pizza

Director Teja, Anandi Arts Creations’ AHIMSA Shoot Wrapped Up
దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ 'అహింస' షూటింగ్ పూర్తి

You are at idlebrain.com > news today >
Follow Us

5 September 2022
Hyderabad

Director Teja has the calibre to deliver blockbusters with stars as well as upcoming actors. He indeed introduced many actors with his films and some of them become stars. He has proved numerous times that content is the king and films with good content do wonders at box office.

Teja is now introducing another debutant Abhiram as a hero with a youthful entertainer Ahimsa. This is going to be perfect Teja mark movie with the story incorporated with all the commercial ingredients.

P Kiran is producing the movie under Anandi Art Creations. Geethika has played Abhiram’s love interest, wherein Sada and Kamal Kamaraju will be seen in vital roles.

The film’s pre-look generated lots of curiosity on the film. It also gave an impression that Ahimsa will be high on action. Since the film’s shoot is wrapped up, the team will be kick-starting the promotional activities.

RP Patnaik who provided numerous chartbuster albums has scored music for the film. Teja, Anandi Arts Creations, and RP Patnaik have joined forces again after Nuvvu Nenu to deliver another musical blockbuster.

The movie has cinematography handled by Sameer Reddy, while Kotagiri Venkateswara Rao is the editor. Anil Achugatla has penned dialogues and Supriya is the art director.

The makers will soon announce the release date of the movie.

Cast: Abhiram, Geethika, Rajat Bedi, Sadha, Ravi Kale, Kamal Kamaraju, Manoj Tiger, Kalpalatha, Devi Prasad and others.

Technical Crew:

Story, Screenplay, Direction: Teja
Producer: P Kiran
Banner: Anandi Art Creations
Music Director: RP Patnaik
DOP: Sameer Reddy
Editor: Kotagiri Venkateswara Rao
Dialogues: Anil Achugatla
Lyrics: Chandrabose
Art: Supriya
Action Director: BV Ramana
Fights: Real Sathish
Choreography: Shankar
CG: Nikhil Koduri

 

స్టార్స్‌తో పాటు నూతన నటీనటులతో బ్లాక్‌బస్టర్‌లను అందించగల సామర్థ్యం దర్శకుడు తేజ సొంతం. ఆయన తన చిత్రాలతో చాలా మంది నటులను పరిచయం చేశారు. వారిలో కొందరు స్టార్‌లుగా మారారు. కంటెంట్‌యే కింగ్ అని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయని చాలాసార్లు నిరూపించారు తేజ.

ఇప్పుడు తేజ 'అహింస' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో మరో కొత్త నటుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన కథతో తేజ మార్క్ సినిమా ఇది.

ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతిక తివారీ కథానాయికగా కనిపిస్తున్న ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా ప్రీ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. 'అహింస లో హై యాక్షన్‌ ఉంటుందనే అభిప్రాయాన్ని ఇచ్చింది. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనుంది.

అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన ఆర్‌పి పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నువ్వు నేను తర్వాత తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్ మరో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ అందించడానికి మరోసారి చేతులు కలిపారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సమీర్ రెడ్డి, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు నిర్మాతలు.

తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు

సాంకేతిక విభాగం

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
నిర్మాత: పి కిరణ్
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
డీవోపీ : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
సాహిత్యం: చంద్రబోస్
ఆర్ట్: సుప్రియ
యాక్షన్ డైరెక్టర్: బివి రమణ
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: శంకర్
సిజి: నిఖిల్ కోడూరి

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved