pizza

Pan-India Film 'Aho! Vikramaarka' trailer launched in Mumbai
దేవ్‌గిల్ హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’ ట్రైల‌ర్ విడుద‌ల‌

You are at idlebrain.com > news today >

21 August 2024
Hyderabad

Dev Gill, known for his diverse roles and charismatic performances in several South Indian films, including the blockbuster 'Magadheera,' stars in the pan-India film 'Aho! Vikramaarka.' The movie, produced by Dev Gill Productions, will be released on August 30 in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam. The film’s trailer was unveiled on Wednesday.

The trailer reveals that the villain, named Asura, controls an area where people must obey him or face death. The police lack the courage to confront him. However, a powerful police officer arrives to challenge this menace. To discover how he deals with the villains and what unfolds next, you’ll need to watch the movie on August 30.

On this occasion, Dev Gill said, "With 'Aho! Vikramarka,' we aim to highlight the bravery and dedication of the Maharashtra Police in a compelling manner. The film will be released pan-India on August 30. The audience, who have previously seen only one facet of my acting, will experience a new side of me on the silver screen."

Director Peta Trikoti added, "Through 'Aho! Vikramarka,' we strive to capture the essence of language, culture, heroism, and sacrifice. We have meticulously crafted the film to showcase the power of the police, and audiences will see a new side of Dev Gill."

Cast:
Dev Gill, Sayaji Shinde, Praveen Tarde, Tejaswini Pandit, Chitra Shukla, Prabhakar, Vikram Sharma, Bitthiri Satthi, and others.

దేవ్‌గిల్ హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’ ట్రైల‌ర్ విడుద‌ల

బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఆయ‌న హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’. ఆగ‌స్ట్ 30న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అసుర అనే విల‌న్ ఓ ప్రాంతాన్ని త‌న కంట్రోల్‌లో పెట్టుకుని ఉంటాడు. అక్క‌డి ప్ర‌జ‌లు అత‌ను చెప్పింది వినాల్సిందే. లేకుంటే వారికి చావే గ‌తి. అలాంటి వాడిని ఎదిరించ‌టానికి పోలీసుల‌కే గుండె ధైర్యం ఉండ‌దు. కానీ చెడుని అంత మొందించ‌టానికి మంచి ఏదో ఒక రూపంలో వ‌స్తుంది. అలాంటి అసురుడిని అంతమొందించ‌టానికి ఆ ప్రాంతంలోకి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ వ‌స్తాడు. త‌నేం చేశాడు.. ఎలా విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్టాడు.. అనేది తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 30న విడుద‌ల‌వుతున్న సినిమా చూడాల్సిందే.

ఈ సంద‌ర్భంగా దేవ్ గిల్ మాట్లాడుతూ ‘‘ ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆగస్ట్ 30న సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాలోని న‌టుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్ష‌కులు మ‌రో కోణాన్ని వెండితెర‌పై చూస్తారు " అని పేర్కొన్నారు.

దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ ‘‘అహో! విక్రమార్క' ద్వారా, భాష, సంస్కృతులను, వీరత్వం, త్యాగం సారాంశాన్ని చిత్రీకరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. పోలీసుల పవర్‌ను తెలియ‌జేసేలా సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం రూపొందించాం. సరికొత్త దేవ్ గిల్‌ను చూస్తారు ’’ అని అన్నారు.

న‌టీన‌టులు:

దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved