.R.
M.S. Raju himself has handled the story, screenplay, and direction.

Made in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi, ‘Agadha’ is set for a grand worldwide release on August 14. Having already created a sensation with its teaser, the film unit is confident that the trailer will elevate expectations to even greater heights.

Cast: Kamakshi Bhaskarla, Shravan Reddy, Ulka Gupta, Jovika Vijay Kumar, Sijju, Roshan, Shreya Rani Reddy and others.

Technical Crew:
Writer & Director: M.S. Raju
Presenter: Ajay KR
Producer: Kasi Visalakshi Balusu
Banner: Sri Aadi Varaha Productions
Music: Rakesh Venkatapuram
Cinematography: Nani Chamidisetty
Editor: Junaid Siddiqui
Production Designer: Rajeev Nair
Additional Screenplay: Chaitanya Vegi
Executive Producer: N.V.N. Subbaraju

ఎం.ఎస్. రాజు మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్ ఆగస్టు 3న విడుదల!

ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, పోస్టర్స్ కు అద్భుత స్పందన రావడంతో సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ ఉత్కంఠను మరింత పెంచుతూ ‘అగధ’ ట్రైలర్‌ను ఆగస్టు 3న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అడవి నడుమ మర్మమైన వాతావరణంలో నిలబడి ఉన్న స్త్రీ సాధువు రూపం సినిమా కథలో దాగి ఉన్న రహస్యాలపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పోస్టర్ చూస్తుంటే ‘అగధ’ ప్రేక్షకులను ఓ విభిన్నమైన ఆధ్యాత్మిక మిస్టరీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ కె.ఆర్. సమర్పిస్తున్నారు. కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను ఎం.ఎస్. రాజు స్వయంగా నిర్వహించారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిన ‘అగధ’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి  రచన - దర్శకత్వం: ఎం.ఎస్. రాజు,
సమర్పణ: అజయ్ కేఆర్, 
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు,
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్,
సంగీతం: రాకేష్ వెంకటాపురం,
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి,
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ,
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్,
అదనపు స్క్రీన్‌ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.వి.ఎన్. సుబ్బరాజు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved